BREAKING NEWS

పుస్తకాలు జీవితానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసా...?

పుస్తకాలని చదవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రతీ అక్షరం అభివృద్ధికి నాంది. ఒక్క పుస్తకం చదివితే చాలు..... అదే జ్ఞానానికి పునాదిలా మారిపోతుంది. మహా కవి శ్రీశ్రీ లాంటి వాళ్ళే ఇలా అన్నారు....''చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో'' అని. అంటే పుస్తకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు అర్ధమయ్యే ఉంటుంది. మనిషి జీవితం మారిపోవాలంటే ఒక సాటి మనిషి వల్ల మారుతుందో లేదో తెలియదు కానీ... ఒక మంచి పుస్తకం వల్ల మాత్రం ఖచ్చితంగా మారుతుంది.

కానీ రాను రాను పుస్తకాలని చదివే అభిరుచి యువతలో చాలా శాతం తగ్గిపోయింది అనే చెప్పాలి. పుస్తకాల వల్ల జీవితానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు పుస్తకాల వల్ల ప్రయోజనాలు మీరే చూసేయండి....

జ్ఞానానికి మూలం పుస్తకం: 

ప్రతీ పుస్తకం ఎంతో కొంత జ్ఞానాన్ని ఇస్తుంది. అజ్ఞానం అనే అంధకారం నుండి విజ్ఞానం అనే వెలుగుని అందిస్తుంది పుస్తకం. జ్ఞానాన్ని ఇచ్చి జీవన దీపాన్ని వెలిగిస్తుంది పుస్తకం. ఇలా చెప్పుకు పోతే పుస్తకం గురించి చాలా చెప్పాలి. చరిత్ర నుండి వర్తమానం వరకు ఇలా ప్రతీ విషయాన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు పుస్తకం చూపిస్తుంది. పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఇలా అన్ని కోణాలని కూడా చూపిస్తుంది పుస్తకం. అలానే ఎన్నో విషయాలని ఎంతో సులువుగా నేర్చుకుని ఎంతో జ్ఞానాన్ని మనం పొందవచ్చు.  

జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది:

జ్ఞాపక శక్తిని మరెంత పెంచుకోవాలంటే పుస్తకంతో సాధ్యం, సులువు కూడా. నెమ్మదిగా పిల్లల చేత పుస్తకాలని చదివించడం అలవాటు చేసే బాధ్యత తల్లిదండ్రులది. వేమన శతకం, సుమతీ శతకం, సుభాషితాలు వంటి పద్యాలు లేదా మరేదైనా పుస్తకాలని చదివించడం వల్ల జ్ఞాపక శక్తి మరెంత గానో పెరుగుతుంది. కనుక సమయం ఉన్నప్పుడల్లా పుస్తకాలతో సమయం కేటాయిస్తే మరెన్నో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

పదజాలం బాగా పెరుగుతుంది:

ఫ్లూయెంట్ గా మధ్యలో ఆగిపోకుండా మాట్లాడడానికి లేదా సంధర్భానికి తగ్గట్టు మాట్లాడడం అన్ని పుస్తకం తో సాధ్యం. అయితే పుస్తకాలని బాగా చదివితే సులువుగా పదజాలాన్ని పెంచుకోవచ్చు. భాష పై పట్టు కూడా లభిస్తుంది. కనుక వీలైనంత వరకు మంచి పుస్తకాలని ప్రిఫర్ చెయ్యండి. ఇలా చేస్తే పదజాలం బాగా పెరుగుతుంది.

మానసిక ప్రశాంతతని పెంచుతుంది:

ఏమైనా సమ్యస్యల వల్ల ఒత్తిడి కలిగిందంటే పుస్తక పఠనం దివ్య ఔషదం.  కనుక ఎప్పుడైనా ఏమైనా సమస్యల వల్ల ఒత్తిడి వస్తే ఎవరు లేని చోట కాళీ ప్రదేశం లో నచ్చిన పుస్తకం తీసుకుని చదువుకోండి. ఇలా చెయ్యడం వల్ల ప్రశాంతం కలుగుతుంది. చిటికె లో ఒత్తిడి కూడా పూర్తిగా తొలగి పోతుంది. కాబట్టి పుస్తకాలని చదవడం వల్ల ఒత్తిడిని కూడా దూరం చెయ్యవచ్చు.

చురుకైన ఆలోచనలు:

శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో! మెదడుకి పుస్తకం అలానే అవసరం. ప్రతీ రోజు పుస్తకాన్ని చదవడం వల్ల మీ మెదడు ఎంతో చురుకుగా పని చేస్తుంది. కాబట్టి పుస్తకాలని చదవడం అవసరం. 

వ్రాయడానికి స్కిల్స్ :

వ్రాసే స్కిల్స్ మరెంత ఇంప్రూవ్ చేస్తాయి పుస్తకాలు. ఎంతో మందికి వ్రాయడం అంటే ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతో కాలం కొనసాగించ లేరు. అలాంటి వాళ్ళు పుస్తకాలని చదివితే వ్రాయడానికి నైపుణ్యం పెరుగుతుంది. లేదా బిగినింగ్ లో ఉండే రైటర్స్ కి కూడా పట్టు దొరుకుతుంది. కాబట్టి పుస్తకాలు మంచి రోల్ ప్లే చేస్తాయి. అలానే పాఠకులకి ఎలా వివరించాలో రచయితలకి అర్ధం అవుతుంది. మంచి పుస్తకాలని కూడా వ్రాయగలరు.

తెలుగులో మంచి పుస్తకాలు:

తెలుగులో అనేక పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా చదవాల్సిన కొన్ని పుస్తకాలు మీకోసం. అమృతం కురిసిన రాత్రి (బాల గంగాధర్ తిలక్), మహా ప్రస్థానం( శ్రీశ్రీ), విశ్వంభర (సినారె), విముక్త (ఓల్గా), బారిష్టరు పార్వతీశం (మొక్కపాటి నరసింహ శాస్త్రి), కన్యాశుల్కం (గురజాడ అప్పారావు), స్వేఛ్చ (ఓల్గా), పాకుడు రాళ్ళు (రావూరి భరద్వాజ్) మా దిగువ గోదారి కధలు (వంశీ).

ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి. మీకు నచ్చిన ప్రక్రియ లో మీరు కనుక పుస్తకాలని చదివితే అది మరెంత ఆసక్తిగా ఉంటుంది. అలానే నచ్చిన కవి లేదా రచయత పుస్తకాలని చదివినా ఆ శైలి మీకు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఏ పుస్తకాన్ని ఆసక్తిగా చదివినా దాని వల్ల మంచి ప్రయోజనాలని మీరు పొందవచ్చు. కాబట్టి పుస్తకాలని చదివే అభిరుచి ఉంటే అది చాలా మంచిది..... ఒకవేళ లేకపోతే అలవాటు చేసుకోవడం కూడా మంచిది. ఇష్టంగా చదివితే పుస్తకం లో ఉండే సారం ఎంతో ప్రీతిగా ఉంటుంది. ఒకసారి స్వయంగా మీరే ప్రయత్నం చెయ్యండి. 

'' ఒక సారి పుస్తకాన్ని మొదటి సారి చదివితే ఒక కొత్త స్నేహితుడ్ని సంపాదించినట్టు ఉంటుంది...అదే మళ్ళీ మళ్ళీ చదివితే స్నేహితుడ్ని కలిసిన ఆనందం లభిస్తుంది...