BREAKING NEWS

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు కష్టాలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే...!

ఇప్పుడు కరోనా వల్ల ఎంతో మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం జరుగుతోంది. అలానే కొంత మంది ఫ్రీలాన్సర్స్, రైటర్స్ వంటి వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యడం సహజం. అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు వచ్చే కష్టాలని అవరోధించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వడం. ఇలా చెయ్యడం వల్ల చేసే పనికి ఇబ్బందులు రావు. కాబట్టి ఈ టిప్స్ వైపు ఒక లుక్ వేసేయండి...

1.మీ సొంత ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం: 

అన్నింటి కంటే ముఖ్యంగా మీరు ఇది పాటించాలి. ఎందుకంటే చుట్టూ ఉండే డిస్టర్బెన్స్స్ వల్ల ప్రశాంతంగా పని చేసుకోలేరు. కనుక దీనిని ముందు సాల్వ్ చేసుకోవాలి.  మీ ఇంట్లో ఒక స్పేర్ రూం ఉంటే సరే, లేదంటే ఎక్కడో ఒక చోట మీ కంప్యుటర్ డెస్క్, చైర్ ఏర్పాటు చేసుకోండి. అలా మీ ఆఫీస్ స్పేస్ ని మీరు క్రియేట్ చేసుకోండి. ఇలా కాదు సోఫా లోనో లేక డైనింగ్ టేబుల్ దగ్గరో పని చేసుకుందాంలే అని అనుకుంటే నిజంగా అది తప్పే. కనుక మీ స్పేస్ ని మీరు సమకూర్చుకోండి.

2. మధ్యలో బ్రేక్స్:

ఎక్కువగా ఒత్తిడి లేకుండా ఉంటుంది బ్రేక్ తీసుకుంటే. ఆఫీసులో కనుక మీరు పని చేస్తూ ఉంటే మధ్యలో టీ బ్రేక్స్ లేదా కాఫీ బ్రేక్స్ తీసుకుంటూనే ఉంటారు కదా. అచ్చం అలానే ఇంట్లో కూడా మధ్యలో కాస్త విరామం తీసుకోండి. వర్క్ ఫ్రం హోం కాబట్టి సమయం ఎక్కువగానే ఉంటుంది. కనుక హెల్దీ బ్రేక్స్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ ని ఉపయోగించుకోండి. చక్కగా, హ్యాపీగా హెల్దీ డ్రింక్స్ తీసుకోండి. ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా పని సాఫీగా జరుగుతుంది.

3. సోషల్ మీడియాకి దూరంగా:

సోషల్ మీడియాలో మనకి తెలియకుండా మనం మునిగిపోయే ఛాన్సెస్ వున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో  ఓ పక్క వాట్సప్ లో చాట్ చేస్తూ మరో పక్క కంప్యూటర్ లో చాలా మంది టైప్ చేస్తుంటారు. ఇది ఎంత మాత్రమూ మంచి అలవాటు కాదు. దీని కారణంగా వర్క్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పెర్ఫెక్ట్నెస్ కి ప్రాముఖ్యత ఇచ్చి, ఒక దాని పైనే దృష్టి పెట్టడం మరెంతో ముఖ్యం. దీని వల్ల మరో అనర్ధం ఏమిటంటే టైమ్ వేస్ట్ కూడా తెలియకుండానే అయిపోతుంది.

4.షార్ట్ వాక్: 

అస్తమానం అలానే కూర్చోవడం కూడా మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. కనుక కాస్త షార్ట్ వాక్ చెయ్యండి. అలానే రోజంతా ఒకే చోట ఇంట్లోనే కూర్చుని ఉంటే కొంచెం చిరాకు, విసుగు కూడా ఉంటుంది. అందుకని కొంచెం మధ్యలో అలా బాల్కనీ లోకి, టెర్రర్స్ పైకి ఇలా బయటకి వెళ్లి వాక్ చెయ్యండి. కాస్త ప్రశాంతత కూడా వస్తుంది. అలానే స్ట్రెస్ ఫ్రీ అవుతారు.

5. టైం పాస్ కి చెక్ :

మీ వర్క్ చేసుకునే టైమ్‌లో అనవసరంగా ఇతరులతో మాట్లాడడం, ఫోన్ కాల్స్ తో లీనమైపోవడం చెయ్యద్దు. సమయం చాలా ముఖ్యమైనది. కనుక సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకోండి. అలా చేస్తే మీ వర్క్ టైం కి పూర్తి చెయ్యగలరు. అలానే మధ్యలో ఏ అనవసర ప్రస్తావన లేనప్పుడు వర్క్ కూడా సరిగ్గా ఏ ఎర్రర్స్ లేకుండా అవుతుంది. 

6. ప్రణాళిక వేసుకోవడం: 

ఒకటి కంటే ఎక్కువ పనులు ఉండడం సహజం. ఇలా అన్ని పనులు చేసేటప్పుడు కొంచెం ఏకాగ్రత ముఖ్యం. అన్ని సరిగ్గా సమయానికి చెయ్యాలంటే ముందే అన్ని ప్రణాళిక వేసుకోవాలి. టు డు లిస్ట్ చేసుకోవడం వల్ల ఏ పనిని కూడా మర్చిపోకుండా ఉండగలరు. కాబట్టి ఇలా అన్నింటినీ నోట్ చేసి పెట్టుకుంటే అన్ని కూడా పూర్తి అవుతాయి. 

7 . టైం మానేజ్మెంట్ చేసుకోవడం:

సమయం మన కోసం ఆగదు. అది పరిగెడుతూనే ఉంటుంది. సరిగ్గా సమయానికి అన్ని పనులు చేసేయాలి అనే సందర్భం వస్తే పని చాలా స్పీడ్ గా చెయ్యడం ప్రారంభిస్తాం. చాలా మందికి అలవాటు ఏమిటంటే అబ్బా టైం ఉంది లే... అని ధీమాగా ఉంటారు. అదే డెడ్ లైన్ వచ్చే సరికి పరిగెడతారు. ఆఖరి క్షణంలో పనికి మమ అనిపిస్తారు. ఈ అలవాటు ఎంత మాత్రమూ మంచిది కాదు. కాబట్టి సరిగ్గా ఉన్న సమయాన్ని వినియోగించుకుని పనిని చెయ్యడం ఎంతో అవసరం. అలానే పని ని ముందు గానే పూర్తి చేసేసి మళ్ళీ వెరిఫై చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది వర్క్.

చూసారు కదా టిప్స్..! వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు, పద్ధతులు అనుసరిస్తే ఇంకా చింత ఉండదు. ఎంతో సాఫీగా డెడ్ లైన్ కి ముందే ఎంతో సులువుగా మీ పనిని మీరు చేసేసుకోవచ్చు.