BREAKING NEWS

నల్లజాతీయుల కోసం పుట్టిన మహనీయుడు… 'మదిబా'!

ఆఫ్రికా నేలలో బంగారు గనులను కనుగొన్నారు. వీటి కోసం బ్రిటిషు వాళ్లు ఇక్కడికి వచ్చి, భూమి తవ్వి గనులు పట్టుకుపోయేవారు. అనతి కాలంలోనే నల్లజాతీయులు వందమంది ఉంటే అందులో కనీసం 14 మంది వీళ్లే ఉండేలా పాతుకుపోయారు. అంతేకాదు ఆ చోట పూర్తి అధికారం బ్రిటిషు వారే తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో వారిని ఎదిరించడానికి నెల్సన్ మండేలా అనే నల్లజాతీయుడు పుట్టుకొచ్చాడు. ఎన్నో ఏళ్ళు జైల్లో గడిపారు. మరణానికి కూడా వెనుకాడలేదు. అటువంటి యోధుడు ఈ నెల 18న పుట్టిన సందర్భంగా ఆయన జీవిత, పోరాట విశేషాల గురుంచి మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
జననం

1918 జులై 18న జన్మించారు నెల్సన్ మండేలా. యుక్త వయసు నుంచే ఆఫ్రికాలో వేళ్లు నాటుకుపోయిన జాతి వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. ఈ పోరాటంలో భాగంగా 1956 జనవరి 5న తొలిసారిగా అరెస్టు అయ్యాడు. ఐదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తరువాత నేరుగా తెల్లదొరలపై పోరాటం చేయాలనుకున్నాడు. అలా 1961లో ‘ఉమ్ ఖోమ్ టోవి సిజ్వే’ అనే పేరుతో సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాడు.

1962లో ఆగస్టు 6న రెండోసారి ఈయనను అరెస్టు చేశాడు. రెండేళ్ల తరువాత 1964లో జీవితఖైదీ శిక్ష పడింది. రోబెన్ అనే ద్వీపంలో దాదాపు 27 ఏళ్ళపాటు జైలు శిక్షను అనుభవించాడు. ప్రపంచ దేశాల ఒత్తిడితో ఆ దేశ ప్రభుత్వం ఈయనను 1990 ఫిబ్రవరి 11న విడుదల చేసింది. ఆ తరువాత నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బహుళ జాతి వారితో సమావేశం ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి అన్ని జాతుల వారికి కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు నెల్సన్ పాటు పడ్డారు. ఆ క్రతువులో భాగంగానే ప్రజల మద్దతుతో నెల్సన్ మండేలా నల్లజాతికి చెందిన వ్యక్తిగా 1994 మే 10న దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జాతిపిత గాంధీజీ అహింస విధానం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని మండేలా అనేవారు. 

ఈయన అసలు పేరు రోలిహ్లాహ్లా మండేలా. పాఠశాలోని ఒక ఉపాధ్యాయుడు ఈయనకి "నెల్సన్" అనే పేరు పెట్టారు. (ప్రసిద్ధుడైన ఒక బ్రిటీష్ నావికాదళ నాయకుడి పేరు హోరేషియా నెల్సన్). ఆయన పేరునే మండేలాకు పెట్టారు. ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి రోలిహ్లాహ్లా అని పేరు పలకడం రాలేదు. నెల్సన్ తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి క్షయ వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత చదువును కొనసాగించాడు. 1937లో మండేలా "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌ టౌన్" అనే కళాశాలలో చదువుకున్నాడు. ఆ తరువాత ‘ఫోర్ట్‌హేర్ విశ్వవిద్యాలయం'లో బీఏలో చేరాడు. 
అతను జైల్లో ఉన్నపుడు లండన్ యూనివర్సిటీలో దూరవిద్యలో ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు. ఈయనకు బాక్సింగ్, పరుగు పందెం అంటే మక్కువ ఎక్కువ.
 
జైలుకు ఎందుకు వెళ్లారంటే… 

జాతి వివక్షకు వ్యతిరేకంగా, నల్లజాతీయుల స్వేచ్ఛ సమానత్వ హక్కుల కోసం పోరాటం సాగించాడు. అందుకే ఈయన్ని దేశ ద్రోహిగా, ఉగ్రవాదిగా ముద్ర వేశారు తెల్లజాతీయులు. దాదాపు జైల్లో ఇరవై ఆరేళ్లు గడిపారు. 
1944లో ఆఫ్రికాలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యాయవ్యాదిగా 1952లో ప్రాక్టీస్ చేశారు. 1960లో నేషనల్ కాంగ్రెస్ పార్టీని వివిధ కారణాలతో మూసివేశారు. అంతేకాదు అందులో ఉన్న వారందరిని దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించారు.

అలా 1962లో ఈయన మీద కూడా అనేక నేరాలు మోపి ఉరి తీయాలని భావించారు. బస్సులో కూడా తెల్లజాతీయులే కూర్చోవాలని బ్రిటిషు వారు అధికారం చెల్లాయించేవారు. అలా గాంధీని కూడా ఫుట్ బోర్డు పైన కూర్చోబెట్టారు. అంతేకాదు నల్లజాతీయులకు ఉన్న హక్కులను కూడా లాగేసుకున్నారు. ఎట్టకేలకు నెల్సన్ ను ఉరి తీయాలని బ్రిటిషు ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇతర దేశాల ఒత్తిడితో ఈయనకి యావజ్జివ కారాగార శిక్ష విధించాలని నిర్దేశించింది. దీంతో     
రెండోసారి పోటీలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని 1999లో పదవి విరమణ చేశారు. 
 
జైల్లో ఏం చేశారంటే

జైల్లో నెల్సన్ ని రోడ్లు వేసే పనుల్లో భాగంగా రాళ్లను కొట్టించేవారు. అంతేకాదు అందుకు కావాల్సిన ఇతర పనులను సైతం ఈయనతోనే చేయించేవారు. జైల్లో నెల్సన్ ఆరడుగుల వ్యక్తి అయితే ఐదు అడుగుల కంటే తక్కువ ఉన్న స్థలాన్ని ఇచ్చారు. జైల్లో ఉండే వార్డెన్ లు ఈయనతో పాటు ఉన్న మిగతా ఖైదీలను కూడా చిత్ర హింసలకు గురిచేసేవారు. కేవలం ఆరు నెలలకోసారి మాత్రమే వారి బంధువులను కలుసుకునే వెసులుబాటు కలిపించేవారు. ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారుకాదు. ఈయన పట్ల కఠినంగా వ్యవహరించేవారు. ఈయన జైల్లో ఉంటూనే ‘వార్ అండ్ పీస్’’, ‘గ్రేప్స్ ఆఫ్ వ్రాత్’ అనే పుస్తకాలను చదివారు.   
 
జైలు నుంచి రాక… 

నెల్సన్ జైలు నుంచి విడుదలయ్యాక ఈయనను కలవడానికి ఎంతోమంది ప్రజలు తరలివచ్చారు. అప్పట్లో మిస్టర్.డి. కాలేర్క్ అనే బ్రిటిషు వ్యక్తి, అక్కడ ఉన్న తెల్లవారికే కాదు నల్లజాతి వారికి కూడా ప్రధానమంత్రిగా వ్యవహారించారు. ఈయనే నెల్సన్ ను జైలు నుంచి విడుదల చేయడంలో కీలకంగా ఉన్నారు.

అధిక సంఖ్యలో నల్లజాతీయులు ఉన్న కారణంతో, వారినే అధికారంలో కూర్చోబెట్టాలని కాలేర్క్ నిర్ణయం తీసుకున్నారు. అలా ఆలివర్ టాంబో అనే సీనియర్ వ్యక్తిని కూర్చోబెట్టాలనుకున్నారు కూడా. అనుకోకుండా అతనికి గుండెపోటు రావడంతో అతని స్థానంలో నెల్సన్ కు అధికారం అప్పగించారు. ప్రధానమంత్రి అయిన తెల్లవారిపైన పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేనివాడు నెల్సన్. ఈయన ఆలోచన ఎప్పుడు ఆఫ్రికాను మంచి స్థాయిలో నిలబెట్టడం. నా దేశానికి స్వాతంత్య్రం రావాలని ఎప్పుడు తప్పించేవాడు. 

ఈయన చిన్న చిన్న అక్షరాలతో “ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్” అని రాసుకునేవారు. 

జైల్లో ఉన్న సమయంలో ఎండలు కొడుతున్నప్పుడు రాళ్లు కొట్టమని చెప్పేవారు. దాంతో ఆయన కంటి చూపు మసకబారింది. అయినా ఆయన అలాగే ఉన్నారు. ఆఫ్రికన్ హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేశారు నెల్సన్. 

2001 జులైలో ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. చివరికి 2013 డిసెంబర్ 5న, తన 95వ ఏట మరణించారు. 
 
బిరుదులు

ఈయనని ‘మదిబా’ అనే గౌరవసూచకంగా పిలిచేవారు. 

1990లో భారత ప్రభుత్వం నెల్సన్ మండేలాకు ‘భారత రత్న’ పురస్కారంతో సత్కరించింది. 

1993లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు