BREAKING NEWS

మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలు

రోజు రోజుకి సమయం సరిపోవడం లేదు ప్రతీ ఒక్కరికి. అస్తమానం ఉరుకులు, పరుగులుతో ఎంతో హడావిడిగా సాగుతున్నారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా లేచిన అనుక్షణం అటు ఇటు సాగుతూ అన్నింటిలో కూరుకుపోతూ....ఇదేజీవితంఅయిపోతోంది. ప్రశాంతతనికోల్పోతూ...బాధలతో కృంగిపోతూ...ఇటువంటి క్షణాల్లో కొంచెం లైఫ్ స్టైల్ ని మనం మార్చితే ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. ఒత్తిడికి కూడా చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది. కనుక సులువైన ఈ మార్గాలని కనుక అనుసరిస్తే ఇక మానసిక ఒత్తిడిని తరిమేయచ్చు.

ఒత్తిడి రావడానికి కారణాలు:

సహజంగా ఒత్తిడి కేవలం మనం చేసే పనులు మీద మాత్రమే కాకుండా కుటుంబ పరిస్థితులు, కొత్త వారితో ఎక్కువ కాలం గడపాలన్న.... ఇలా అనేక కారణాలు..... కారణం ఏదైనా కావచ్చు. కానీ ఒత్తిడిని మాత్రం ఎన్నో విధాలుగా అధిగమించవచ్చు. కానీ జీవితం అంటే విసుకు చెంది....ఆశ కోల్పోయి జీవితాన్ని ద్వేషిస్తూ ఉండడం మంచిది కాదు. ఎంతో సులువుగా ఒత్తిడిని అధిగమించొచ్చు. మరి ఇంకేం ఆలస్యం ఇలా అనుసరించండి. ఒత్తిడి నుండి బయట పడండి.

ఒత్తిడిని తొలగించేందుకు మార్గాలు:

ముందుగా ఒత్తిడిని తగ్గించడానికి మనం దినచర్యలో, ఆహారపు అలవాట్లలో కాస్త మార్పు చెయ్యాలి. ఆలానే శారీరికంగా కూడా వ్యాయామం చెయ్యడం వంటి వాటి ద్వారా ఒత్తిడిని మనం అధిగమించవచ్చు. ఇలా పలు మార్పులు చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎంతో జాగ్రత్తగా వీటిని పాటిస్తే ఏ చింతా ఉండదు.

ఆహారంలో మార్పులు:

మనం తీసుకునే ఆహారం లో ఈ మార్పులను చెయ్యడం మంచిది. టీ, కాఫీ అలవాటు కనుక ఉంటే పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కాఫీ లో కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ వల్ల కార్టిసాల్, అడ్రినలిన్,  నొరడ్రినలీన్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కనుక వీటిని వీలైనంత కట్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. 

ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్స్ వగైరా ఆరోగ్యకరమైన తీసుకోవచ్చు. కానీ ఎనర్జీ డ్రింక్స్ లాంటి వాటికి మాత్రం దూరంగా ఉండాలి. అలానే గ్రీ టీ కూడా సేవించవచ్చు. కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఛాన్స్ ఉంటే మాత్రం తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలానే అశ్వగంధ లాంటి ఆయుర్వేద మూలికలలో కూడా ఒత్తిడి తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా గమనించి మీ డైట్ లో చేర్చితే కనుక ఒత్తిడిని అధిగమించవచ్చు.

సమయపాలన పాటించడం ఉత్తమం:

మనకి రోజులో అనేక పనులు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు పని యొక్క అవసరం, సమయం బట్టి పనులన్నీ సక్రమంగా సమయానికి అయ్యేలా ప్రణాళిక ముందుగానే వేసుకోవాలి. అలా చెయ్యడం వల్ల డెడ్ లైన్స్ కి ముందే మీ పనులని మీరు ఏ ఒత్తిడి లేకుండా పూర్తి చెయ్యగలుగుతారు. ఒక వేళ అనుకోకుండా ఏమైనా కొత్త పనులు వస్తే రోజు వారి పనులకి ఏ ఇబ్బంది లేకుండా ముందు గానే ప్రణాళిక లో మార్పు చేసుకోండి. అంతే కానీ పని కారణంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండండి.

వ్యాయామంతో కాసేపు:

శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఒత్తిడి కూడా దరి చేరదు. కనుక మీ రోజులో కాస్త సమయాన్ని యోగ, వ్యాయామంకి కేటాయించండి. అలా చెయ్యడం వల్ల మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతీ రోజు ఉదయం యోగ లేదా వ్యాయామం చేస్తే మనసుకి కూడా మరెంత ఉపశమనం కలుగుతుంది. 

లేదా రోజులో 20 నిముషాలు పాటు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా మంచి రిలీఫ్ ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉండడానికి ధ్యానం బాగా సహాయ పడుతుంది. మనలో మార్పు కూడా కనపడుతుంది. ప్రతీ రోజు ధ్యానం చేస్తే ఒత్తిడి ప్రభావం పడడం కూడా తక్కువగా ఉంటుంది. 

అలా పుస్తకాలతో:

మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానం అంటారు కదా...? పుస్తకాలని కనుక చదివితే ఒత్తిడి అమాంతం తొలగిపోయినట్టే ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడు ఒక పుస్తకాన్ని ఎవరు లేని చోట ప్రశాంతంగా కూర్చుని కాసేపు చదివితే ఎంతో రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక కథనో, నవలనో  ఒత్తిడిని కూడా ఎంతో సులువుగా మాయం చెయ్యవచ్చు. కాబట్టి అలా పుస్తకాలతో మీ సమయం వెచ్చించండి.

విహారయాత్రలు:

మీకు నచ్చిన ప్రదేశాలకి కాస్త వెళ్ళినా మనసు కుదుటపడుతుంది. ఒత్తిడి కూడా తొలగి పోతుంది. దీనితో పాటుగా మీలో నూతన ఉత్సాహం కలుగుతుంది. మామూలుగానే ఏమైనా ప్రదేశాలని సందర్శించాలంటే మన లో ఉత్సాహం కలుగుతుంది. అలానే కొత్త విషయాలని తెలుసుకోవడం ఆనందంగా గడపడం ఇలా చేస్తే నిజంగా ఎంత ఒత్తిడిని అయినా మనం విడిచిపెట్టవచ్చు. 

చూసారు కదా ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలు. మరి ఇంక ఏ చింత లేకుండా ఒత్తిడి నుండి బయట పడండి. మరే భయం లేదు. ఇలా అనుసరించి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇక మీకు  సాధ్యం.