BREAKING NEWS

హిస్ సో... 'హ్యాండ్సమ్'!

'మహేష్'... ఆ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది.
అందుకే అమ్మాయిల కలల రాకుమారుడయ్యాడు.
అభిమానులకు సూపర్ స్టార్ అయ్యాడు.
ఒకప్పటి స్టార్ హీరో కొడుకైనా,
ఇప్పటి అగ్రహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
'క్లాసిక్ లుక్'కి కేర్ ఆఫ్ గా నిలిచిన
'అతడు'…
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడనే 'పోకిరి'గా తనలోని మాస్ వెర్షన్ తో మరింత చేరువయ్యారు.
'మనుషులందు నీ కథ' అంటూ…రైతుల గుర్తింపు కోసం పాటుపడిన ఓ 'మహర్షి'లా...
'హిస్ సో క్యూట్, హిస్ సో హాట్, హిస్ సో హ్యాండ్సమ్.. లుక్ లో కనిపించినా, దేశభక్తిని చాటే సైనికుడిగా... ఎన్నో సందేశాత్మక పాత్రల్లో నటించి, మెప్పించాడు.
నిజమే అతడు అప్పటికి, ఇప్పటికీ  రాకుమారుడే! 
 
మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా, కథానాయకుడిగా మొదటి సినిమాతోనే అవార్డులను, అంతకుమించి ప్రశంసలు అందుకున్నాడు. ఎప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ, జయాపజయాలనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే తన వంతు సాయంగా ఎంతోమంది చిన్నపిల్లల గుండె జబ్బులకు చికిత్స చేయించారు. సినీ పరిశ్రమలో మొదట్లో అతనుకున్న క్రేజ్ పెరుగుతూనే ఉంది. ట్విట్టర్ లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోగా ఈయనకు పేరుంది. యాసైనా, లేక హాస్యం నిండిన పాత్రైనా చక్కగా ఒదిగిపోతారు. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు.

ఈ నెల 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది ఎస్ విపి బృందం. 'పడుకునేముందు సర్ కి దిష్టి తీయడం మర్చిపోవద్దు' అని హీరోయిన్ చెప్పే డైలాగ్, హీరో ఫైట్ సీన్, అంతకుమించిన హావభావాలతో కూడిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఆయన సినీ, జీవిత విశేషాల గురుంచి ప్రత్యేకంగా… తెలుసుకుందాం.
 
పుట్టింది:-

మహేష్ బాబు 1975 ఆగస్టు 9న  చెన్నైలో జన్మించాడు. ఈయన పూర్తిపేరు ఘట్టమనేని మహేష్ బాబు. తండ్రి కృష్ణ ఒకప్పటి సూపర్‌స్టార్‌, తల్లి ఇందిరదేవి. అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల. ఒక చెల్లెలు ప్రియదర్శిని. 
 
చదువు:-

మహేష్ బాబు సెయింట్ బీడ్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివాడు. లయోలా కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేశాడు.
 
సినీరంగ ప్రవేశం:-

మహేష్ బాబు చిన్నవయసులోనే చిత్ర సీమలో అడుగుపెట్టారు. అంతకంటే ముందు దర్శకుడు ఎల్. సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు. ఆ తరువాత 1979లో వచ్చిన "నీడ" అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. 1990లో వచ్చిన బాలచంద్రుడు, అన్న తమ్ముడు కూడా చేశారు. ఆ తరువాత చదువు మీద ఉన్న శ్రద్ధతో డిగ్రీ పూర్తి చేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'రాజకుమారుడు' అనే సినిమాతో హీరో గా ఆరంగేట్రం చేశాడు. హిట్, ప్లాఫ్ అని తేడా లేకుండా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు.

హీరో కాకముందు అన్నతో, తండ్రితో పలు వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ఇప్పటివరకు బాలనటుడిగా 8 చిత్రాలు, పూర్తిస్థాయి కథానాయకుడిగా 25 సినిమాలు చేశారు.
 
పురస్కారాలు:- 

1999లో 'రాజకుమారుడు', 
2002లో 'నిజం',
2005లో 'అతడు',
2011లో 'దూకుడు',
2015లో 'శ్రీమంతుడు' సినిమాలకుగానూ ఉత్తమ నటుడిగా
నంది అవార్డులు వచ్చాయి.
2002లో 'ఒక్కడు', 
2005లో 'అతడు',
2006లో 'పోకిరి',
2011లో 'దూకుడు',
2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలకుగానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.
 
వివాహం:-

2005లో ఒక్కప్పటి మిస్ ఇండియా అయిన నమ్రత శిరోధాకర్ తో మహేష్ బాబు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార.
 
ఇతర విశేషాలు...

◆మహేష్ బాబు తన బాల్యాన్ని చెన్నైలో ఉన్న అతని బామ్మ దుర్గమ్మతో పాటు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేవాడట.

◆మహేష్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ◆ చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్‌ అంటే చాలా ఇష్టమట.

◆ఈయన తెలుగులో 'థమ్స్ అప్', 'రాయల్ స్టాగ్', 'సంతూర్ సబ్బు' లాంటి మరెన్నో యాడ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. 

◆2015లో మహేష్ బాబు తన తండ్రి  స్వగ్రామమైన తెనాలిలోని బుర్రిపాలెం లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను తీసుకున్నారు.

◆హీల్- ఎ- చైల్డ్ ఫౌండేషన్‌లో అంబాసిడర్ గా కూడా ఉన్నారు. 

◆ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ లో హుద్ హుద్ తుఫాను కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలైనప్పుడు అందుకు తనవంతు సాయంగా ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

◆మహేష్ బాబు తన పేరుమీద జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థను స్థాపించారు.
 
 కొన్ని హిట్ పాటలు

"చెప్పవే చిరుగాలి.. చల్లగా ఎదగిల్లి"
"బెదరక ఎదురే చెప్పేటి తెగువకు తొడతడే"
"గురువారం మార్చి 1,
సాయంత్రం 5.40.."
"అరడుగులుంటాడా…
ఏడడుగులేస్తాడా…"
"హిస్ సో క్యూట్, హిస్ సో హాట్, హిస్ సో హ్యాండ్సమ్..."
 
 పంచ్ డైలాగులు

"కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు"

"చెప్పండ్రా అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డు…"

"నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్"

"మీకోసం ప్రాణాలిస్తున్నాం అక్కడ, మీరేం ఇక్కడ… బాధ్యతుండకర్ల"
చివరగా ఆయన నటనకు 'టేక్ ఏ బౌ'.