BREAKING NEWS

రక్షాబంధన్ పండుగ విశిష్టత, విధానం

సోదరుడు, సోదరి కలిపి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. దీనిని రాఖి పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని అంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగనే శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అయితే పేర్లు వేరైనా పండుగ మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అక్క అన్న లేదా అన్న చెల్లెల్లు ఎంతో సరదాగా ఈ రోజున  ఆనందంగా జరుపుకుంటారు. కొంత కాలం క్రితం వరకూ ఈ పండుగని కేవలం ఉత్తర, పశ్చిమ భారతదేశాల లో అతి వైభవంగా జరుపుకునేవారు. కానీ నేడు మాత్రం దేశమంతా ఈ రాఖీ పండుగ  జరుపుతున్నారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. నిజంగా ఇది ఆచారం మాత్రమే కాదు ఎంతో అందంగా ఉంటుంది.

రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అనే చెప్పాలి. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుని, ఆనందంగా ఉండాలని, ఏ ఇబ్బందులు తలెత్తకుండా పైకి రావాలని అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహం తో జరుపుకుం‌టూరు. మనం ఇప్పుడు చెప్పుకునే ఈ రక్షా బంధన్ మొన్నో, నిన్నో ప్రారంభం కాలేదు. ఈ పండుగని ఎన్నో ఏళ్ల నాటి నుండి కూడా జరుపుకోవడం జరుగుతున్నదే.

రక్షా బంధన్ ప్రారంభం: 

పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. అయితే ఆ యుద్ధం లో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, మొత్తం తన పరీవారంని తాను తీసి కెళ్ళి అమరావతి లో తలదాచుకుంటాడు. అప్పుడు భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఆ తర్వాత రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి రోజుట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరం లో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీ దేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఇప్పుడు మనం జరుపుకునే రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. నిజంగా ఆనాటి జరిగిన వాటిని ఇప్పుడు అనుసరించడం మామూలు విషయమే. అంటే ఈ పండుగ కి ఎంత ఘనత ఉందో అర్ధమయ్యిందా...? 

రక్షా బంధన్ ని ఎప్పుడు ఎవరు జరుపుకుంటారు..? 

ఈ పండుగని కేవలం ఒక మతస్తులు మాత్రమే కాక హిందువులు, ముస్లీములు, క్రైస్తవులు, జైనులు, బుద్ధులు, సిక్కులు ఇలా అంతా జరుపుకుంటారు. అలానే ఈ పండుగని ప్రతీ సంవత్సరం శ్రావణ పౌర్ణిమ నాడు జరుపుంటారు. అంటే ఆగస్టు లేదా జులై లో రావచ్చు. 

జంధ్యాల పౌర్ణమి:

ఈ పండుగ రోజున నాడే జంధ్యాలు  నూతన జంధ్యాలు ధరిస్తారు. ఆ రోజు పాత జంధ్యం తొలగించి నూతన జంధ్యం ధరించడం జరుగుతుంది. ఇదే రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞో పవీత ధారణలు చేసి విద్యార్థులకు వేద పఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం, అభ్యసించడం చెయ్యడం జరుగుతుంది. అలానే ఆ వృత్తిని ప్రారంభించడం, ప్రారంభఋక్కును - చివరిఋక్కును ఇదే రోజున పఠించడం చేస్తారు.

పూర్వం యుద్ధానికి వెళ్ళే వీరునికి విజయం కలగాలని కోరుతూ ఈ రక్షాబంధనను కట్టే వారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ సొదరి - సోదరునకు, భార్య - భర్తకు ఈ రక్షాబంధన కడుతువుంటారు. 

"యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||"

ఇలా ఈ మంత్రం చెబుతూ సొదరి - సోదరునకు, భార్య - భర్తకు ఈ రక్షాబంధన కడుతువుంటారు. 

భార్య భర్తకి రక్షా బంధనం చేయవచ్చా..?

ఇంకా ఈ  రాఖీకి ఎంతో పవిత్ర ఉంది. ఈ రాఖీకి గల పవిత్రత ఏమిటంటే..? భార్య - భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రక్షాబంధన్ ద్వారా ఏమి కలుగుతుంది అంటే..?  కార్యాలు విజయవంతమై సుఖ సంపదలు కలగాలని సోదరుడు/భర్త బాసటగా నిలవాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ'. అందుకే అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరు కానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు. ఇలా చేస్తూ ఆనందంగా ఉంటారు. అప్పట్లో వివిధ రకాల యుద్ధాలు ఎక్కువగా జరగడం జరిగేది. అందుకే స్త్రీలు  వారి మాన ప్రాణ రక్షణకై వీరులైన యోధులను గుర్తించి వారికి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావంతో, రక్షణ పొందేవారు. 

నేటి రాఖీ పండుగ విధానం:

ఇప్పుడు తలా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి సొదరి- సోదరుడికి కుంకుమ పెట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు అందించి రాఖీ కట్టి నోరు తీపి చేసుకుంటున్నారు. సోదరుడు తన సోదరికి నచ్చిన బహుమతిని ఇచ్చి దీవిస్తున్నారు.