BREAKING NEWS

కర్నూలు బెలూం గుహల అందాలు

సరదాగా పర్యటించడానికి ఈ ప్రాంతం చాలా మంచి ప్రాంతం. కుటుంబంతో గడపడానికి ఈ ప్రదేశం చాలా సుందరంగా ఉంటుంది. అతి పురాతన కాలంలో ఏర్పడిన ఈ గుహలు దేశ విదేశీ స్థానిక పర్యాటక ప్రదేశంగా కీర్తి పొందాయి. ఈ గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం లో మండల కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. మన భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతి పెద్ద గుహలగా ప్రసిద్ధి చెందాయి.

చెప్పుకుపోతే ఈ గుహల గురించి చాలా చెప్పాలి. వర్ణించడానికి సరిపోదేమో అనిపిస్తుంది. బెలూం గుహలు ప్రత్యేక స్థానం పొందాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పొడవైన సొరంగ మార్గాలు అలానే జాలువారే శిలా స్పటికాలు. అయితే ఈ బెలూన్ గుహలు రకరకాల శిలా కృతులు అడుగడుగునా అబ్బుర పరిచే అద్భుతాలు ఇలా ఎన్నో ఉన్నాయి.

బెలూం గుహల చరిత్ర, అభివృద్ధి:

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి అని నిపుణులు అభిప్రాయ పడ్డారు. క్రీస్తుపూర్వం 4,500 సంవత్సరాల క్రితం బెలూం గుహలు ప్రాంతం లో మానవులు నివసించినట్లు తేలింది. ఈ విషయం అంతా అక్కడ లభించిన మట్టి పాత్రలు వల్ల తెలిసింది. చరిత్ర లో ఎన్నడూ బెలూం గుహలు గురించి ప్రస్తావన రాలేదు. మొదటి సారిగా 1884 లో రాబర్ట్ బ్రూస్ లీ ఫుట్  అనే ఆంగ్లేయుడు మాత్రమే మొదటి సారిగా బెలూం గుహల ప్రస్తావన తెచ్చాడు. 
 
రాబర్ట్ బ్రూస్ ప్రస్తావించిన తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు  గుహల గురించి ఎటువంటి ప్రస్తావన ఎవరి వల్ల రాలేదు మరియు 1982లో డానియల్ జబ్బర్ నాయకత్వం లో  బెలూం గుహల ను జర్మనీ కు సంబంధించిన నిపుణుల బృందం సందర్శించడం జరిగింది. వీటిని పరిశీలించడానికి ఆ బృందం రావడం విశేషం. నిజానికి ఈ బృందం వల్లనే ప్రపంచం మొత్తం ఈ గుహల చరిత్రను తెలుసుకున్నారు.

మరింత క్లుప్తంగా చెప్పాలంటే ఈ గుహలు భూగర్భం లో పది కిలో మీటర్లు విస్తరించి ఉన్నాయి అని వాళ్ళు కనిపెట్టారు. అలానే 2002 వ సంవత్సరం ఫిబ్రవరి నెల లో బెలూం గుహలు సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడకి అనేక మంది వచ్చి ఆ గుహలను చూస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలని, చుట్టు పక్కల ప్రాంతాలను కూడ అభివృద్ధి పరుస్తోంది.  

ఇలాంటి అభివృద్ధి చెందడం వల్ల అనేక మంది దీనిని చూడడానికి వస్తున్నారు.  1985 వ సంవత్సరం లో బెలూం గుహలని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1999 వ సంవత్సరం లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బెలూం గుహలని ఆదీనం లోకి తీసుకుంది. అలానే ఆ తర్వాత దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలో మీటర్ల దూరం వరకు సిమెంట్ స్లాబ్ రాళ్లతో నడవడానికి అనుకూలంగా దారి కూడా నిర్మించారు.

సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ గుహల  యొక్క సహజత్వానికి ఎటువంటి లోపం రాకుండా ఉండాలని కాంతి ఇచ్చే విద్యుద్దీపాలు అమర్చడం జరిగింది. ఈ గుహలు యొక్క ప్రవేశ ద్వారం దిగుడు బావి వలే ఉంటుంది మరియు దాని పూర్తి రూపు రేఖలు మార్చి భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న  బెలూం గుహలను సందర్శించడానికి సులువుగా ఉండేటట్టుగా మెట్లను నిర్మించడం జరిగింది. 

పర్యాటకులను దృష్టి లో ఉంచుకొని గుహలోపడ ఆక్సిజన్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈ గుహల లోనీకే ఆక్సిజన్ బ్లోయర్ లు  ఏర్పాటు కూడా చేశారు. ఈ గుహలు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఫౌంటెన్ కృత్రిమ మొక్కలను ఏర్పాటు చేశారు. దాంతో బెలూం గుహలు మరింత అందంగా కనబడుతున్నాయి.

పర్యాటకులు వివిధ ప్రాంతాల నుండి సందర్శించడానికి వస్తున్నారు. ఈ గుహలు సమీపం లో ఉన్న వ్యవసాయ భూమి అడుగున బెలూం గుహలు ఉన్నాయి. ఒక ప్రవేశ ద్వారమే కాకుండా దిగుడు బావి వంటి మూడు దారులు ఉన్నాయి. స్టాలక్ టైట్' లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటి లింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఇదంతా సహజ సిద్ధంగా ఏర్పడం వల్ల శివలింగంగా భావించారు.

బెలూం గుహలు కర్నూల్ ప్రాంతానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. హైదరాబాదు  మరియు బెంగళూరు నుండి అయితే 320 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలను చేరుకోవాలి అంటే కర్నూలు నంద్యాల మీదుగా వెళ్ళవచ్చు లేదంటే అనంతపురం జిల్లా నుండి తాడిపత్రి మీదగా వెళ్ళవచ్చు. రైలు ప్రయాణం ద్వారా వెళ్లాలనుకుంటే తాడిపత్రి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతం లో ఈ గుహలు మాత్రమే కాకుండా సందర్శించడానికి కొన్ని పురాతనమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి.

Photo Gallery