BREAKING NEWS

చరిత్ర లో విజయనగర వైభవాలు

విజయనగరం చరిత్ర లో ఎనలేని కీర్తి పొందింది. విజయ నగరం అంటే చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఎక్కడ నుండి మొదలు పెట్టినా వర్ణించడం సులభం కాదు. చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి. విజయనగరం ప్రాచీన కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందిన పట్టణం. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు జన్మించారు, ఎనలేని కీర్తిని తీసుకొచ్చారు. ఇది విజయనగరం జిల్లాకు ముఖ్య పట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటి కంటే, విజయనగరం జిల్లా అత్యంత ఖ్యాతి పొందింది. ఇది విశాఖపట్నం కి డెబ్భై కిలో మీటర్ల దూరం లో ఉంది. ప్రాచీన కట్టడాలు, గంటస్తంభం కూడలి, రాజా వారి కోట, పైడితల్లమ్మ వారి ఆలయం  వామ్మో........ ఇలా ఎన్నో ఉన్నాయి...!

విజయనగరం చరిత్ర:

పూసపాటి వంశం వారు ఈ విజయనగర పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దానితో గజపతి రాజే తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడి లోకి వెళ్ళింది. మనకి స్వాతంత్య్రం వచ్చే దాకా వారే ఈ విజయనగరంని పరిపాలించారు.

గంటస్తంభం:

ఈ గంటస్తంభం ఎత్తు 68 అడుగులు. విజయనగరం మొత్తానికి గుర్తుండిపోయే చిహ్నంగా ఈ గంట స్తంభం ప్రసిద్ధి గాంచింది. హైదరాబాద్ లోని చార్మినార్ ఎలా ప్రసిద్ధి చెందినదో అలానే విజయనగరానికి ఈ చిహ్నం అంతగా ప్రసిద్ధి గాంచింది. అయితే ఇక్కడ దీన్ని నిర్మించడానికి బలమైన కారణం కూడా ఉంది. అయితే అప్పట్లో రాజులు విజయనగరాన్ని సందర్శించాలని బ్రిటిష్ వారిని కోరుతారు. అయితే రాజులు అంతగా చెబుతుండడం తో బ్రిటిష్ వారు వచ్చి వెళ్తారు. అయితే వాళ్లు వచ్చి వెళ్ళడానికి గుర్తుగా వారు లండన్ లోని అతిపెద్ద క్లాక్ టవర్ చూసి ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇలా ఈ విజయనగరం లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది విజయనగరం లో నాడీ మధ్య లో ఉన్నందున పర్యాటకుల్ని ఇది బాగా ఆకర్షించింది ఎవరికీ తెలియని బలమైన కారణం ఇదే.

ఆనాటి రోజుల్లో విద్యుత్ లేని కారణంగా అప్పటి పరిపాలకులు మన విజయనగరం లో మూడు లాంతర్లు కూడలి అయిన గంట స్తంభం మూడు వైపులా మూడు హరికేన్ లాంతరులను ఏర్పాటు చేశారు. దీని వల్ల రాత్రి పూట నెల్లిమర్ల ధర్మపురి గంట స్తంభం దారులలో వెళ్లేవారు కి సౌకర్యార్థంగా ఈ గంటస్తంభం గా మారింది. ఇది బాగా ఎడ్లబండ్లతోను వెళ్లేవారికి, పాదచారులుకి మంచి సౌకర్యం గా మారింది. ఇలా  ఇది విజయనగరం జిల్లా లో మరొక ప్రధాన ఆకర్షణగా మారింది.

రాజా వారి కోట:

ఈ రాజావారి కోట విజయనగరం లో బాగా పేరు గాంచింది. ఈ కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. అప్పట్లో మహా రాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించే వారట. కాలం మారుతూండడం తో  పాటు ఈ పేరు కూడా మారిపోయింది ఈ బంకుల దిబ్బ ఇప్పుడు బొంకుల దిబ్బగా మారింది. ఈ పేరు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అప్పట్లో ఈ ప్రదేశానికి ఒక ఇంజినీర్ వచ్చాడట. అతను వచ్చి భూగర్భ జలాలుని బయటకు తెప్పిస్తానని గొట్టాలని తెప్పించి వాటిని ఈ ప్రదేశం లోనే భూమిలోకి దింపడం జరిగింది.

కానీ నీరు మాత్రం రాలేదట. ఈ ప్రయత్నమంతా విఫలం కావడం తో ఆ ఇంజనీరు రాత్రికి రాత్రే పారిపోయాడు. దీనితో ఇంజినీర్ పలికిన బొంకు లేదు అబద్ధం ఆ ప్రదేశానికి పేరు అయ్యింది. ఈ బొంకుల దిబ్బ ఇప్పుడే కాదు ప్రసిద్ధి ఎప్పుడో చెందింది. సాహిత్యంలో మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని ఈ ప్రదేశం నుంచి ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా మారిపోయింది.

చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఆకర్షణలో విజయనగరం కోట చాలా ప్రధానమైనది 1713 వ సంవత్సరం లో ఈ కోట అప్పటి రాజులు నిర్మాణం చేశారు. అయితే అంతకు ముందు వారి కుమిలి అనే ప్రదేశంలో ఒక మట్టి కోటలో జీవనం సాగించేవారు. ఈ విజయనగరం కోట అంతా కూడా రాళ్లతో  నిర్మించారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోటను నిర్మించడం జరిగింది. చుట్టూ నాలుగు పెద్ద పెద్ద బురుజులతో కట్టబడింది ఈ కోట. అయితే అప్పట్లో శత్రువులు లోపలికి రాకూడదు అని ఈ కోట గోడల్ని 30 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అయితే ఈ కందకం రెండు ఏనుగులు లోనికి మునిగే అంత లోతు ఉంటుంది.

విజయనగరంలో ప్రముఖులు: 

విజయనగరం లో ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. గాయని సుశీల, భమిడిపాటి రామ గోపాలం, శ్రీ రంగం నారాయణ బాబు ఇలా ఎంతో మంది ప్రముఖులు విజయనగరానికి చెందిన వాళ్ళే. ఎంతో మంది సాహితీ వేత్తలు కూడా విజయనగరంలో జన్మించారు. 

 

Photo Gallery