BREAKING NEWS

కలోంజీ తింటే ఇమ్మ్యూనిటీతో పాటు ఎన్నో ప్రయోజనాలు....!

కలోంజీ అంటే  నల్ల జీలకర్ర. దీనికి దేశ వ్యాప్తంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇది అత్యంత విలువైన ఔషధ విత్తనాలలో ఒకటి. దీనిని వంటల్లో మంచి సువాసనని రావడానికి ఉపయోగిస్తారు. కూర మసాలాల్లో, గరం మాసాల్లో ఇది ప్రధాన ఇంగ్రీడియంట్. మనం చేసుకునే ఊరగాయల్లో ఇది మంచి రుచిని అందిస్తుంది. ఖాడీ సమోసా, కచోరి రుచిని మరెంత పెంచుతుంది ఇది. కేవలం ఒకటే రంగులో ఇది ఉండదు. మొత్తం మూడు రంగుల్లో ఇది ఉంటుంది. పసుపు-నారింజ రంగు, తెలుపు రంగు మరియు నలుపు రంగు. ఇలా మూడు రకాలు ఉంటాయి. 
 
ఆయుర్వేద వైద్యంలో నల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర నూనె విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ ని ఇది తగ్గించడానికి సహాయ పడుతుంది. అలానే చర్మ సమస్యలని, గుండె పోటు వంటి సమస్యలని కూడా తగ్గిస్తుంది. సహజ చికిత్సగా కూడా ఈ నల్ల జీలకర్ర బాగా పని చేస్తుంది. 
 
నల్ల జీలకర్రలో ఉండే పోషకాలు:
 
దీనిలో ఎన్నో పోషక విలువులు ఉన్నాయి. శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలైన కడుపు, ప్రేగులు, కాలేయం, హృదయం, మూత్ర పిండాలతో ముడిపడ్డ అనేక రకాల వ్యాధుల్ని నివారించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీనిలో ప్రోటీన్స్, కొవ్వులు, కార్బో హైడ్రేట్స్ మరియు పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నల్ల జీలకర్ర విత్తనాలలో వివిధ విటమిన్స్ తో పాటు రాగి, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, విటమిన్స్ అధికంగా ఉంటాయి.
 
నల్ల జీలకర్ర ఉపయోగాలు: 
 
ఈ నల్ల జీలకర్ర వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మరి ఆ జీలకర్ర శరీరానికి ఎలా మేలు చేస్తుందో? కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి ఇంక ఆలస్యం చేయకుండా చదివేయండి....
 
కాన్సర్ వృద్ధిని అరికట్టేందుకు:
 
నల్ల జీలకర్ర విత్తనాలు రక్షణాత్మక గుణాలను కలిగి ఉంటాయి. అందుకే, నల్ల జీలకర్ర గింజల తీసుకోవడం వల్ల శరీరంలో కణితులు ఏర్పడటాన్ని మరియు పెరుగుదలను నిరోధించి నెమ్మదిగా క్యాన్సర్ వృద్ధిని అరికట్టేందుకు సహాయ పడుతుంది. నల్ల జిలకర క్యాన్సర్ కారకాల వృద్ధిని  నిరోధించి (మెటాస్టాసిస్ను) క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించడంలో యాంటీ-ముటాజెనిక్ గా, మరియు యాంటీ-ప్రొలిఫరేటివ్ కారకంగా ఉంటుంది. ఇలా  ఇది క్యాన్సర్ వృద్ధిని తగ్గించి వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. కనుక నల్ల జీలకర్ర తో ఈ ఉపయోగాన్ని కూడా మనం పొందవచ్చు.
 
గుండె ఆరోగ్యం మరెంత పెంచేందుకు:
 
నల్ల జీలకర్ర వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. గుండె కండరాల ఒక విభాగానికి రక్త ప్రవాహం నిల్చిపోయినప్పుడు గుండెపోటు ఏర్పడుతుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం శరీరంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్ (కొవ్వు రకం) స్థాయిలు. దీనితో సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో నల్ల జిలకర విత్తనాలు సహాయపడతాయి, అందువల్లనే నల్ల జిలకర గింజలు హృదయానికి చాలా మంచివి. ఇలా వివిధ రకాల గుండె సమస్యల నుండి గుండెను రక్షించడంలో నల్ల జిలకర గింజలు బాగా పని చేస్తాయి. కనుక దీనిని సేవిస్తే గుండెకి ఎంతో ఆరోగ్యం వస్తుంది.
 
చర్మానికి నల్ల జీలకర్ర:
 
స్వచ్ఛమైన మరియు మెరిసే చర్మాన్ని నిర్వహించడానికి ఇది బెస్ట్ హోమ్ రెమిడీ. ఈ నూనెలో  రసాయనిక పదార్థాలైన థైమోక్వినోన్, థైమోల్, నిగిలిసిన్, కార్వాకోల్ మరియు ఆల్ఫా-హేడరిన్ వంటి పదార్థాలను సమృద్ధిగా ఉంటాయి. అలానే  అనామ్లజని మరియు యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇందు కారణంగా ఈ నూనెను మొటిమలు, మచ్చలు వంటి చర్మ వాటిని సహజంగా మాన్పడానికి ఉపయోగిస్తారు. అలానే ఈ నూనె ముఖ సౌందర్యానికి వేసుకునే ఫేస్ ప్యాక్లలో కలుపుకుంటే కూడా స్వచ్ఛమైన మరియు మెరిసే చర్మాన్ని పొందవచ్చు. 
 
బరువుని తగ్గించే దివ్య ఔషధం:
 
దీనిని తీసుకోవడం వల్ల  శరీర బరువు గణనీయంగా తగ్గించుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హిప్ వద్ద కొవ్వు వంటివి కూడా తగ్గిపోతాయి.అలానే ఈ జీలకర్ర వల్ల   ఊబకాయ-వ్యతిరేక లక్షణాల్ని చూపుతూ శరీర బరువును తగ్గించడానికి సహాయ పడతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు దీనిని కూడా మీ డైట్ చేర్చితే ఫలితం మరెంత మెరుగుగా ఉంటుంది. 
 
కాలేయానికి ఇది ప్రయోజనం:
 
నల్ల జీలకర్ర సామాన్య సూక్ష్మజీవి సంక్రమణల నుండి కూడా కాలేయాన్ని రక్షిస్తుంది. కాలేయ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే  ఒక చెంచాడు తేనె కలిపిన నల్ల జీలకర్రని తీసుకుంటే శరీరంలోని కీలక అవయవాలు మరియు ఎముకల్ని బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది.
 
ఇమ్యూనిటీ పెంచుకోండి:
 
వార్మ్ వాటర్, తేనె మరియు నిమ్మరసం కాంబినేషన్ అనేది వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుందని చెబుతూ ఉంటారు. అలానే దీనిలో కాస్తంత కలోంజీ సీడ్స్ పౌడర్ ను కూడా కలిపితే మీ ఇమ్మ్యూనిటి మరెంత బలపడుతుంది.
 
అలానే వ్యక్తి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో, వివిధ రకాల నొప్పులన్ని తగ్గించడంలో కూడా మంచి ఔషధం ఈ నల్ల జీలకర్ర. అలానే డయాబెటిస్ కు చెక్ పెట్టే లక్షణం ఉంది. అంతే కాకుండా ఆస్త్మా తగ్గుతుంది. చూసారు కదా దీని వల్ల కలిగే ప్రయోజనాలు....! వీటిని ఫాలో అవుతూ మీ సమస్యలకి చెక్ పెట్టేయండి. ఆరోగ్యంగా ఉండండి.