BREAKING NEWS

ముందడుగు వేసి బెంగుళూరులో సేవలందించిన చిత్తూరు యువత....!

నేటి కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది..... ఎవరి బ్రతుకు వారిది..... ఎంత ఉన్నా తృప్తి ఉండడం లేదు. కలలు నిజమవుతున్నా..... కొత్త కలలు పుట్టుకొస్తున్నాయి. కుటుంబంతో కలిసి అంతా సంతోషంగా జీవించాలని.... బిల్డింగులు, కార్లు కొనుక్కోవాలని..... ఇలా రోజు రోజుకి ఎన్నో అనిపిస్తూ ఉంటాయి. కేవలం వాటి వెనకే పరుగులు పెడుతూ, వచ్చిన డబ్బులని కాస్తా వాటిని నెరవేర్చుకోవడానికి సరిపోతుంది. చాలా మంది ఇలానే ఉంటే... వరుణ్ కుమార్ మాత్రం ఎన్నడూ ఇలా ఆలోచించలేదు. అందరూ ఇదే బాటని అనుసరిస్తున్నా ..... ఈయన మాత్రం తనకు నచ్చిన బాటలో కొనసాగుతున్నాడు.
 
బెంగళూరులో లాక్ డౌన్ విధించిన సమయంలో వరుణ్ కుమార్ అక్కడ ఉన్న కూలీలకు సహాయం చేశాడు. బెంగళూరులో ఒక  ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. తాను అందరిలా కాదు. ఇతను అందరికన్నా విభిన్నంగా, వినూత్నంగా ఆలోచించే మనిషి. ఒక రోజు తన కార్ డోర్ ని కొట్టి ఒక కూలీ ఏమైనా ఆహారం ఉంటే ఇమ్మని అడిగాడు. అయితే దేశాన్ని నిర్మించే వ్యక్తులే నిరాశ్రయులయ్యారు అన్న ఆ సంఘటన తనని పూర్తిగా కదిలించింది. 
 
అప్పుడు తాను తన పక్కింటి వారితో కలిసి కొంత మంది వలస కూలీలకి ఆహారం ఇవ్వడం ప్రారంభించాడు అని చెప్పాడు వరుణ్. నిజంగా ఎంత గొప్ప హృదయమో....! చూశారు కదా... ఎవరి పనిలో వారు, ఎవరి తీరులో వాళ్ళు కొనసాగిస్తుంటే ఇతరుల కోసం పని చెయ్యడం ఎంత మంచి గుణమో. సహాయం అంటే సమయం వృధా అని స్వార్థంతో పరుగులు పెట్టిన జనమే నేటి కాలంలో ఉంటే, వరుణ్ లాంటి వారు ఉండడం కూడా మనకి అదృష్టం. కానీ తనకి ఆ సహాయం సరిపోతుంది అని అనిపించలేదు.
 
ఇంకా తాను చెయ్యగలిగినది చేయాలని పట్టు పట్టాడు. మరికొన్ని డొనేషన్స్ ని ఆయన సేకరించడంతో పాటు తన సేవింగ్స్ ని కూడా కలిపి ఒక అపార్ట్ మెంట్ ని కొన్నాడు. అపార్ట్మెంట్ లో కేవలం వలస కూలీలకి మాత్రమే కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకి కూడా భోజనం పెట్టడానికి  ఆయన ఆ సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. తనకి ఆ సమయములో ఇలా అనిపించిందట.....  ''ఆ డబ్బుతో నేను కారు అపార్ట్మెంట్ కొనుక్కోవడం ముఖ్యం కాదు. నేను వాటిని తర్వాత అయినా కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు, ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయడం ప్రథమమని'' నిర్ణయం తీసుకోవడం జరిగింది.
 
వరుణ్ తో పాటు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లు కూడా వాళ్లకి తోచినది అందించడం ప్రారంభించారు. అలా డొనేషన్స్ తో ,సేవింగ్స్ తో పాటు ఫుడ్ ని వండించి అవసరమైన వాళ్లకి అందించేవాడు. ఇలా అయినా మరొక సారి కొత్త నిర్ణయంతో వలస కూలీలకి, ఇతరులకి కూడా సహాయం అందించాడు. వరుణ్ సొంతూరు చిత్తూరు తాను అక్కడి నుంచి ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. తన తండ్రి తనకు ఆదర్శమని చెప్పాడు వరుణ్. 
 
ఎప్పుడు కూడా నా తండ్రి నన్ను మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని అనుకునేవారు. ఇలా ఎన్నో మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. ఎలా బతకాలి, ఎలా సహాయం చేయాలి ఇటువంటివన్నీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నవే అని చెప్పాడు వరుణ్. మన కోసం మనం బ్రతికే కన్నా పక్క వాళ్ళకి సహాయం చేయడం ఎంతో ముఖ్యం అని చెప్పాడు
 
అలాగే కొంత కాలం తర్వాత తనకి భోజనం కన్నా ఇంట్లో వండుకునే సామాగ్రి ఇవ్వడం ముఖ్యమని అనిపించింది. ఇల్లు లేని వాళ్ళకి మాత్రం వండిన ఆహారం ముఖ్యం. మరోసారి ఇలా నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఏది ఏమైనా తన సేవలు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నాడు.'' నా చిన్ననాటి స్నేహితులతో నేను మాట్లాడాను. మొత్తం ఏడుగురు కలిసి దీనిని కొనసాగించడం జరిగింది. వాళ్లు కూడా ఎంతో దయతో ఫండ్స్ ని కూడా అందించి వారి సమయాన్ని కూడా ఇక్కడ వెచ్చించడం ప్రారంభించారు.'' ఇలా మేము అనేక మంది విభిన్న ప్రజలతో మరియు డిపార్ట్మెంటల్ తో బెంగళూర్ సిటీ లో మేము మా సేవలని కొనసాగిస్తున్నామని వరుణ్ చెప్పాడు. 
 
ఇప్పుడు వరుణ్ తన స్నేహితులతో కలిసి వంటకి కావలసిన సామాగ్రిని 16,080  కుటుంబాలకి అందిస్తున్నారు. అది కూడా నెలకి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు నెలలో అందిస్తున్నారు. అలానే  ఇంచుమించు ఏడు వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. వీటితో పాటు 3,000 శానిటైజర్ లు, 5000 జత గ్లవుజులని  బీబీఎంపీ వర్కర్స్ కి, సానిటరీ వర్కర్స్ కి, పోలీస్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కి అందించారు. అంతే కాకుండా 100 పీపీఈ కిట్స్ ని కూడా హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి మరియు ఇతర ప్రాంతాలకు అందించారు. అలానే 5,000 మాస్కులని  కూడా చిత్తూరు, బెంగళూరులో ప్రజలకి అందించారు.
 
ఈ సేవ నాకు చాలా సంతృప్తి కలిగించిందని వరుణ్ చెప్పారు. అంతే కాకుండా మంచి అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి కల్పించిందని వరుణ్ చెప్పాడు. ఈ కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థికంగా వెనుకబడిన  వారిని ఇబ్బంది పెట్టిందని అర్థమైంది అందుకని వరుణ్ ఇలా అన్నాడు...... ''సంపాదించే 10 రూపాయలలో ఒక్క రూపాయి కనుక ఇతరులకు సహాయం చేస్తే అది చాలు'' అని వరుణ్ చెప్పాడు.