గోల్ కీపర్ నుంచి వికెట్ కీపర్ గా మారి,
సరికొత్త ఎలికాఫ్టర్ షాట్లతో…
పొడుగాటి జుట్టుతో...
అభిమానుల్లో క్రేజ్ సంపాదించాడు.
మొదట్లో రైల్వే టిటిఆర్ గా ఉద్యోగం చేసినా…
క్రికెట్ మీదున్న కాంక్షతో వికెట్ కీపర్ కం బ్యాట్స్ మన్ స్థాయికి చేరాడు.
లోకల్ టోర్నమెంట్ల నుంచి టీ20 వరల్డ్ కప్ దాకా ఎన్నో మ్యాచ్ లు ఆడి,
కెప్టెన్ అయ్యాడు.
'మిస్టర్ కూల్ కెప్టెన్'గా భారత జట్టును నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టాడు.
ఆటకి రిటైర్మెంట్ ఇచ్చినా…
అతని ఆట అందించిన విజయాలకు
కప్ లూ చాలవు.
అటువంటి ధోని జీవిత, క్రికెట్ విశేషాల గురుంచి ప్రత్యేకంగా తెలుసుకుందాం.
జననం:-
మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7న బీహార్ లోని రాంచీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి పాన్ సింగ్, తల్లి దేవిక దేవి. అక్క జయంతి గుప్తా, తమ్ముడు నరేంద్ర సింగ్. తండ్రి రాంచీలోని మెకాన్ కంపెనీలో ఉద్యోగం రావడంతో బీహార్ వదిలి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డారు.
చదువు:-
ధోనీ రాంచీలోని శ్యామాలిలో జవహర్ విద్యా మందిర్ లో స్కూలింగ్ పూర్తయ్యింది. ఇంటర్ ఆర్.ఎస్.జె.సి కాలేజీలో, డిగ్రీ రాంచీలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరాడు. అనివార్య కారణాల వల్ల ఆ చదువును మధ్యలోనే ఆపేశాడు.
క్రికెట్ ప్రస్థానం:-
ధోనికి చిన్నప్పటి నుంచి ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. అంతేకాదు ఫుట్ బాల్ గోల్ కీపర్ గా జాతీయ స్థాయి, క్లబ్ స్థాయిల్లో ఆడి గెలిచాడు.
క్రికెట్ కోచ్ కె.ఆర్ బెనర్జీ అతని గోల్ కీపింగ్ నైపుణ్యం చూసి ఖాళీగా ఉన్న వికెట్ కీపర్ స్థానం ధోనికైతే తగినదని, క్రికెట్ ఆడటానికి మైదానానికి ఆహ్వానించాడు. తనకప్పుడు ఇష్టం లేకపోయినా, దానిలో శిక్షణ తీసుకున్నాడు. అంతేనా బ్యాటింగ్ కూడా నేర్చుకొని, లోకల్ టోర్నమెంట్ లు కూడా ఆడేవాడు.
అలా 1995-1998ల వరకు వికెట్ కీపర్ గా ఆడాడు.
1997- 1998లో అండర్-16కి సెలెక్ట్ అయ్యి, స్కూల్, కాలేజీ టోర్నమెంట్లకు ఆడాడు.
అండర్-19లో బిహార్ టీంలో 5 మ్యాచ్‌ల్లో ఆడి, 176 పరుగులు తీశాడు. ఈ టోర్నమెంట్ లో ఎలికాఫ్టర్ షాట్లతో అక్కడున్నవాళ్ళందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
1999-2000లో రంజి ట్రోఫిలోనూ ఆడి, గెలిచాడు.
ఉద్యోగం:-
తండ్రికోరిక మేరకు రైల్వే టిటిఆర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అక్కడ ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. అలా మూడు సంవత్సరాలు గడిచాక ఏదో వెలితీగా అనిపించేది. మనసులో మాత్రం క్రికెట్ ఆడాలని బలంగా ఉండేది. ఉద్యోగంలో పైఅధికారి ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ ఆటపై దృష్టి సారించాడు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. అదే సమయంలో బీసీసీఐ మారుమూల గ్రామాల్లో క్రికెట్ లో ప్రతిభ ఉన్నవాళ్ల కోసం చూస్తుంది. ఆ బోర్డ్ టీంలో ఒకరైన ప్రకాష్ పొద్దర్ దృష్టి ధోనిపై పడింది.
అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంభం:-
2004 డిసెంబర్ 23న అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్‌తో ఇండియా వన్డే మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో జింబాబ్వే, కెన్యా పర్యటనలకు ధోని ఎంపికయ్యాడు. తన ఆటతో చక్కని ప్రదర్శననిచ్చాడు. 2005, 2006లో వరుసగా టెస్ట్, టీ20 మ్యాచ్ లను ఆడాడు.
2007లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, ఆ తరువాతి కెప్టెన్ గా భారత జట్టుకు ధోని ఎంపికయ్యాడు.
రికార్డులు:-
2007లోని భారత్ టీ20 ప్రపంచ కప్, 2011లో ఇండియా ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ... ఆడి ఇండియన్ టీంను నెంబర్ వన్ టెస్ట్ జట్టుగా నిలిపాడు.
వన్డేల్లో 183 పరుగులు తీసి, అత్యధిక స్కోర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
కెప్టెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ల్లో ఎక్కువ సిక్సర్లు, అత్యధిక స్టంపింగ్ లు వేశాడు.
టీ20 ఇంటర్నేషనల్ లో ఇండియన్ కెప్టెన్‌గా భారత్ తరఫున ఎన్నో విజయాలు అందించాడు.
టెస్ట్ మ్యాచ్ లో 4,000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్ తో ఆడిన ఓ మ్యాచ్ లో 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు.
అంతేకాదు క్రికెట్ చరిత్రలోనే మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా ధోనీ ఘనత సాధించారు.
ప్రపంచ క్రికెట్ లో రికీ పాంటింగ్(324), స్టీఫెన్ ఫ్లెమింగ్(303) తర్వాత 300కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ధోని కెప్టెన్‌గా నిలబడ్డారు.
మొత్తం 3 ఫార్మాట్లలో కెప్టెన్ గా, 50కి పైగా మ్యాచ్‌లలో ఆడిన క్రికెటర్ గా పేరు పొందాడు.
విజయాలు:-
2006లో MTV ధోనిని 'యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటిస్తే, 2008 అలాగే 2009లో ఐసిసి 'వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా, 2011లో సిఎన్ఎన్- ఐబిఎన్ 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ స్పోర్ట్స్'గా, 2011లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గా ప్రఖ్యాతి గాంచాడు.
◆2007లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్ లు అందుకున్నాడు.
◆ధోని చిన్ననాటి స్నేహితురాలు సాక్షితో 2010 డిసెంబర్ 30న వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప. పేరు జీవా ధోని.
ఆటకు రిటైర్మెంట్:-
2014లో డిసెంబర్ లో మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు.
2017లో జనవరిలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటునట్లుగా ప్రకటించారు.
2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి శాశ్వత రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఐపీఎల్లో 11 ఏళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉన్నారు. మూడుసార్లు కప్ అందించడంతోపాటు, పది సీజన్లలో జట్టును ప్లేఆఫ్ కు చేర్చారు.
విశేషాలు:-
◆ధోని క్రికెట్ ఆడే కొత్తలో తన జుట్టును బాగా ఇష్టంగా పెంచుకునేవారట. అది చూసి చాలామంది ఫ్యాన్స్ ధోనీ హెయిర్ స్టైల్ ను తెగ ఫాలో అయ్యారు.
అంతేకాదు, అతనికి కార్లు, బైకులన్నా ఇష్టం. మ్యాచ్ లు లేనప్పుడు సరదాగా బయట తిరిగేవారట.
◆2012 ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన క్రికెటర్ గా ధోని పేరును ప్రచురించింది.
◆ధోని 2016లో రితి గ్రూపుతో కలిసి ఫ్యాషన్ బ్రాండ్ 'సెవెన్'ను ప్రారంభించాడు.
◆ఇదేకాక 'సూపర్ స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్షిప్'కు వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
◆2016లో అతని జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ బయోపిక్ గా హిందీలో విడుదలైంది, ఆ తర్వాత తెలుగులోనూ డబ్బయింది.