BREAKING NEWS

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సులువైన మార్గాలు..

సహజంగా రోగ నిరోధక శక్తి అందరికీ ఒకేలా ఉండదు. ఒకొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఎక్కువ ఉంటే, మరికొందరికి తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఎలాంటి వైరస్‌లు చేరవు. అయితే సులువుగా మనం తీసుకునే ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తిని మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు చిరు జల్లులు ప్రారంభం అయ్యాయి. దీని వల్ల బాక్టీరియల్ ఇంఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. వాటి నించి తప్పించుకోవాలంటే మనకి ఉన్న ఏకైక మార్గం న్యూట్రియెంట్స్. న్యూట్రియెంట్స్ ని  ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోడమే.  ఇమ్యూనిటీ శరీరం లో ఉంటే శరీరం వ్యాధులతో పోరాడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే జీవన విధానం, పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

మీరు కూడా మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని అనుకుంటే...?  మీ డైట్ లో వీటిని చేర్చి రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇమ్యూనిటీ పెరగాలంటే పొగతాగడం, మద్యం తాగడంలాంటి అలవాట్లు మానివేయాల్సి ఉంటుంది. ఇలాంటి అలవాట్ల వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. త్వరగా ఆరోగ్యం పాడవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మొదటి లెవెల్ రక్షణ కవచం. ఇది వ్యాధిని కలిగించే క్రిములను దూరంగా ఉంచుతుంది. మనల్ని హెల్తీగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది.

విటమిన్ సీ ఫుడ్:

విటమిన్ సీ చాలా అవసరం. విటమిన్ సీ ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది. కాబట్టి విటమిన్ సీ ని మీరు తరచూ తీసుకోండి. విటమిన్ సీ ఎర్ర కాప్సికం, బొప్పాయి, నిమ్మకాయ, టొమాటో వంటి వాటిల్లో సమృద్ధిగా ఉంటుంది. రోజులో కనీసం ఒక సారైనా వీటితో చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి.

బయట ఆహారానికి చెక్ :

బయట ఆహారానికి చాలా మంది మక్కువ చూపిస్తారు. కానీ ఈ కరోనా కారణంగా బయట ఫుడ్ ని తీసుకోవడం మానేయడం మంచిది. అసలే వానా కాలం ప్రారంభం అయ్యింది కనుక బయట ఫుడ్ ని అసలు తినకూడదు. బయట ఫుడ్ తినకుండా కేవలం ఇంటి భోజనమే చెయ్యండి. లైట్ గా తిందామనుకుంటే సింపుల్ గా కిచిడీ చేసుకోండి, సరిపోతుంది. అలానే, రైస్ కి బదులుగా చిరు ధాన్యాలు తీసుకోవచ్చు. వీటి వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది. కాబట్టి బయట ఫుడ్ కి చెక్ చెప్పేయండి.

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం:

వానా కాలం కదా అని నీళ్లు ఎక్కువగా తీసుకోరు చాలా మంది. అది నిజంగా తప్పు. ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీ లో నీరు ఎక్కువ తాగాలి. మీకు ఒక వేళ దాహం వేయక పోయినా  కూడా తరచూ నీళ్లు  తాగాలి. నీళ్లు మాత్రమే కాకుండా నీటి తో పాటూ జ్యూసులూ, మజ్జిగా, కొబ్బరి నీరూ వంటివి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక వీటినైనా మీరు తీసుకోవచ్చు. 

ఉడికించిన ఫుడ్:

ఈ సీజన్ లో వీలున్నంత వరకూ పూర్తిగా ఉడికించిన కూరగాయలనే తీసుకోండి. అలా చెయ్యడమే మంచిది. అదే పచ్చి వాటిని తీసుకుంటే దానిలో బాక్టీరియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తొక్క తీసి తినే పండ్లని తినడమే మంచిది. అరటి పండ్లు, పుచ్చకాయ, బత్తాయిలు, లిచీ వంటివి మంచివి. కనుక ఈ మాన్సూన్ స్పెషల్ డైట్ తో మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి. దీని వల్ల ఆరోగ్యం మరెంత బాగుంతుంది. అలానే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఏ సమస్య రాకుండా సురక్షితంగా ఉండండి...

వెల్లుల్లి :

మీరు రోజు తినే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి దినుసులు వేసుకోండి. ఇవి ఇమ్యూన్ సిస్టం బాగా పని చేసేలా చేస్తాయి. మీ కూరల్లో, పులుసుల్లో ఇవి వేసుకోండి. దీని వల్ల ఇమ్మ్యూనిటి కూడా బాగా పెరుగుతుంది. అలానే  వీటిని వాడి చేసే టీ తాగండి. లేదా పరగడుపున నిమ్మకాయ నీళ్ళల్లో కొంచెం అల్లం ముక్కలుగా చేసి వేసుకుని తాగండి. ఎలా తీసుకున్న ఇవి మాత్రం ఇమ్మ్యూనిటీని  పెంచుతాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

స్ట్రాంగ్ గా ఇమ్మ్యునిటీని ఉంచుకోవాలంటే...

1.రాత్రి పూట ఏడెనిమిది గంటలు నిద్రపోవడం చెయ్యలి.
2. అలానే న్యూట్రిషస్స్ ఉండే తాజా పండ్లూ, కూరగాయలు ఫుడ్ తీసుకోవడం మంచిది.

3. సూర్య రశ్మి లో రోజూ కొంత సేపు గడపడం.
4. రెగ్యులర్ గా మెడిటేషన్ కానీ, యోగా కానీ చేయడం.
5.ఒత్తిడిని దూరంగా ఉంచడం.
6. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
7.బరువు సరిగ్గా ఉంచుకోవడం.
8. గట్-ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవడం.
9. ఆల్కహాల్ ని వీలైనంత తక్కువ తీసుకోవడం
10. విటమిన్ సీ తీసుకోవడం.

చూసారు కదా...!  ఇమ్యునిటీని ఎలా పెంచుకోవచ్చో. మరి ఆలస్యం ఎందుకు...?  వీటిని మీరు తరచు తీసుకుని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. ఇప్పుడు మీ ఇమ్మ్యూనిటి మరెంతో పెరుగుతుంది