BREAKING NEWS

అరాచక పాలన: తాలిబన్?!

అసలు ఈ తాలిబన్ ఎవరు?
వారి పాలనలో జరుగుతున్న అన్యాయాలేంటి?
అప్గాన్ పౌరులకు రక్షణ లేకుండా పోవడానికి కారణాలేంటి?
నేడు కాబూల్ విమానాశ్రయంలో ప్రాణాలకు తెగించి పరిగెడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయేందుకు?
చిన్న తప్పుకే చంపేస్తున్నారెందుకు?
క్షమాభిక్ష పేరుతో వారు చేస్తున్న అరాచకాలకు మూలమేంటో ఈరోజు సవివరంగా తెలుసుకుందాం:

తాలిబన్:-

తాలిబన్ అంటే పష్టో భాషలో 'విద్యార్థి' అని అర్థం. ఇస్లామిక్ విద్యాలయాల్లో చదువునే వీరంతా ఓమర్ విద్యార్థులు.  వీరినే 'తాలిబన్' అని పిలుస్తారు. 1990లో సోవియట్ సేనాలపై ముజాహిదీన్ వర్గం గెలుపొంది తర్వాత, ప్రజలపై విపరీతంగా పన్నులు వసూలు చేసింది. 

1998లో పాకిస్థాన్ సైన్యం సాయంతో అఫ్ఘన్ లోని ముజాహిదీన్ వర్గం నుంచి తాలిబన్లు విముక్తి కల్పించారు. తర్వాత ఇస్లామిక్ పాలనలో షరియా చట్టాన్ని తీసుకొచ్చి వివాహేతర సంబంధాలు కలిగిన మహిళ లేదా పురుషుడ్ని ఉరితీయడం లేదా చంపేసేవారు. పురుషులు గడ్డం పెంచడం, మహిళలు తప్పనిసరిగా బురఖాలు ధరించాలనే నియమాలను ఆపాదించారు. ఇతర మతాన్ని పట్టించుకునేవాళ్లు కాదు. వీరంతా మధ్యరాతియుగం నాటి సూత్రాలనే ఎక్కువగా నమ్ముతారని తెలుస్తోంది.
 
అసలు ఏం జరిగింది:-

అమెరికా మీద సెప్టెంబర్ 11న ఉగ్రవాదుల దాడి జరిగిన అనంతరం.. ఒసామా బిన్ లాడెన్, ఆల్ కైదాకు ఆశ్రయం కల్పించారంటూ అప్గానిస్థాన్ మీద అమెరికా దండెత్తింది. ఆ తర్వాత తాలిబన్లు అధికారంలోకి వచ్చి నేటికీ 20 ఏళ్లు అవుతుంది. 

నాడు తాలిబన్లు తమ పాలనలో షరియా చట్టాన్ని అమలు చేశారు. మహిళలు బయటికి రావొద్దని, పూర్తిగా బురఖా వేసుకోవాలనే ఆంక్షలను పెట్టింది. పదేళ్లు దాటిన ఆడపిల్లలు ఇంటివద్దనే ఉండాలని, అలాగే మహిళలకు ఎటువంటి హక్కులను కల్పించలేదని చెప్పడం ఇందులో భాగమే!

అటువంటి తాలిబన్లు ఇప్పుడు మారిపోయామంటూ… ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబుల్ ని ఆక్రమించి, యావత్ దేశానికి క్షమాభిక్ష పెడుతున్నట్లుగా ప్రకటించాయి. కానీ పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటి  అరాచక పాలనను మళ్లీ కొనసాగిస్తారేమోననిపిస్తుంది. 

వీరికి భయపడిన ప్రజలు దాదాపు 640 మంది అఫ్గాన్ లు విమానం ఎక్కి కతార్ కు చేరుకున్నారు. 1-2 రోజుల్లో వారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పర్చుకోనున్నారు.
 
భారత్ ఆఫ్గాన్ మైత్రి...

●2001లో భారత్ అఫ్గాన్ ల మధ్య స్నేహం కుదిరింది. 2011లో అప్గానిస్థాన్ లో భారత్ పెట్టుబడులను పెట్టడం, అక్కడి వస్తువులపైన ఎటువంటి పన్ను లేకుండా ఇక్కడ అమ్ముకునే సదుపాయం కల్పించింది. దాంతోపాటు నిర్మాణాలకు, విద్య, సాంకేతిక సాయాన్ని కూడా అందిస్తుంది.

●కాబుల్ లో 9 కోట్ల డాలర్లతో పార్లమెంట్ భవనాన్ని భారత్ నిర్మించింది. దీనికి మాజీ ప్రధాని ఎ.బి.వాజ్ పేయి పేరు పెట్టడంతో పాటు 2015లో ప్రధాని మోదీ ప్రారంభించారు.

●భారత్ అప్గాన్ కు 400 బస్సులు, 200 మినీ బస్సులతో పాటు, మున్సిపాలిటీలకు 105 యుటిలిటీ వాహనాలను, ప్రభుత్వ ఆసుపత్రులకు 10 అంబులెన్సులను ఇచ్చింది. అలాగే 3 "ఎయిర్ ఇండియా" విమానాలను అందించింది. 

