BREAKING NEWS

రాజమహేంద్రవరం- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని...

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో జిల్లాలు ఉన్నా... తూర్పు గోదావరి అంటే మహా ఇష్టం అందరికీ. అందులో రాజమండ్రి మరీ ప్రత్యేకమైనది. ఎక్కడ నుండి మొదలు పెట్టిన చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. తీరిక, ఓపిక ఉండాలి కానీ చూడ దగ్గ ప్రదేశాలు ఉన్నో..... ఇలా చెప్పుకుపోతే రాజమండ్రి గురించి ఎన్నో ఉన్నాయి. టంగుటూరి సూర్య కుమారి, కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్ ముఖ్, పింగళి సూరన్న, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి వంటి ఎందరో మహనీయులు ఇక్కడే జన్మించారు.  

రాజమండ్రిని ప్రాచుర్యం పొందిన ఆంధ్ర ప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని అంటారు. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం లోనే నన్నయ కవి తెలుగు లిపి కనుగొన్నాడు అని అంటారు. ఈ రాజమండ్రికి పూర్వ నామం రాజమహేంద్రి. ఈ ప్రాంతం లో వేదం సంస్కృతీ, పురాణాలకి కట్టుబడి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఇంకా పురాతన ఆచారాల్ని పాటిస్తారు. ఈ కార్పొరేషన్ ని ప్రభుత్వం అధికారంగా ''సంస్కృతీ యొక్క గ్రాండ్ నగరం'' గా నామకరణం చెయ్యడం జరిగింది.

పుష్కరాలు: ప్రతీ పన్నెండు సంవత్సరాలకి ఒక సారి ఇక్కడ గోదావరి పుష్కరాలు జరుగుతాయి. రాజమహేంద్రవరం లో గత పుష్కరాలు 2015 లో  జరిగాయి. దీని కోసం నిర్మించిన కోటి లింగాల ఘాట్ ముఖ్యమైనది, దీనిని అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా ఆధునీకరిస్తున్నారు.

గోదావరి హారతి: ప్రతి రోజూ గోదావరికి నిత్య హారతి ఇస్తారు. దీనిని 2015 వ సంవత్సరం గోదావరి మాహా పుష్కరం సందర్భంగా గోదావరి మాతకు నిత్యా హరతి ఇచ్చారు. అలానే సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు. అంతే కాకుండా  కోటగుమ్మం లోని మహా శివుని విగ్రహం వద్ద ప్రతి మాస శివరాత్రికి అలానే ప్రతి సంవత్సరం మహా శివ రాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు.

రాజమండ్రిలో ఎన్నో చూడ దగ్గ  ప్రదేశాలు ఉన్నాయి. దేవాలయాలకి ఇక్కడ కొదవే లేదు. అలానే సాయంకాలం వేళ పిల్లలు, పెద్దలు సరదాగా బయటకి వచ్చి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇటువంటి ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మికమైన ప్రదేశంలో ఎన్నో ఉన్నాయి.... ముఖ్యమైన ప్రదేశాలు మీకోసం....

ఇస్కాన్ టెంపుల్:

రాజమండ్రిలో వుండే ఈ ఇస్కాన్ టెంపుల్ ఆరాధనా, వినోద ప్రదేశం. ఈ ప్రదేశం గౌతమి ఘాట్ కి సమీపములో ఉంది. ఇస్కాన్ వాళ్ళు రెండు ఎకరాల విస్తీర్ణము లో దీనిని నిర్మించడం జరిగింది. ఇది రెండవ అతి పెద్ద ఇస్కాన్ మందిరం. ఈ దేవాలయంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనేక మంది భక్తులు వస్తూంటారు.

కోటిలింగేశ్వర ఆలయం:

ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయం ద్రాక్షారామం సమీపంలో, కాకినాడకి 45 కిలో మీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నగరానికి దగ్గరగా ఉంది. ఈ కోటిలింగేశ్వర ఆలయాన్ని 10 వ శతాబ్దం లో నిర్మించారు. ఈ ఆలయానికి సంవత్సరం పొడుగునా భక్తులు రావడం విశేషం. ఈ ఆలయం లో భక్తులు పూజ చేస్తే ఆత్మ మరియు శరీరం నుండి పాపాలు పోతాయని నమ్ముతారు. 

సర్ ఆర్ధర్ కాటన్ మ్యూజియం:

సర్ ఆర్ధర్ కాటన్ జ్ఞాపకార్థం ఈ మ్యూజియం ని నిర్మించడం జరిగింది. ఈయన ఒక బ్రిటిష్ ఇంజనీర్. మొట్ట మొదట ఈయన నీటిని సేకరించి శుభ్రపరిచి పట్టణాలకు సరఫరా చేసారు. అలానే ఈయన ఆనకట్ట విధానం, నిర్మాణ పద్ధతులని ఆవిష్కరించారు. ఈ మ్యూజియం లో సర్ ఆర్ధర్ కాటన్ అరుదైన ఛాయా చిత్రాలు ఉన్నాయి.

పుష్కర్ ఘాట్:

ఈ ఘాట్ చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. కోటిలింగేశ్వర ఆలయం, మార్కండేయ ఆలయం మరియు అనేక పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఏడాది పొడుగునా భక్తులు ఇక్కడకి వస్తూ ఉంటారు. ఇక్కడకి వచ్చే భక్తుల మనసు ఆనంద పారవశ్యం తో మునిగి తేలుతుంది. ఇది ఒక స్నాన ఘట్టము. ముఖ్యమైన స్నాన ఘట్టాల లో ఈ పుష్కర్ ఘాట్ ఒకటి. 

కంబాల పార్క్:

ఈ పార్క్ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్రదేశం. ఇక్కడ పార్క్ స్థానంలో స్టేడియం కట్టాలని అనుకున్నారు. కానీ ఆలా వద్దు అని స్థానికులు అడ్డుకుని పార్క్ కింద దీనిని ఉంచేశారు. ఈ పార్క్ ని 1845 లో నిర్మించారు. వినోదానికి ఈ పార్క్ బెస్ట్. 

కడియపులంక:

ఈ రోడ్డు మీద నుండి వెళ్తూ ఉంటే రంగురంగుల పూల సువాసనలు తెలుస్తాయి. రోడ్డుకి ఎటు చూసిన నర్సరీలు ఉంటాయి. చుట్టూ పక్క అనేక ప్రాంతాల వరకు ఈ పూలు, పూల మొక్కలు ఇక్కడ ఉండే పంపిస్తూంటారు. నిజంగా ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా అనేక ఆలయాలు, మ్యూజియాలు, కట్టడాలు అనేకం.

నన్నయ తెచ్చెనే తెలుగు ఇచ్చట నుండే, మంచి నీరు ఇచ్చే సర్దార్ ఇచ్చట నుండే......పురాతన పుణ్యభూమి భూమి, సాంస్కృతిక రాజధాని భూమి.....