BREAKING NEWS

'వందేమాతరం' ప్రతిజ్ఞకర్త : బెంగాలీ ఛటర్జీ

'వందేమాతరం' గేయంతో ఆయన భారతీయులందరికి  సుపరిచుతులే! రచయిత, కవి, పాత్రికేయులు కూడా. ప్రసిద్ధ బంగ్లా రచయితల్లో ఒకరైన బంకిం చంద్ర రాసిన ఈ గీతం భారత స్వాతంత్ర సంగ్రామానికి బలం చేకూర్చింది.
తర్వాత ఈ గేయాన్ని ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో చేర్చారు.
బహిరంగంగా గానం చేయటాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించినా, తర్వాత పాఠశాలలో విధిగా పాడే ప్రతిజ్ఞ అయింది. 
దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన నాటి ఆధునిక బంగ్లా నవలాకారుడు ఛటర్జీ గూర్చి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం.
 
బాల్యం:-

బంకిం చంద్ర ఛటర్జీ 1838 జూన్ 27న బెంగాల్‌ నైహతి సమీపంలోని కంతల్పరా గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తండ్రి యాదవ్ చంద్ర ఛటోపాధ్యాయ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో పనిచేశారు. తల్లి దుర్గాదేవి ఛటోపాధ్యాయ. బంకిం చంద్ర అసలు పేరు బంకిం చంద్ర ఛటోపాధ్యాయ. కానీ బ్రిటిష్ అధికారులు ఛటోపాధ్యాయ అని పలకలేక ఛటర్జీ అని పిలిచేవారు.
 
విద్యాభ్యాసం:-

బంకిం చంద్రకు సంస్కృతి సాహిత్యం అంటే ప్రీతి! 1856లో బంకిం చంద్ర ఛటర్జీ హోగ్లీ మోహ్సినా కాలేజీలో చదివి, తర్వాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1858లో బిఎ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. భారత్ లో మొట్టమొదటిసారిగా డిగ్రీ పట్టా పొందిన తొలివ్యక్తి ఈయన. అప్పట్లో కోల్ కత్తా లెఫ్టినెంట్ గవర్నర్ అదే సంవత్సరంలో బంకిం చంద్రను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.

అతని తండ్రి యాదవ్ చంద్ర అదే హోదాలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందారు. ఆయన తర్వాత తన తండ్రి కోరిక మేరకు ఈ ఉద్యోగంలో చేరారు. ఈయనకి లా పట్ల కూడా ఆసక్తి ఉండడంతో ఎల్.ఎల్.బిలో పరీక్ష రాసి పాసయ్యారు. అదే సమయంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ గా ఉద్యోగం వచ్చింది. అలా ముప్పైరెండు సంవత్సరాలదాకా అందులో కొనసాగారు. 1891లో ఉద్యోగ విరమణ చెందారు. 

బంకిం చంద్రకి పదకొండేళ్ళ వయసులో వివాహం జరిగింది. మొదటి భార్య  అనారోగ్యంతో చనిపోయింది. అప్పుడు బంకిం చంద్ర వయసు ఇరవై రెండు. ఆయన మరలా వివాహం చేసుకున్నారు. భార్య పేరు రాజ్యలక్ష్మి దేవి. వీరివూరికి ముగ్గురు కుమార్తెలు.
 
రచనలు:-

ఆయన సాహితీ ప్రస్థానం ద్వారా బెంగాలీ ప్రజలకు వీలుగా ఉండేలా 1872లో 'బంగా దర్శన్' అనే నెలవారీ పత్రికను తీసుకువచ్చారు.
బెంగాలీ భాషలో రాసిన మొదటి నవల - 'దుర్గేశ్ నందిని'. 
1882లో 'ఆనంద్ మఠ్' రాశారు. 1864లో రాజ్ మోహన్స్ వైఫ్ అనే ఇంగ్లీష్ నవలను రాశారు.
దుర్గేశ్‌ నందిని, కపాల కుండల, మృణాళిని, దేవీ చౌధురాణి.. ఇలా దాదాపు 15 నవలలు రాశారు.
1886లో కృష్ణ చరిత్ర, ధర్మతత్వం, శ్రీమద్ భగవత్ గీత, లలితా ఓ మానస్ 
లాంటి సంకలనాలు చేశారు.
 
◆'ఆనంద్ మఠ్'  అనే నవల 1882లో ప్రచురితమైంది. ఈ నవలను ఛటర్జీ పది సంవత్సరాలలో ఐదుసార్లు రిపబ్లిష్ చేశారు. 
ఈ నవలలోని "వందేమాతరం" అనే గేయాన్ని వివిధ భారతీయ భాషలలోకి  అనువదించడం వల్ల దేశవ్యాప్తంగా ఈ గేయం ప్రాచుర్యం పొందింది. దీనికి రవీంద్రుడు బాణీకట్టారు.
ఈ నవలను చనిపోయిన తన మిత్రుడు దీనాబంధు మిత్రకు అంకితమిచ్చారు.
 
◆ఛటర్జీ 1891లో 'రాయ్ బహదూర్' బిరుదును అందుకున్నారు.
ఛటర్జీ నవలలు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లో అనువాదమయ్యాయి. 
 
◆ప్రమత్నాథ్ బిషి వంటి కొందరు విమర్శుకులు "బంగ్లా సాహిత్యం"లో ఉత్తమ నవలా రచయితగా ఛటర్జీని ప్రశంసించకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.   
 
●ఛటర్జీ తన 32వ ఏటా తల్లి మరణించగా, పదేళ్ల తర్వాత తండ్రి మరణించారు. ఆ బాధతోనే ఆయన కోల్ కత్తా చేరుకున్నారు.
 
మరణం:-

ఛటర్జీకి మధుమేహం ఉండడంతో అది ముదిరి 5న కోమాలోకి వెళ్ళి అదే రోజు రాత్రి స్పృహలోకి వచ్చారు. మూడు రోజుల తర్వాత, ఏప్రిల్ 8,1894న కన్నుమూశారు.
 
వందేమాతరం గేయం:- 

వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం 
మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీ
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీ
సుహాసినీ సుమధుర భాషిణీ
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం.
 
అర్ధం:- 
 
అమ్మా నీకు వందనం...
తాగేందుకు మంచినీరు, 
తినేందుకు ఫలాలను, 
ఏవైపు చూసిన పచ్చని పంటపొలాలతో,  
వీచే చల్లని గాలులను మాకు అందించిన ఓ భూమాత..
నీకు వందనం!
 
పేరుకీ బెంగాలీ రచయితైన… ఆయన రాసిన నవలలు అన్ని భాషల్లో అనువాదం కావడం విశేషం!
(జూన్ 27న ఆయన పుట్టినరోజు)