● 2016లో సల్మా డ్యామ్ అనే జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఇందులో 42 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తికాగా, దాంతోపాటు 75వేల హెక్టార్ల భూమికి సాగు నీరు అందిస్తుంది. అఫ్గాన్ భారత్ స్నేహానికి గుర్తుగా కట్టించిన కేంద్రమిది.
 
అఫ్గాన్ సైనికులు చేసిన పొరపాట్లు:-

●యూఎస్ సైనికులు అఫ్గాన్ సైన్యానికి శిక్షణ ఇస్తుండడంతో అందులో తక్కువ మొత్తంలో పష్తూన్‌ వాసులను చేర్చుకుంది. కానీ తాలిబన్లలో ఎక్కువ మంది ఆ వర్గం వాళ్లే ఉన్నారు. దాంతో ప్రజలు అఫ్గాన్ సైనికులకు కాకుండా తాలిబన్లకు మద్దతు ఇచ్చారు.

●ఒకేసారి మూడు లక్షలమందికి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాలేదు. పైగా యుద్ధం సమయంలో ఆయుధాలను ఎలా వాడాలో తెలియక భయపడి చాలామంది సైనికులు దూరంగా పారిపోయేవారు.

వీటితోపాటు నిరక్షరాస్యత, క్రమశిక్షణ లేనివారిని సైన్యంలోకి చేర్చుకోవడంతో నిబద్ధత కలిగిన సైన్యాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. 

●ఆఫ్ఘనిస్తాన్ లో అంతకుముందు దాదాపు 80శాతం వరకు విదేశాల నుంచి వచ్చిన డబ్బునే ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు తాలిబన్లు రావడంతో అమెరికా వెనుతిరిగింది. దీంతో సైనికులకు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్లు అవినీతికి పాల్పడటం జరిగింది. 

●స్థానికంగా ఉన్న ప్రజల సొమ్మును దోచుకోవడంతో సైనికులపైన విమర్శలు వెల్లువెత్తాయి. 

●డబ్బుకోసం డ్రగ్స్ తీసుకునే స్మగ్లర్లతో సైనికులు చేతులు కలిపారు.
 
●మౌలిక సదుపాయాలు లేకపోవడం, రోడ్డు, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై అవగాహన లోపించింది.

● సైన్యంలో ఆరితేరిన తాలిబన్లు నెలరోజుల్లో పూర్తిగా అప్గానిస్థాన్ నే వారి చేతుల్లోకి తీసుకుంది. 

● అప్గానిస్థాన్ లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. ఎప్పటిలాగే అసదాబాద్ నగరంలో కొందరు జాతీయ జెండాతో ర్యాలీని చేపట్టగా, తాలిబన్లు వీరిపై కాల్పులు జరిపారు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. కానీ ఎంతమంది చనిపోయారో లెక్కేలేదు.

●ఇప్పుడు తాలిబన్ల కొత్త అధ్యక్షుడిగా  ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు వినిపిస్తుంది.

●తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హోదాలో హైబతుల్లా అఖుండ్‌జాదా వ్యవహారిస్తారని ఆ సంస్థ ప్రతినిధి వహిబుల్లా హషీమీ ఓ ఆంగ్ల వార్త సంస్థకు వెల్లడించారు.

●అప్గానిస్థాన్ లోని తల్లులు తమ పిల్లల్ని కాపాడమని కాబుల్ విమానాశ్రయంలో  పహారా కాస్తున్న యూకే, యూఎస్ బలగాలను కోరుతూ అడ్డుగా ఉన్న ఇనుప కంచెలపై నుంచి విసిరేస్తూ మొరపెట్టుకుంటున్న దృశ్యం హృదయవిదారకంగా ఉంది. 

●ప్రస్తుతం యూఏఈలో ఉన్నట్లు అష్రాఫ్ ఘనీ వెల్లడించారు.

●అఫ్గాన్ కోసం కేటాయించిన దాదాపు 70,500 కోట్ల(950కోట్ల డాలర్లు)ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ చెప్పినట్లు పాక్ కు చెందిన ఒక పత్రికలో వచ్చింది.

●1990లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన అబ్దుల్ అలీ మజారీని 1996లో చంపేశారు. అంతేకాదు సెంట్రల్ బమియాన్ ఫ్రావిన్సులో ఉన్న ఆయన విగ్రహాన్ని కూల్చేయడమే కాదు. ఒక పార్కుకు సైతం నిప్పటించారు. 

●అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సల్లేహ్ మాత్రం తాలిబన్లకు సవాలు చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పంజ్ షేర్ లోయ ఫ్రావిన్సు మాత్రం తాలిబన్ల ఆధీనంలో లేదు. 

● కాబుల్ విమానాశ్రయంలో దాదాపు 40మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ కమాండర్ మొహిబుల్లా హెక్మత్ చెప్పారు. అంతేకాదు కతర్ కు చేరుకున్న "సి-17 గ్లోబ్ మాస్టర్" విమాన చక్రాలపైన ఓ వ్యక్తి మృతదేహం లభించినట్లు అమెరికా వెల్లడించింది.
తాజాగా కాబుల్ విమానాశ్రయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు అప్గాన్ పౌరులు మృతి చెందారంటే రాబోయే పరిణామాలు ఇంకేలా ఉంటాయో వేచి చూడాల్సిందే!