BREAKING NEWS

వేపతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వేప ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా మన పురాతన కాలం నుంచి కూడా వేప గొప్ప స్థానాన్ని దక్కించుకుంది. వేపకి ఉన్న విశిష్టత చాలా ప్రత్యేకమైనది. మన పెద్దలు ఈ వేపాకు గురించి అనేక విషయాలు చెప్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే వేపాకు లో దాదాపు 130 రకాల పదార్థాలు లభిస్తాయి. ఆయుర్వేద వైద్యం లో వేప ఆకు, బెరడు, పూలు, కొమ్మలు ఇలా ప్రతిదీ ఉపయోగ పడతాయి ఎందుకంటే దీనిలో ఉన్న ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు చాలా ప్రయోజనాలు వేప లో ఉన్నాయి.  అనేక సమస్యలను తొలగించడానికి సహాయ పడుతుంది , ఫీవర్, ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలు, దంత సమస్యలు ఇలా చాలా సమస్యలకు వేప దివ్యౌషధంలా పని చేస్తుంది.
 
అందుకే వేపతో సమస్యలని సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లల్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వేపాకు తో చికిత్స చేసేస్తూ ఉంటారు. వేపాకు తోరణాలు కట్టడం వల్ల  వేపాకులు దాటిన గాలి స్వచ్ఛంగా మారుతుందని నమ్మకం. దీనివల్ల బ్యాక్టీరియా వైరస్లు కూడా తొలగిపోతాయి. దీని వల్ల అనేక చర్మ సంరక్షణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేపాకును మెత్తగా నూరి ఆ పేస్ట్ను తీసుకోవడం  కానీ లేదా వేప కాడ నమలడం ద్వారా కానీ చేస్తే చక్కటి ప్రయోజనాలు మనకి లభిస్తాయి.
 
దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి వేపాకు నుండి మంచి ప్రాచుర్యం పొందడం ప్రారంభించాయి. చేదుగా ఉన్న ఈ వేపాకు లో వాత లక్షణాలని సమతుల్యం చేసే సామర్థ్యం ఉంది. అంతే కాకుండా వేప రక్తం నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఫ్రీ రాడికల్ యాక్టివిటీస్ ను శుద్ధి చేసే ప్రక్రియను పొందుతుంది. అంతే కాకుండా తలనొప్పి తగ్గడానికి శిరోజ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా వేపాకు ఉపయోగపడుతుంది. 
 
వేప వల్ల కలిగే ప్రయోజనాలు :
 
ఈ పాటికే మీకు వేప వల్ల కలిగే ప్రయోజనాలు అర్ధమైపోయి ఉంటాయి. అయితే వీటిని మరింత క్లుప్తంగా చెప్పాలంటే చాలా ఉంది. అయితే వీటిని కూడా చూసి మీకు వచ్చే సమస్యల నుంచి బయట పడండి. 
 
చర్మ సంరక్షణకి వేప:
 
వేపాకులను తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది. అంతే కాకుండా చర్మం క్లియర్ గా మారుతుంది. వేపాకు లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ పై పోరాటం చేస్తాయి. కాలిన గాయాలని, ఇతర చర్మ సమస్యలను, పురుగు గాట్లని, దురద, ఎక్జిమా , రింగ్ వార్మ్ వంటి సమస్యల నుంచి రక్షణ పొందడానికి వేప సహాయ పడుతుంది. వేపాకులను నమలడం వల్ల చర్మానికి పోషణ అందుతుంది. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది..
 
అందమైన కురుల కోసం వేప :
 
వేపాకు లో కేవలం పోషకాల మాత్రమే కాదు. దీనిలో మరెన్నో మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే వేప మన తలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయ పడుతుంది. అలాగే వేపాకులు హెల్త్ సెల్ డివిజన్ను ప్రేరేపించి తల పై హెయిర్ ఫాలికల్ గ్రోత్ ను పెంపొందిస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు మరిగించిన వేప నీళ్ళని ఉపయోగించి తల స్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగి పోతుంది. దీనితో పాటు దెబ్బతిన్న శిరోజాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి.  కాబట్టి వేప నూనె, వేప పొడి, వేప రసం ఎలా ఏమైనా మీరు వాడవచ్చు.
 
వేపాకుతో రోగ నిరోధక శక్తి :
 
రోగ నిరోధక శక్తి పెంచడానికి వేప బాగా సహాయ పడుతుంది. యాంటి మైక్రోబియల్ యాంటీవైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల వేపాకు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. అంతే కాకుండా దీనిని తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా తలెత్తే ఇబ్బందులు అరికట్ట బడతాయి. అలానే చాలా వ్యాధుల నుంచి కూడా ప్రమాదం తగ్గుతుంది. ఫ్లూ క్యాన్సర్ మరియు గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
 
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వేప :
 
వేపాకులు లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అంతే కాకుండా జీర్ణక్రియ ఆటోమేటిక్ గా మెరుగు పడుతుంది. అలానే రోజు వేపను తీసుకోవడం వల్ల ఇంటస్టైన్ లో నివసించే హానికరమైన బ్యాక్టీరియా అనేది హరించ పడుతుంది.
 
 కంటి సమస్యలుకి వేప :
 

కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో వేప ప్రధాన పాత్ర పోషిస్తుంది. వేపాకులను నమలడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. దీనితో పాటుగా కళ్ళల్లో మంట ఇన్ఫెక్షన్ అలసట వంటి సమస్యలు ఉంటే ఉపశమనం కోసం వేప నీళ్లల్లో మరగ పెట్టి చల్లారిన తర్వాత ఆ నీళ్ళని తీసుకుని కళ్లను కడుక్కోవడం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
చూసారు కదా..! వేప వల్ల కలిగే ప్రయోజనాలు... మీకు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు కూడా వేపాకుని మీ డైట్ లో చేర్చండి. సులువుగా దీనిని తీసుకుంటూ అనేక సమస్యల్ని తరిమికొట్టొచ్చు. కాబట్టి వేపాకుల్ని , వేపాకు వల్ల ప్రయోజనాలు గుర్తించి ఉపయోగించండి. అనేక అనారోగ్య సమస్యలకు చిటికెలో పరిష్కారం వేపతో...

Photo Gallery