BREAKING NEWS

అనారోగ్య సమస్యలని తొలగించేందుకు మీ గార్డెన్ లో ఈ చెట్లని పెంచితే చాలు...

ఎంతో మందికి ఇంట్లో మొక్కలని పెంచే హాబీ ఉంటుంది. గృహిణులు నుండి ప్రతీ ఒక్కరికీ కూడా మొక్కలని పెంచడం.... ఆ పూలని, కూరగాయల్ని చూసి ఆనంద పడడం, కాసేపు వాటితో సమయం గడపడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అందరింట్లో ఇది సాధారణమే. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలని పెంచితే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు అని పరిశోధకులు అంటున్నారు. అయితే ఆ మొక్కలని మనం సేకరించడం, పెంచడం అబ్బా....పెద్ద పని అని మీరు అనుకుంటే పొరపాటే..! 

ఎందుకంటే నిత్యం మన ఇళ్లల్లో పెరిగేవి, మనకి అందుబాటులో ఉండేవి కూడా ఇందులో ఉన్నాయి. దీని వల్ల మనం ఏమైనా సమస్య కనుక ఎదురైతే మనం పెంచే మన మొక్కలతోనే సులువుగా సమస్యని పరిష్కరించుకోవచ్చు. మరి ఆ మొక్కలు ఏవో, వాటి ఉపయోగాలు ఏమిటో చూసేయండి.....

తులసి:

తులసి అనేక సమస్యలని పరిష్కరించే దివ్యఔషదం. తులసిలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో. ఆయుర్వేద వైద్యంలో కూడా దీనిని విరివిగా వాడుతూ ఉంటారు. సహజంగా మనం తులసిని ఇళ్లల్లో పెంచి పూజిస్తాము. దీనిని మన గార్డెన్ లో పెంచడం పెద్ద కష్టమూ కాదు.

ఒత్తిడికి తులసితో చెక్:

మామూలుగా ఒత్తిడనేది జీవితంలో సహజం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు ఈ స్ట్రెస్ నుండి బయట పడాలంటే... పది నుంచి పన్నెండు తాజా తులసి ఆకులను రోజులో ఒకటీ లేదా రెండు సార్లు నమిలితే స్ట్రెస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. దీనితో ప్రశాంతంగా ఉండగలరు. లేదంటే ఈ ఆకులని వేడి నీళ్లలో మరగబెట్టి టీ లాగ చేసుకుని తేనె లో కలిపి తీసుకున్నా సరిపోతుంది.

కలబంద:

కలబందని కూడా మనం ఇళ్లల్లో పెంచుతూ ఉంటాం. ఒక వేళ  మీ గార్డెన్ లో కలబంద లేకపోతే చేర్చండి. దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. హెయిర్ నుండి స్కిన్ వరకు ఇలా ఎన్నో సమస్యలని కలబందతో తగ్గించవచ్చు.

కాలిన గాయాలకు కలబంద :

కిచెన్ లో పని చేసేటప్పుడు ఆడవాళ్ళకి  చిన్న చిన్న కాలిన గాయాలు సహజం. అలాంటి సమయంలో అలోవెరా మంచి సహాయం చేస్తుంది. ఎలా అంటే...?  ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక ఈ అలోవెరా జెల్ ని కనుక కాలిన గాయాల పై అప్లై చేస్తే  సూత్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది అలోవెరా. ఇన్ఫెక్షన్ అరికడుతుంది. దీనితో పాటు డ్యామేజ్ నుంచి త్వరగా కోలుకునేందుకు స్కిన్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తుంది. కాబట్టి అలోవెరాని మీ గార్డెన్ లో పెంచడం ఎంతో ఉపయోగం.

పెప్పెర్మింట్:

పెప్పెర్మింట్ వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. ఒక వేళ కనుక టెన్షన్ తలనొప్పి లేదా మైగ్రైన్ తలనొప్పి వంటివి ఏమైనా సమస్యలు కనుక వస్తే పెప్పెర్మింట్ మంచి సొల్యూషన్. 

తలనొప్పిని తగ్గించే పెప్పెర్మింట్ :

అయితే ఈ సమయం నుండి బయట పడాలంటే ఎండిన పెప్పెర్మెంట్ ని మరిగిన నీటిలో కలపాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూతతో కవర్ చేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత వడగట్టి కాస్తంత తేనెను కలపాలి. దీనిని కనుక ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేదా  ఇంహేల్ చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది.  

చమోమైల్:

ఏదో ఒక అనారోగ్య సమస్య మనకి వస్తుంది. ఏదైనా అరుగుదల కాకపోయినా లేక అప్సెట్ స్టమక్ లాంటివి వస్తే చమోమైల్ బెస్ట్ ఆప్షన్.

అప్సెట్ స్టమక్ సమస్యను సాల్వ్ చేసే చమోమైల్:

ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ కనుక అయితే ముందుగా ఒక టీస్పూన్ ఎండిన చమోమైల్ ఫ్లవర్స్ ను కప్పుడు హాట్ వాటర్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళలో వెయ్యాలి. ఈ మిశ్రమాన్ని తేనె తో కనుక తీసుకుంటే  అప్సెట్ స్టమక్ కు సంబంధించిన లక్షణాలు తగ్గిపోతాయి.

క్యాలెండులా:

ఇది కూడా పలు సమస్యలని ఎంతో సులువుగా తగ్గిస్తుంది. ఈ పూల లో స్కిన్ సూతింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల ఎంతో వేగంగా ఉపశమనం కూడా లభిస్తుంది. ఏమైనా ర్యాషెస్, ఎగ్జిమా, డ్రై స్కిన్ మరియు గాయాల నుంచి రిలీఫ్ ఇస్తాయి.

ఇరిటేటెడ్ స్కిన్ నుండి రిలీఫ్ ఇచ్చే క్యాలెండులా  :

ఈ పూలని గ్రైండ్ చేసి ముద్దలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇరిటేటెడ్ స్కిన్ పై అప్లై చేయాలి. ఆ తరువాత వాష్ చేసేసుకోవడమే. 

చూసారు కదా....! ఇలా మన గార్డెన్ లో ఉండే మన మొక్కలతో సమస్యలకి ఎలా చెక్ పెట్టాలో. మీ గార్డెన్ లో అందం తో పాటు ఆరోగ్యాన్ని పెంచే ఈ మొక్కలు లేనట్టయితే వీటిని కూడా మీ గార్డెన్ లో నాటేయండి. ప్రకృతిని మనం రక్షిస్తే..... అది మనల్ని రక్షిస్తుంది.