BREAKING NEWS

గోదావరి అన్నపూర్ణ ''డొక్కా సీతమ్మ''

ఎన్నో శుభకార్యాలలో అమ్మై విరాళాలిచ్చే......అతిధులకు ప్రేమ పంచి అన్నపూర్ణయ్ నిలిచే.... విరతాన్నదాత్రి సీతమ్మ నేటికీ ఆదర్శమే....డొక్కా సీతమ్మ సేవ తత్పర భావం తో అభాగ్యుతుల సేవకి అంకితమైంది. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె నిత్యాన్నదానాన్ని సేవగా చేసి దానికే అంకితమైంది. మరి అటువంటి అన్నదానం సేవకి చిరునామాగా నిలిచిన ఈ అన్నపూర్ణ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి పూర్తిగా చదివేయండి.
 
స్వతంత్రం రాక ముందు ప్రయాణ సౌకర్యాలు ఏమి ఉండేవి కావు. అటువంటి సమయం లో దారినపోయే బాటసారులకు లేదనకుండా అన్నదానం చేసేది. ఈమె నిజంగా ఆంధ్రుల అన్నపూర్ణ. కేవలం ఒకరిద్దరికి మాత్రమే కాకుండా, పలానా సమయం అనే కాకుండా కడుపు నిండా భోజనం పెట్టేది. నిత్యం ఈమె ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉండేది. లేదు కుదరదు అనే మాటలు ఈమె నోటి నుంచి వచ్చేవి కావు. డొక్కా సీతమ్మ గోదావరి జిల్లా మండపేట లో 1841  వ సంవత్సరం, అక్టోబర్ నెల లో జన్మించారు. ఈమె తండ్రి భవాని శంకరం.ఈయనని బువన్న అని కూడా పిలిచేవారు. డొక్కా సీతమ్మ ఈ పేరుని సార్ధకం చేసిందనే చెప్పాలి. ఇలా ఈమె అమోఘమైన సేవలని ఎన్నో చేసింది. ఆమె సేవలని ఎవరు మరిచిపోలేనివి. ఆమె కీర్తి, ఖ్యాతి అందరూ తెలుసుకోదగ్గది. 
 
ఆతిధ్యానికి వచ్చిన జోగన్న ఆమె లో అణుకువ , మంచితనం చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. దీనితో ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది. వీళ్లిద్దరు దాంపత్యం అన్యోన్య మైనది. వీళ్ళ దాంపత్యాన్ని చూసి నలుగురు ఆనందించే వారు. చీకటి కష్టాల్లో తూర్పున వెలుగులా.....ఏ బాధ వచ్చినా అమ్మై చూసుకునేది. అంతే కాదు ఈమె ఆకలి అందరికి ఒకటే అని చెప్పి అదే బాట లో కొన సాగింది. శుచి శుభ్రత తో పాటు ఆప్యాయత కి, ఆదరణకు వారి ఇల్లు పెట్టింది పేరు. ఈమె ఆకలిగా ఉన్న వారికి అన్నపూర్ణ అయ్యి  భోజనం పెట్టేది . కాశీ అన్నపూర్ణ , అక్షయపాత్ర , ప్రేమమూర్తి, నిత్యా అన్నదాత్రి, అమృతమూర్తి ఇలా ఈమె ని మనం భావించవచ్చు. శాంతి, దయ, కరుణ, సహనం కలగలిపిన కారుణ్య మూర్తి డొక్కా సీతమ్మ. 
 
స్త్రీ జాతికి వన్నె తెచ్చిన నారి శిరోమణి డొక్కా సీతమ్మ అపర అన్నపూర్ణ గా, విఖ్యాతి గడించిన నిరతాన్నదాత సీతమ్మ. ఆ తల్లి వ్యక్తిత్వం, ఆ తల్లి ఔదార్యం, జీవితం, జీవనం ఆదర్శప్రాయం, అనన్య సామాన్యం. అన్నం పరబ్రహ్మం అనే నానుడిని నిజం చేసింది ఈమె. ఏ విద్యలు నేర్చుకోక పోయినా, పాఠశాలకు వెళ్లక పోయినా, పెద్ద ఆస్తి ఏమి లేక పోయినా అన్నమో రామచంద్ర అన్న వాళ్ళ ఆకలి తీర్చింది. సుగుణాలకి  నెలవంక ఈమె. గొప్ప త్యాగి డొక్కా సీతమ్మ. 
 
డొక్కా సీతమ్మ గురించి పలు విశేషాలు: 
 
కేవలం ఈమె అన్నదానమే కాకుండా పెళ్లిళ్లు , శుభకార్యాలప్పుడు విరాళాలు ఇచ్చేది. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర విరాళాలు కానీ చందాలు కానీ తీసుకోలేదు. ఒకనాడు బ్రిటీష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించింది, కింగ్డ్ ఎడ్వర్డ్ VII ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారత దేశం లోని ఇతర అతిథులతో కలిసి ఆహ్వానించారు. ఆమెని ఎంతో  గౌరవంతో ఢిల్లీకి తీసుకు రావాలని మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సీతమ్మ మాత్రం అక్కడకి వెళ్ళలేదు. మర్యాదగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ప్రచారం కోసం  సేవలను అందించడం లేదని. మద్రాస్ ప్రధాన కార్యదర్శి బదులుగా కింగ్ ఎడ్వర్డ్ ఆమె యొక్క ఫోటోను ఇచ్చారు, ఆ వేడుకలో ఆమె కూర్చునే కుర్చీపై ఉంచడానికి అతను విస్తరించాడు.    
 
అమృతమూర్తి సీతమ్మ: 
 
డొక్కా సీతమ్మగారు పేరు తలవగానే ఆంధ్రుల గౌరవ మర్యాదలు ప్రపంచ దేశాలకి  ఏ విధంగా తెలిసాయో మనకి అర్థం అవుతుంది.సమయం ఏదైనా కానీ కడుపు నింపిన మహా సాధ్వి. ఈమె చేసిన సేవలు, ఈమె గొప్పతనం నేటి తరం తెలుసుకునే బాధ్యత ఎంతైనా వుంది. రాజుకి అయినా పేదకి అయినా ఆకలి ఒకటే కదా...! నేటి కాలంలో సహాయం చెయ్యమంటే పారిపోయే జనం మాత్రమే ఉన్నారు. అవసరానికి పలకరిస్తూ.... అవసరం తీరాక పారిపోవడమే తెలుసు. కానీ ఏ లాభానికి ఆశ పడకుండా...  ఏ  బాషా బేధం లేకుండా కుల మతం అనే బేధం లేకుండా అమ్మై ఆకలి తీర్చేది.  
 
ఆమె చేసిన సేవ చిరస్మరణీయం. ఉభయ గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో నిండుగా అభిమానం పొంగించిన గోదారమ్మ ఈమె. అతివృష్టి ,అనావృష్టి బాధల్లో కోరుకునే  ప్రజలకి కడుపు నింపిన కన్న తల్లి లాంటి హృదయం ఉన్న అమ్మ. డొక్కా సీతమ్మ నిరు పేదల పాలిట దైవంగా మారింది. అందుకే ఎడ్వార్డ్ చక్రవర్తి ఆమె చిత్రపటానికి ప్రణమిల్లి పట్టాభిషేకం చేసారు. '' డొక్కా సీతమ్మ అతిధి దేవోభవ అన్న సూక్తిని ఇంటి పేరుగా నిలుపుకున్న మహాతల్లి.''