సమయం దొరికినప్పుడు ఏదో ఒక స్వీట్ ని తయారు చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్స్ ఇష్టపడని వారు ఉండరు. పిల్లలు, పెద్దలు కూడా వీటిని సహజంగా తింటూ ఉంటారు. అయితే ఎలాంటి స్వీట్స్ వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది. ఈ విషయం లోకి వస్తే చాలా స్వీట్స్ ఉన్నాయి. కానీ మరీ ముఖ్యంగా చేసుకోవాల్సినవి, మన పూర్వీకుల నాటి నుండి సులువుగా తరచు చేసుకునేవి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.
సున్నుండలు:
మినుములలో పోషకాలు అధికంగా ఉంటాయి. అటువంటి అత్యంత పోషకాలని కలిగే మినుములు మరియు గోధుమలతో తయారు చేస్తారు. ఆరోగ్యానికి ఈ మిఠాయిలు చాలా మంచిది. అలానే ఇవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ సున్నుండలు ఎక్కువగా కోస్తా ప్రాంతాల్లో తయారు చేస్తారు. సంక్రాంతికి ఆంధ్ర ప్రాంతాల్లో అందరూ చేసుకుంటారు.
మినుములు, గోధుములు, బెల్లం, నెయ్యి ఇలా ఈ నాలుగు పదార్ధాలతో దీనిని తయారు చేస్తారు. నెయ్యి, బెల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐరన్ బెల్లం లో పుష్కలంగా ఉంటుంది. ఇలా ఇంత మంచి ఆరోగ్యకరమైన పదార్ధాలతో ఈ మిఠాయిలని చేస్తే ఎంత ఆరోగ్యమో చూసారా...!
సున్నుండలు ఇలా చేస్తేనే రుచిగా ఉంటాయి:
సహజంగా అందరికీ ఈ మిఠాయిలు కుదరవు. కానీ ఇలా చేస్తే ఎవరైనా మహా రుచిగా చెయ్యవచ్చు. ముందు మినుములు, గోధుమలు శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని పిండి ఆడించుకోవాలి. ఇది అయ్యాక బెల్లం పొడిని కలిపి పక్కన ఉంచాలి. ఇందులో మంచి నెయ్యిని వేసి కలపాలి. ఇలా వేడి చేస్తూ కలిపి బాగా వేడి అయ్యాక దీనిని గుండ్రంగా ఉండలు లడ్డు మాదిరి చేసుకోవాలి. అంతే సున్నుండలు తయారీ అయిపోయింది. ఒక డబ్బాలో దీనిని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు పాటు నిల్వ ఉంటాయి.
అరిసెలు:
అరిసెలు కేవలం మన ఆంధ్ర లో మాత్రమే కాకుండా ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా విరివిగా చేసుకుంటారు. ముఖ్యంగా దీనిని సంక్రాతి, దసరా, దీపావళి పండుగల నాడు చేస్తూ ఉంటారు. బెల్లంతో దీనిని చెయ్యడం వల్ల మరెంత ఆరోగ్యం.
బియ్యం పిండి, బెల్లం, నెయ్యి/నూనె తో ఈ అరిసెలని తయారు చేస్తారు. పురాతన కాలం నుండి కూడా ఈ అరిసెలని తయారు చేసుకోవడం జరుగుతోంది. అరిసెలు కూడా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. కనుక వీలున్నప్పుడు చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు తినొచ్చు. తియ్యగా ఉంటాయి కనుక పిల్లలు కూడా ఇష్ట పడతారు.
అరిసెలని చేసే విధానం:
అరిసెలని చెయ్యడం పెద్ద గగనం ఏమి కాదు. ముందుగా ఫ్రెష్ గా ఉండే బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తరువాత బెల్లంని పాకం పట్టాలి. యాలుకల పొడిని ఈ పాకం లో కలపాలి. ఆ తరువాత కమ్మని టేస్ట్ కోసం నువ్వులు అలానే నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఆ పిండిని చపాతీలా చేత్తో ఒత్తుకుని వేయించాలి. ఇలా చేస్తే చాలు ఎంతో రుచిగా వస్తాయి అరిసెలు. అలానే ఇవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఆరోగ్యం కూడా.
రవ్వలడ్డు:
ఈ స్వీట్ ని చెయ్యడం చాలా సులభం. డ్రై ఫ్రూట్స్, యాలుకల పొడి, పాలు, రవ్వ తో దీనిని చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఏమైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఎంతో క్విక్ గా దీనిని చేసేసుకోవచ్చు. స్మూత్ గా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. రవ్వలడ్డు రుచి తో పాటు ఆరోగ్యం కూడా. మంచి కమ్మటి సువాసనతో ఎంతో క్రిస్పీగా ఉంటుంది. పండుగలప్పుడు మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ఇలా ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
ఈ లడ్డులని ఒక ఐదు నుండి ఆరు నిమిషాలలో చేసేయచ్చు. ఇవి బేసన్ లడ్డులా ఉండవు. దీనిని పాలతో చెయ్యడం వల్ల కమ్మగా రుచి ఉంటుంది. అలానే ఈ లడ్డులని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకుని తిన్నా పాడవ్వవు.
రవ్వలడ్డులని చేసుకునే విధానం:
ముందుగా రవ్వని తీసుకుని బాగా వేయించాలి. ఇలా దీనిని మీడియం మంట మీద రోస్ట్ చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించండి. ఆ తర్వాత చల్లారనివ్వండి. ఈలోగా పంచదారని పొడి చేసుకోండి. ఈ పొడితో పాటు కొన్ని యాలుకల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో రవ్వ, కొబ్బరి పొడి కూడా కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయిన రుచి బాగోదు కొంచెం పెలుసుగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నట్స్ వేసుకుని కలుపుకోండి. చివరగా పాలు పోసి కలిపి లడ్డుల్లా చుట్టుకోండి. ఇలా చేస్తే చాలు రవ్వ లడ్డు రెడీ.
చూసారు కదా....! ఎంతో సులువుగా ఈ స్వీట్స్ ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి సమయం దొరికితే ఇలా చేసేయండి. కేవలం టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అద్భుతంగానే ఉంటుంది.