BREAKING NEWS

లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ఉమెన్: స్మృతి

క్రికెట్ అంటే కేవలం పురుషులకే పరిమితమనుకుంటే ఎలా? ఇప్పుడు మహిళలు సైతం గ్రౌండ్లో చేరి, అదరగొడుతున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అలాంటిది… 
మహిళా క్రికెటర్లలో ఎవరికి లేనంత క్రేజ్, ఫాన్ ఫాలోయింగ్ అమెకే దక్కింది.
వన్డే మొదలు టీ- 20, ప్రపంచ కప్ అంటూ అనేక విభాగాలలో ఆడి, తన పేరు అందరికీ గుర్తుండిపోయేలా చేసింది.
ఎన్నో అవార్డులు, రికార్డులు…
అంతేనా,
చిన్న వయసులోనే కెప్టెన్ అయ్యింది. 'లెఫ్ట్ హాండ్ బ్యాట్స్ ఉమెన్'గా ఎన్నో పరుగులు తీసింది.
అటువంటి స్మృతి మంధన నిజజీవిత, క్రీడా విశేషాల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
జననం:-

స్మృతి మంధన ముంబయిలోని సాంగ్లీ అనే గ్రామంలో 1996 జులై 18న మార్వారీ కుటుంబంలో జన్మించింది.  తండ్రి శ్రీనివాస్ మంధన. ఈయన అప్పట్లో జిల్లాస్థాయి క్రికెట్ ఆడారు. తల్లి స్మితా మంధన. అన్న పేరు శ్రావణ్ మంధన. ఒకప్పుడు ఈయన కూడా జిల్లాస్థాయి క్రికెట్ ఆడారు. ఇప్పుడు సాంగ్లిలోని ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నారు.
 
చదువు:-
స్మృతి సాంగ్లీలోని పాఠశాలలోనే చదువుకుంది. అక్కడే చింతామన్ రావ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బిజినెస్ కోర్సులో డిగ్రీ పట్టా పొందింది. 
 
క్రికెట్ ప్రారంభం:-

అన్న శ్రవణ్ క్రికెట్ ఆడటం చూసి తను క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంది. ఇక అప్పటినుంచి ఆటపైనే పూర్తి దృష్టి పెట్టింది. జూనియర్ స్టేట్ కోచ్ అయిన అనంత్ తంబ్వేకర్ దగ్గర కొన్నాళ్ళు  శిక్షణ పొందింది. 9 ఏళ్ల వయసులోనే జిల్లా స్థాయిలో అండర్-15 జట్టుకు ఎంపికైంది. 2007లో, 11 ఏళ్ళ వయసులో అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఆడింది. ఆ మ్యాచ్ లో  బ్యాటింగ్ చేసి ఎక్కువ పరుగులు తీసింది. ఆ తర్వాత తన ఆట తీరును పరిశీలించి, 2013 ఏప్రిల్ 10న అంతర్జాతీయ మహిళా క్రికెట్ లోకి తీసుకున్నారు.

అలా అహ్మదాబాద్ లో బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో 22 బంతుల్లో, 51 పరుగులు చేసి ఇండియాను గెలిపించింది. ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ తోనే  టీ- 20 మ్యాచ్ లకు కూడా ఎంపికయ్యింది.
2014 ఆగస్టు13న వార్మ్స్ లో జరిగిన ఇంగ్లాండ్ మహిళా టెస్ట్ సిరీస్ కి  
స్మృతిని తీసుకున్నారు.   
2016లో ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన మ్యాచ్ లో 102 పరుగులతో తన మొదటి సెంచరీని ఖాతాలో వేసుకుంది.
2017లో జరిగిన ప్రపంచ కప్ కు ఎంపికయ్యింది. క్వాలిఫైయర్ లో గెలుపొందినా, ఫైనల్ లో ఇంగ్లాండ్ భారత్ పైన తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది. ఓడిపోయిన కూడా మిగతా జట్టుకు మాత్రం గట్టి పోటీనిచ్చింది.
2019లో న్యూజిల్యాండ్ టీ- 20లో 24 బంతుల్లో సెంచరీ కొట్టి, రికార్డు సృష్టించింది.
2017, 2018లో వెస్టిండీస్ తో అంతర్జాతీయ మహిళా టీ- 20 టోర్నమెంట్ లో వెయ్యి పరుగులు సాధించి, మూడవ క్రికెటర్ గా పేరుకెక్కింది.
 
అవార్డులు:-

◆2016లో 'ఐసీసీ- ఉమెన్స్ టీం ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకుంది.
2017, 2018లో జరిగిన వన్డే మ్యాచ్ ◆సిరీస్ లో "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు" ను తీసుకుంది.  
◆2018లో 'ఉత్తమ మహిళ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా రేచల్ హేయహో ఫ్లింట్ అవార్డ్ ఇచ్చారు.
◆2019లో 'ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా అవార్డును గెలుచుకుంది.
భారతదేశానికి 22 ఏళ్ల వయసులోనే జట్టు కెప్టెన్ అయి మరో రికార్డును సృష్టించింది.
2018లో 'అర్జున అవార్డ్' పొందింది.
 
 ఇతర విశేషాలు:-
 
◆క్రికెట్ ఆడటానికి ఆమె కుటుంబం ఎంతో ప్రోత్సహించేదట. స్మృతి ఆటకు సంబంధించి తీసుకునే ఆహారం విషయంలో ఆమె తల్లి స్మితా, ప్రాక్టీస్ విషయంలో ఆమె తండ్రి ఇద్దరు దగ్గరుండి చూసుకునేవారట.
 
◆స్మృతికి మాథ్యూ హేడెన్‌ బ్యాటింగ్ అంటే ఇష్టమట. కానీ తన ఆటతీరు వేరేలా ఉండేది. ఒకసారి అతనే ఆమె బ్యాటింగ్ చూసి మెచ్చుకోవడం విశేషం.
 
◆ఇప్పుడు క్రికెట్ ఆడుతూనే తన సంపాదనలో కొంత మొత్తం సాంగ్లీలోని "ఎస్.ఎం- 18 కేఫ్" అనే పేరుతో రెస్టారెంట్ ను నడిపిస్తోంది.
 
◆ఒకవేళ క్రికెటర్ ని కాకపోయుంటే హోటల్ మేనేజ్ మెంట్ చేసేదాన్ని. నాకు వంట చేయడమంటే భలే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
 
◆క్రికెట్ ఫీల్డ్ లో సీరియస్ గా కనపడే స్మృతి బయట మాత్రం అందరితో చాలా సరదాగా ఉంటుంది. 
తీరిక సమయాల్లో అర్జీత్ సింగ్ పాటలను వినడానికి ఇష్టపడుతుంది.
 
◆"ప్లేయర్జ్ పాట్" అనే క్రికెట్ యాప్ కోసం భువేనేశ్వర్ తో కలిసి స్మృతి  ఓ యాడ్ లో నటించింది.
 
◆ఉమెన్స్ బిగ్ బాష్ లో ఆడటానికి సంతకం చేసిన వాళ్లలో హర్మన్ ప్రీత్ తో పాటు స్మృతి మంధన సైతం ఉన్నారు.