BREAKING NEWS

వానా కాలంలో తప్పక తినాల్సిన కూరగాయలు

వానా కాలంలో అనేక రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వానా కాలంలో పౌష్టిక ఆహారాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఇప్పుడు కరోనా మహమ్మారి అయ్యి విస్తరిస్తోంది. ఇటువంటి సమయంలో ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?, ఏం తినాలి?  అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వారందరూ వీటిని కనుక అనుసరిస్తూ ఉంటే తప్పకుండా మీరు రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.

వానా కాలంలో తినే ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. అంతే కాకుండా కొన్ని హెల్త్ చిట్కాలు పాటించడం కూడా ఎంతో అవసరం. ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండగలరు. వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సతమతమవుతూ ఉంటారు. అలా బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా వీటిని అనుసరించాలి. వానా కాలంలో  సీజనల్ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లు చెబుతున్న అంశం రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని కనుక మీరు కూడా మీ రోగ నిరోధక శక్తిని పెంచడం చాలా అవసరం. 

వర్షా కాలంలో తినాల్సిన కూరగాయలు:

దోసకాయ: 

ఈ వర్షాకాలంలో దోసకాయ దొరికినప్పుడల్లా తీసుకోవడం మంచిది. దోసకాయ వల్ల శరీరంలో విషపూరిత పదార్థాలు, వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి. అలానే శరీరం కూడా రిఫ్రెష్ అయినట్లు అనిపించి వానా కాలం బద్ధకం కూడా తొలగిపోతుంది. దీనితో మీరు ఎంతో చురుకుగా మీ పని మీరు చేసుకోగలరు.  దోసకాయ చల్లగా చూడగానే తినాలనిపించేలా ఉంటుంది. దీనిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీ హైడ్రేటింగ్ ఏజెంట్ గా కూడా దోసకాయ పని చేస్తుంది. రక్తపోటుతో బాధపడే వారికి ఇది చక్కని ఆహారం. రోజూ కప్పు కీర దోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది.

దుంపలు: 

ఈ వర్షాకాలంలో దుంపలు తినడం కూడా ఎంతో మంచిది. భూమిలోని సారాన్ని అధికంగా తీసుకుంటూ పెరుగుతాయి దుంపలు. కాబట్టి బంగాళ దుంపలతో మీకు నచ్చిన రుచితో మీరు చేసుకుని తినడం మంచిది. బంగాళదుంప కూర లేకపోతే ఫ్రై ఇలా మీకు నచ్చిన విధంగా చేసుకుని తినడం వల్ల పోషకాలు కూడా లభిస్తాయి. ఎర్రగడ్డ లాంటి దుంపల్ని కూడా తినడం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని మీరు మోతాదుకు మించి తినవద్దు.

సొరకాయ: 

ఈ వర్షాకాలంలో సొరకాయని కూడా తినడం ఎంతో మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి ఎక్కువగా బరువు తగ్గాలనుకునేవారు ఈ సొరకాయని ప్రిఫర్ చేస్తారు. కరోనా టైంలో ఇంట్లోనే కూర్చుని బరువు పెరిగే వారు కూడా దీన్ని తినడం ప్రారంభించారు. కనుక యాంటీఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ సొరకాయ తినటం వల్ల కూడా ఎంతో మంచిది.

బెండకాయ:

బెండకాయ కూడా తరచు మీరు తీసుకోవచ్చు. చాలా మందికి బెండకాయ అంటే ఎంతో ప్రీతి. ఈ బెండకాయలో పీచు పదార్థాలతో పాటుగా పోషక విలువలు కూడా అధికంగా లభిస్తాయి. చాలా మంది తల్లులు పిల్లలకి తరచుగా బెండకాయ పెడుతూ ఉంటారు. బెండకాయ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారు. అంతే కాకుండా లేత బెండకాయ తింటే శరీరం రిఫ్రెష్ అవుతున్న  భావన కలుగుతుంది. ఆరోగ్యానికి కూడా బెండకాయ చాలా మంచిది.   బెండకాయ లోని మ్యూకస్ వంటి పదార్థాలు కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనితో పాటు పీచు, విటమిన్ సి కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

దీనిలో ఉండే మ్యూకస్ పదార్థము గ్యాస్ట్రిక్ సమస్యలను ఎసిడిటీకి చక్కని పరిష్కారం అందిస్తుంది. అలానే దీనిలో ఉంటే డయాబెటిక్ లక్షణాలు వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నయం చేయడంలో సహకరిస్తుంది. బెండకాయ డికాషన్ తీసి తాగితే జ్వరం తగ్గిపోతుంది. డయాబెటిస్ ని నియంత్రణలోను సుగుణం చూపుతుంది. షుగర్ స్థాయి తగ్గాలంటే బెండకాయలను నిలువుగా చీల్చి రెండు భాగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి మర్నాటి ఉదయం ముక్కలు తీసివేసి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మీకు మెరుగైన ఫలితం కనిపిస్తుంది

కాకరకాయ: 

కాకరకాయ రుచి చేదుగా ఉన్నా ఫలితం మాత్రం ఎంతో. ఎంతోమంది ఈ రుచి నచ్చక దీనిని తినరు. కాకరకాయ ఒంటికి చాలా మంచిది. కాకరకాయ శరీరానికి అవసరమైన మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం ఇలాంటి పోషకాలతో పాటు విటమిన్ సి కూడా లభిస్తుంది చూసారా దీనిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో... ఇలా కాకరకాయ అనారోగ్యాల బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. కాకరకాయ లో ఉండే చేదు గుణం  వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటానికి కాపాడుతుంది. అలానే కాకరకాయ వల్ల ఎముకల బలం కూడా పెరుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బులు బారిన పడకుండా ఉంటారు. దీనిలో బీటా-కెరోటిన్ ఫైబర్ గుణాలు కూడా ఉన్నాయి.

ఇలా వీటిని అనుసరిస్తే సీజనల్ జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలరు. మరి వీటిని అనుసరించి మీరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి.