BREAKING NEWS

స్వాతంత్ర్యానంతర పరిణామాలు:

జైల్లో పెట్టి, చిత్రహింసలకు గురి చేసినా,
గుండెల్లో తూటాల వర్షం గుప్పించినా,
భరత దేశానికై 
ఎనలేని సేవ చేసిన ఎందరో మహానీయులు..
వారి నినాదాలు..
ఎన్నో ఉద్యమాలు..
మరెన్నో ప్రాణత్యాగాలు..
ఎందరో కృషి...
ఫలితమే ఈ స్వాతంత్ర్యం!
తెల్లదొరల పాలన నుంచి భారతదేశం శాశ్వత విముక్తి పొంది నేటికి సరిగ్గా
75 ఏళ్లు… ఈ సందర్భంగా స్వాతంత్ర్య అనంతరం జరిగిన ముఖ్య పరిణామాల గురుంచి ప్రత్యేకంగా…
 
★ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి రోజు, 1947, ఆగస్టు 16న మొదటి ప్రధానమంత్రిగా నియమితులైన నెహ్రు ఎర్రకోటపైన జెండాను ఎగరవేశారని ప్రభుత్వ సచివాలయంలోని పత్రాలలో రాసి ఉంది.
 
★ రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాల ముందు జపాన్ లొంగిపోయిన రోజు 1947 ఆగస్టుకు సరిగ్గా రెండు సంవత్సరాలైన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది.
 
★స్వాతంత్ర్యం వచ్చాక భారత్, పాకిస్థాన్ ల మధ్య సరిహద్దు రేఖ లేదు. కానీ రెండురోజుల తర్వాత అంటే, ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. 
 
★అప్పటివరకు మనదేశానికి ప్రత్యేకంగా 'జాతీయ గీతం' అనేది లేదు.1911లో రవీంద్రనాథ్ రాసిన "జనగణమన" గీతాన్ని 1950లో జాతీయ గీతంగా ఆమోదించారు.
 
★1947 ఆగస్టు 15న మన దేశానికే కాక మరో అయిదు దేశాలు కూడా స్వాతంత్ర్యాన్ని పొందాయి. అవి బహ్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, లిక్టిన్ స్టైన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో.
 
★'క్విట్ ఇండియా ఉద్యమం'లో భాగంగా గాంధీ 'డూ ఆర్ డై' అనే నినాదాన్ని అందించారు. ఈ ఉద్యమంలో చేరాలని ప్రజలందరినీ ఆయన అభ్యర్థించారు. ఆ మాట విన్న ఓ వైద్య విద్యార్థిని ఉషా మెహతా రహస్యంగా రేడియోను మొదలు పెట్టి ఎంతోమందిని ఉద్యమంలో పాల్గొనేలా ఉత్సాహాపరిచింది. అందుకుగానూ బ్రిటిష్ వారు ఆమెను జైలుపాలు చేశారు.  
 
★కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకి చెందిన ఈసూరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంటూ, తమ గ్రామానికి స్వతంత్రంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. ఇలా ప్రకటించుకున్న మొట్టమొదటి గ్రామంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు 1942 సెప్టెంబర్ 29న జెండాను ఎగురవేసింది.
 
★కరీంనగర్ లోని జమ్మికుంట గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఎక్కడిక్కడే తమ పనులను పక్కన పెట్టేసి సెల్యూట్ చేస్తూ "జనగణమన గీతం" పాడతారు. దానికి కారణం ప్రశాంత్ రెడ్డి అనే పోలీసు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలని ఈ కార్యక్రమం చేపట్టారు.
 
★రోహ్ నాథ్ గ్రామానికి చెందిన ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, హిసార్ జైలును ధ్వంసం చేసి ఆపై స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న వారిని విడిపించారు. అప్పుడు జరిగిన గలాటలో కొందరు బ్రిటిష్ వాళ్లు చనిపోవడానికి ఈ గ్రామవాసులే కారణమైనందుకూ, బలవంతంగా వారి భూములను లాక్కొని, దొరికినవాళ్లని దొరికినట్లుగా ప్రాణాలు తీసింది. అంతేకాదు ఆ ఊరిని  "తిరుగుబాటుదారుల ఊరు"గా పేరు మార్చింది. 

స్వాతంత్య్రం పొందాక కూడా ప్రభుత్వం వాళ్ల పూర్వీకుల త్యాగాలను గుర్తించలేదని ఎంతో వాపోయారు. అందుకు 2018, మార్చి 23న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించి, మొదటిసారి ఆ గ్రామంలో జెండాను ఎగురువేశారు. అలా ఆ ఊరు ఏకంగా 71 ఏళ్ల దాకా జెండా పండగనే జరుపుకోలేదు.
 
★జెండాలను తయారుచేయడానికి 2004లో మొదలు పెట్టిన ఏకైక సంస్థ - "కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ్" ఇది కర్ణాటకలోని బెంగేరి గ్రామంలో ఉంది. 
 
★జెండాలను బాగల్ కోటలో నేసిన ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేస్తారు. వాటిని మూడు భాగాలుగా చేసి అందులో బ్లీచింగ్ ను వాడి, రంగులద్దుతారు. ఆ వస్త్రాలను సమానంగా మూడు భాగాలుగా కత్తిరిస్తారు. మొదట కాషాయం, రెండోది తెలుపు రంగు, మధ్యలో అశోక చక్రాన్ని రెండు వైపులా ఉండేలా స్క్రీన్ ప్రింటింగుతో ముద్రిస్తారు. మూడోవది ఆకుపచ్చ రంగుతో కలిపి కుడతారు. 3:2 పొడవు, వెడల్పు ఉండేలా కచ్చితమైన కొలతతో జెండాను తయారు చేస్తారు. 
 
★స్వాతంత్ర్యం కోసం పాటుపడుతున్న మన దేశ ప్రజల్ని అండమాన్ జైలులో వేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, తాళం చెవి విసిరేసిన తీసుకునే వీలు లేకుండా తలుపును అమర్చారు. అంతేకాక కాళ్లు, చేతులు కట్టేసి, ఒళ్లంతా ఇనుప గొలుసు సంకెళ్లతో బంధించేవారు. ఒకవేళ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించిన నీళ్లలో పడి షార్కులకు, తిమింగలాలకు బలి కావాల్సిందే!
భగత్ సింగ్ సహాచరుడైన మహావీర్ సింగ్ ను భరింపరాని చిత్రహింసలకు గురిచేసి, ఆపై మరణించేలా చేశారు. ఇదే అండమాన్ జైలు దీనికే మరో పేరు సెల్యూలార్.
 
★బ్రిటిష్ ప్రభుత్వం వల్ల మన దేశం చాలా నష్టపోయింది. చేనేత వస్త్ర పరిశ్రమని కూల్చేశారు. 45 నుంచి 80శాతం వరకు రకరకాల పన్ను వసూలు చేశారు. విద్యను కూడా ఒక వ్యాపార రంగంగా మార్చేశారు. 
స్టీల్ కంపెనీని స్థాపించకుండా నానా తిప్పలు పెట్టి, స్థాపించకుండా చేశారు.
 
★బ్రిటిష్ వాళ్లు మన దేశంలో దోచేసిన సంపదను ఇప్పుడు విలువ కడితే దాదాపు 225లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ఓ భారతీయ రచయిత మిన్హాజ్ మర్చంట్ ఓ సందర్భంలో చెప్పారు.
 
★స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా జలియన్ వాలాబాగ్, రెండో ప్రపంచ యుద్ధంలో కలిపి సుమారు లక్షన్నర మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
కరవులూ, ప్లేగు ఇతరత్రా వ్యాధుల మూలాన దాదాపు మూడున్నర కోట్ల మంది భారతీయులు చనిపోయారని ఓ అంచనా!
 
★మనకు 1947లో స్వాతంత్య్రం వస్తే, 1975 నాటికల్లా దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలో స్వపరిపాలన వచ్చేసింది.
 
★వ్యాపారరీత్యా ఇక్కడికి వచ్చి, మన దేశాన్నే ఆక్రమించుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఇందుకు వ్యతిరేకంగా మన దేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఉద్యమాల పరంపర మొదలైంది. అవే 'సిపాయిల తిరుగుబాటు', 'స్వదేశీ ఉద్యమం', 'హోం రూల్ మూవ్ మెంట్', 'ఖిలాఫత్ ఉద్యమం', 'ఉప్పు సత్యాగ్రహం', 'క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను చూసి ఇక ఇక్కడ ఉండలేమని స్వాతంత్ర్యాన్ని తిరిగి మనకిచ్చేసి తిరిగి వెళ్లిపోయింది ఆంగ్లేయుల బలగం.
 
★సిపాయిల తిరుగుబాటుకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వారిలో ముఖ్యులు మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మిబాయి, తాంతియా తోపె, నానా సాహెబ్ లు. 
★స్వరాజ్యమే ఆశయంగా సాగింది స్వదేశీ ఉద్యమం.
★ ఈ ఉద్యమానికి మూలం అనిబిసెంట్.
★గాంధీజీకి జాతీయ నాయకుడిగా గుర్తింపు లభించింది ఖిలాఫత్ ఉద్యమంతోనే.
★'స్వరాజ్య' సాధనే లక్ష్యంగా సాగింది సహాయ నిరాకరణోద్యమం.
★సబర్మతి నుంచి మొదలైన ఉప్పు సత్యాగ్రహంలో కస్తూర్బా, సరోజిని నాయడులు పాలు పంచుకున్నారు.
★బానిసత్వానికి నిరసనగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమం ఫలితంగానే మనకు స్వాతంత్రం లభించింది.
 
ముఖ్య నినాదాలు..

★"వందేమాతరం.. వందేమాతరం" - బంకించంద్ర ఛటర్జీ..
★"ఇంక్విలాబ్ జిందాబాద్" - భగత్ సింగ్..
★"స్వరాజ్యం నా జన్మహక్కు" - తిలక్..
★"సత్యమేవ జయతే" - మదన్ మోహన్ మాలవ్యా…
★"సైమన్ గో బ్యాక్" - యూసఫ్ మెహర్ అలీ..
★"జై హింద్" - నేతాజీ. ఇదే మన జాతీయ వందనంగా మారింది.