BREAKING NEWS

జొన్నపిండితో ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం...!

నేడు ఎన్ని పొందుతున్నా.... ఎంత ముందుకి దూసుకెళ్లి పోతున్నా..... ఆరోగ్యం మాత్రం ప్రతీ ఒక్కరికి రోజు రోజుకి క్షీణించి పోతోంది. ఆరోగ్యంగా ఉండాలంటే రొటీన్ కి కాస్త భిన్నంగా మీ బ్రేక్ ఫాస్ట్ ని ఇలా తయారు చేసుకుంటే చాలు. కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా మంచి రుచికరమైన వాటిని తినేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు? పూర్తిగా చదివి ఇలా చిటికెలో చేసేసుకోండి. 
 
జొన్న పిండితో సాధారణంగా ప్రతీ ఒక్కరు జొన్నరొట్టెలను తయారు చేస్తారు. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. కానీ కేవలం ఈ రొట్టెలని మాత్రమే కాకుండా  ఈ పిండితో ఇంకా మరెన్నో వెరైటీస్ ను ఎంతో సింపుల్ గా చేయవచ్చు. మరి ఎలా చెయ్యాలి? అని అనుకుంటున్నారా...? చాల సింపుల్. ఇలా అనుసరించండి చాలు.  
 
సహజంగా చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు. ప్రతీ రోజు బ్రేక్ ఫాస్ట్ ని తప్పక తినాలి. బ్రేక్ఫాస్ట్ అనేది ముఖ్యమైన మీల్. దీన్ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. అలా అని ఏది పడితే అది తినడం కూడా మంచిది కాదు. నేటి కాలంలో అందరూ ఆరోగ్యానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది తెలిసినదే. అలానే బ్రేక్ఫాస్ట్ లో పోషకాలుండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కూడా.
 
బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటూ ఉండాలి. అలానే ఉదయం టిఫిన్ కి మైదా వగైరా పిండ్లు కంటే కూడా జొన్న పిండిని తీసుకోవడం మంచిది. కాబట్టి, బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ మీల్ లో జొన్న పిండికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ప్రోటీన్స్ తో పాటు మరెన్నో పోషకాలు కూడా వస్తాయి దీనితో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే రోజు జొన్నపిండిని తింటే బోర్ కొడుతుందేమో అని సందేహం కూడా కలుగవచ్చు. లేదు అండి ఇక అటువంటి సందేహాలకు విరామం పెట్టండి. ఎందుకంటే ఎన్నో రకాలు ఇలా ఈ జొన్న పిండితో మనం చేసేయచ్చు చూసేయండి.
 
జొన్నపిండి రెసిపీస్ చేస్తే ఇది గుర్తుంచుకోవాలి:
 
ఈ జొన్న పిండిలో మైదా లాంటి పిండిలో ఉండే సాగే గుణం దీనిలో ఉండదని గుర్తుంచుకోండి. కానీ మీరు ఉపయోగిస్తున్నప్పుడు వేరే పదార్థాలను కలపడం ద్వారా ఈ గుణాన్ని తెప్పించాలి. బేకింగ్ చేసేటప్పుడు నూనె, షుగర్ అలాగే ఎగ్స్ ను వాడతారు కాబట్టి సమస్య లేదు. కాబట్టి ఇవన్నీ మీరే గమనిస్తూ చేసుకుంటే పెద్ద సమస్య ఏమి కాదు.
 
జొన్న పిండి ఉప్మా:
 
రవ్వ తో మాత్రమే కాదు చిటికెలో ఈ జొన్నపిండితో కూడా మనం ఉప్మా చేసుకోవచ్చు. ఈ రవ్వల బదులు జొన్నపిండిని ఆ వంటలో వాడండి. ఇలా చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకవేళ  క్రంచీ టెక్స్చర్ కావాలనుకుంటే మీరు కొంచెం గోధుమ రవ్వను కూడా యాడ్ చేయండి.
 
జొన్న పిండి దోశ:
 
దోశ అంటే మనందరికీ బాగా అలవాటు అయినదే, ఇష్టపడేదే. చిన్న పిల్లలు కూడా దోశని ఇష్టపడతారు. మరి మామూలు దోశ తెలుసు కానీ ఈ దోశ ఎలా చెయ్యాలని అనుకుంటున్నారా..? ఏమి లేదండి చాలా సులువుగా చేసేయచ్చు. మామూలు దోశల పిండిలో సగం మినప రుబ్బు స్థానం లో ఈ జొన్నపిండిని కలిపి సాధారణ దోశల్లానే చేసేయండి. రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా సాధ్యం.
 
జొన్న పిండి ప్యాన్ కేక్స్: 
 
పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలా చేస్తే. జొన్న పిండితో ఎంతో సులువుగా ఈ ప్యాన్ కేక్ ను తయారుచేసుకుని హెల్తీగా ఉండవచ్చు. ఈ రెసిపీ చెయ్యడం కూడా చాలా సులువే.  సాధారణంగా మైదాను ఎంతైతే కలుపుతారో అందులో సగం తీసేసి జొన్నపిండిని కలిపేయండి.  ప్యాన్ కేక్స్ కోసం జొన్నపిండిలో పెరుగు, కూరగాయలు అలాగే స్పైసెస్ ను కూడా కలుపుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చుతుందో ఆ ఫ్లేవర్ లో మీరు అలా ఫాలో అయిపోయినా చాలు.
 
ఇలా ఇవి మాత్రమే కాకుండా జొన్న పిండితో పోరిడ్జ్, మిక్స్డ్ వెజ్ దోశా లాంటివి కూడా మీరు ఎంతో సులువుగా చేసుకోచ్చు. అలానే దీనిలో చాలా లాభాలు ఉన్నాయి. జొన్నపిండి అరుగుదలకి దివ్య ఔషధంలా పని చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.  ఫైబర్ స్టూల్ కు బల్కీనెస్ ను యాడ్ చేసేందుకు హెల్ప్ చేసి స్మూత్ గా పాసయ్యేలా చేస్తుంది. అందు కారణంగానే మలబద్దకం సమస్య తగ్గుతుంది. 
 
గ్యాస్, కడుపుబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యలకి కూడా జొన్నపిండితో చెక్ పెట్టవచ్చు. అలానే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా దీనిలో ఉన్నాయి. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను తగ్గించే లక్షణాలు కూడా ఈ జొన్నలో ఉన్నాయి. అంతే కాకుండా మెగ్నీషియం, కాపర్ మరియు కేల్షియం లభిస్తాయి. ఇవి ఎముకలను అలాగే టిష్యూను స్ట్రాంగ్ చేస్తాయి. దీనితో పాటుగా ఐరన్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ను పెంచుతాయి. ఇవన్నీ ఇమ్యూనిటీను కూడా పెంచుతుంది.
 
చూసారు కదా...! జొన్నపిండి రెసిపీస్ మరియు లాభాలు. మరి మీ ఇంట్లో కూడా వీటిని ట్రై చెయ్యండి. రొటీన్ కి కాస్త భిన్నంగా వీటిని చేస్తూ మరెంత ఆరోగ్యంగా ఉండండి.