BREAKING NEWS

అయోధ్య విశిష్టత, రామ మందిరం భూమి పూజ విశేషాలు...!

చరిత్రలో అయోధ్య: 
 
అయోధ్య భారతదేశం లోని అతి పురాతన నగరాల్లో ఒకటి. ఎంత పూరాతనం అంటే మన పురాణాల లో, ఇతిహాసాల లో కూడా ఆ ప్రస్తావన సాగింది. శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆ విస్కరణకి మూలం ఈ అయోధ్య. కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య లోనే శ్రీరాముడు జన్మించినట్టు చరిత్ర చెబుతోంది.
 
''రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ 
మమకా భీష్టదాయ మహిత మంగళం...''
 
ఈ అయోధ్య నగరం 9,000 సంవత్సరాలకి పూర్వం, వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకి ధర్మ శాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత ఇది స్థాపించబడడం జరిగింది. శ్రీరామ చంద్రుడు అయోధ్యని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. మన భారతదేశంలో ఉండే ఏడు మోక్షపురాల లో అయోధ్య ఒకటి. ఆరాధన ప్రధానమైన నగరాల లో అయోధ్య ఒకటి. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాల లో అయోధ్యని మహోన్నతంగా వర్ణించడం జరిగింది. 
  
అయోధ్యరామ మందిరం:
 
కనివిని ఎరుగని రీతిలో ఆలయ నిర్మాణం..... కేవలం దేశ ప్రగతికి కాదు, సమస్త జాగృతికి  నిదర్శనం. నేడు జరిగిన భూమి పూజ కార్యక్రమం ఎంతో మంది పెదవులపై చిరునవ్వుని తీసుకొచ్చింది. ఎందరో మంది చేసిన పోరాటానికి ఫలితం ఈ రామ మందిరం....
 
దేశ చరిత్రలో ఇవాళ ఓ సువర్ణాధ్యాయం. ఈ రామాలయ నిర్మాణం కోట్ల మంది హిందువులకి అత్యంత ముఖ్యం. జై శ్రీ రామ్ నినాదాలు ప్రపంచమంతా వినపడుతున్నాయి, వందల ఏళ్ళ నిరీక్షణకు ఫలితం నేడు దక్కింది. రామ్ లల్లా ఆలయం దశాబ్దాల పాటు టెంట్ లోనే కొనసాగింది. కానీ ఇప్పుడు మందిరం రానున్నది. ఈ రామ మందిరం కోసం బలిదానాలు కూడా జరిగాయి. అలానే ఇది నిజంగా సమరమే. స్వాతంత్య్రం కోసం అప్పుడు పోరాడితే ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చినట్టే ఇప్పుడు కూడా ఎంతో మంది జనాలు దీనికి పోరాటం చేసారు.
 
నేడు జరిగిన భూమి పూజ కార్యక్రమం లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈవాళ కోసమే రామాయణం జరిగింది అని ప్రధాని చెప్పారు. దేశ సంకల్పం తోనే ఈ రామాలయ నిర్మాణం సాధ్యం అవుతోంది అని అన్నారు ప్రధాని. 130 కోట్ల భారతీయుల తరుపున వారందరికీ వందనం అని ప్రధాని చెప్పారు.
 
హనుమంతుడి ఆశీస్సులతో:
 
రాముడి నామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఈవేళ హనుమంతుని ఆశీస్సులతో అక్కడ భూమి పూజ జరిగింది. ఉద్యమం లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ఇది ఎనలేని ఆనందం. రాముడు భారత దేశ మర్యాద...రాముడు కార్యక్రమాలు అన్నీ హనుమంతుడు చేస్తాడు మరి. 
 
అయోధ్య రామ మందిరం భూమిపూజ:
 
రాముడి గురించి చెప్పాలంటే రామాయణం అంతా ఉంది కదా..! నిజంగా రాముడు పురుషోత్తముడు. ఆయన మార్గం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం. కేవలం ఒక్క భాషలోనే కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ, కాశ్మీరీ, పంజాబీ తో పాటు పలు భాష లోకి ఈ రామాయణం వెలువడింది. ఏమైనా కార్యం మొదలు పెడితే జై శ్రీ రామ్ అని అంటాం. అలానే ఆయన ప్రేరణ పొందుతాం. అదే మన శ్రీ రాముడి విశిష్టత. భిన్నత్వంలో ఏకత్వం శ్రీ రాముని ప్రతీక. 
 
''రాముడి మందిరం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది
మానవత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది ''...
 
అలానే పరస్పర ప్రేమ, సోదర భావంతో ఇటుక ఇటుక పేర్చి నిర్మించాలి అని అన్నారు ప్రధాని మోదీ. రామ జన్మ భూమి కేసులో సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పినప్పుడు భారతీయులు ఎంతో గౌరవంగా శాంతియుగంగా ప్రవర్తించారు అని అన్నారు మోదీ. భూమి పూజ తో అయోధ్య లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత పారిజాత మొక్కని నాటారు.
 
తెలుగు లో రామాయణాలు:
 
తెలుగు భాష లో ఎన్ని రామాయణాలు ఉన్నాయి అంటే లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి అనే చెప్పాలి. వాటిలో కొన్ని - తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము; గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము; భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ రచించిన రామాయణ కల్ప వృక్షము. రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. అగ్నేయాసియాలో అనేక జానపద గాథలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాథలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. త్రేతాయుగములోని విష్ణు అవతారము రామావతారం. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరిస్తారు. 
 
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.... 
 
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్....!  
 
 
రామ నామము సకల పాప హరమనీ, మోక్ష ప్రదమనీ... జై శ్రీరామ్..!