BREAKING NEWS

గుండె సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇలా అనుసరించాల్సిందే.....

నేటి కాలంలో గుండె సమస్యలు తరచుగా రావడం చూస్తున్నాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే ఈ సమస్యలు కామన్ గా మారిపోయాయి. అయితే ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారా....?  ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి ఆరోగ్యం గురించి పాటించాల్సిన  ఎన్నో విషయాలు తెలుసుకోండి...
 
రోజూ మన శరీరంలో చేసే ఎన్నో పనుల్లో గుండె యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే పూర్తి ఆరోగ్యం బాగుండాలంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. గుండె ఆరోగ్యాన్ని చాలా సింపుల్ గా మనం పదిలంగా కాపాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహారం మరియు వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఆరోగ్య విషయంలో మేము బాగున్నాము, మంచి ఆహారం తీసుకుంటున్నాము అని ఎంతో మంది అనుకోవచ్చు. కానీ మనకి తెలియకుండా ఎన్నో కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. అయితే మనం మన గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం తినాలో ఏం తినకూడదో  చూసుకోవాలి. మరి మీరు కూడ ఒక లుక్ వేసేయండి.
 
మనం తీసుకునే ఆహారం మన బరువుని, హార్మోన్లని, ఆర్గాన్స్ యొక్క హెల్త్‌ని, ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది.
 
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
 

ఆహారం తీసుకునేటప్పుడు హెల్తీ ఫ్యాట్స్ ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. వంట కోసం వాడేటప్పుడు మోనో అన్ సాచ్యురేటెడ్స్ ని వాడండి. ఇది మనకి వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి వాటిలో దొరుకుతుంది. అదే సన్ ఫ్లవర్ ఆయిల్  లో పాలీ అన్ సాచ్యురేటెడ్ ఉంటాయి. ఇవి కూడా మంచివే. ఇవిలా ఉండగా అవకాడో ఆయిల్  కూడా మంచిదే. పాలీ అన్ సాచ్యురేటెడ్, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా మంచివే.
 
నట్స్ వంటి వాటిని కూడా ఆహారంలో తరచూ తీసుకోండి. సాల్మన్ వంటి చేపల్లో కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వాటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి మీరు ట్రాన్స్ ఫ్యాట్స్ ని కనుక వదిలేస్తే ఇంకేమీ అవసరం లేదు. అవి  ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా హోల్ వీట్ ఫుడ్ ను తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్ కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి దానితో పాటు మంచి రుచిని కూడా చేరుస్తాయి.
 
ఇలా వండితే మరెంత ఆరోగ్యం మీ సొంతం: 
 
ఎప్పుడూ కూడా డీప్ ఫ్రై చేయడం కంటే హెల్తీ పద్ధతుల్లో వంట చేయడం చాలా మంచిది. ఎక్కువ మంట మీద ఉడికించడం, ఆకుకూరలు కుక్కర్లో ఉడికించి వంటి వాటి వల్ల పోషకాలు తగ్గి పోతాయి. కాబట్టి వంట చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.  అలానే పప్పులు తినడం మాత్రం మర్చిపోకండి. వీటిలో ప్రొటీన్లు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. శాఖాహారులకి ఇది మంచి ఆప్షన్. అలానే లో ఫ్యాట్ పాల పదార్థాలని వాడండి.
 
గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇవి చెయ్యొద్దు: 
 
ఎక్కువగా  సోడియం ఫుడ్స్ ని తీసుకోకండి. ఫుడ్స్ ని నో-సాల్ట్ సీజనింగ్ తో ఫ్లేవర్ చేయండి. అప్పుడు అది ఆరోగ్యానికి కూడా మంచిది. అంతే కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, సాసెస్, కాన్‌డ్ ఫుడ్స్ తినొద్దు. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని మాత్రం వీలైనంత వరకు డైట్ లో తీసుకోవద్దు. ఫ్యాటీ మీట్స్, పౌల్ట్రీ స్కిన్, హోల్ మిల్క్ డైరీ, బటర్, కోకోనట్ ఆయిల్, పాం ఆయిల్స్ ఏ మాత్రం వాడొద్దు. అలానే  ఫ్రోజెన్ పీజా, మైక్రోవేవ్ పాప్ కార్న్  తీసుకోవద్దు. సోడాస్, స్వీటెన్‌డ్ కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, కేక్స్, పై, ఐస్ క్రీం, క్యాండీ, సిరప్స్, జెల్లీస్ కూడా తీసుకోవడం మంచిది కాదు. 
 
గుండె ఆరోగ్యాన్ని పెంచే ఎక్సర్‌సైజ్:
 

రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే గుండె బలంగా తయారు అవుతుంది. ప్రతి హార్ట్ బీట్ లోనూ ఎక్కువ బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఇందు వల్ల ఎక్కువ ఆక్సిజెన్ అందుతుంది. కాబట్టి క్రమం తప్పకుండ వ్యాయామం చెయ్యండి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వలన డీప్ బ్రెత్ తీసుకుంటారు కాబట్టి ఎంతో మంచిది. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి  ఏరోబిక్ ఎక్సర్సైజులనైనా చెయ్యొచ్చు.
 
లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం,  కాఫీ బ్రేక్, లంచ్ బ్రేక్ లో నడవండి, బ్రిస్క్ వాక్ చేయడం లేదా ఇంటి పనులు ఏమైనా చెయ్యడం, గార్డెనింగ్ లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం చేస్తే కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.