BREAKING NEWS

గ్రాండ్ స్లామ్ కొట్టిన బ్రిటన్ చిన్నది: ఎమ్మా రదుకాను

చిన్న వయసులోనే టెన్నిస్ పైన మక్కువ పెంచుకుంది.  ఆటపై ఆసక్తితో చివరి మ్యాచ్ వరకు ఆడి, విజేతగా నిలిచింది. కాలికి గాయమైనా పట్టు వదలకుండా, వేగంతో ప్రత్యర్థిని పరుగులు పెట్టించి, ఓడించింది. అతి చిన్న వయసులో గొప్ప విజయాన్ని, బహుమతిని, అరుదైన ఖ్యాతిని అందుకుంది. ఎంతోమంది అమ్మాయిలకు అభిమాన క్రీడాకారిణి అయ్యింది. అందరికి స్ఫూర్తినిచ్చింది. ఆ దేశానికే పేరు తెచ్చింది. అనుభవం తక్కువున్న కానీ వరుస సెట్లలో ఆడి గెలిచి రికార్డుకెక్కింది ఎమ్మా రదుకాను.. అటువంటి ఆమె ఆట, జీవిత విశేషాల గురుంచి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
బాల్యం...

ఎమ్మా అసలు పేరు ఎమ్మా రదుకాను.  కెనడాలోని టొరంటోలో 2002 నవంబర్ 13న జన్మించింది. ఈమె ఒక బ్రిటిష్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. తండ్రి ఇయాన్ రొమేనియన్, తల్లి రెనీ రదుకాను. వీరు చైనీయులు. ఇద్దరు ఫైనాన్స్ విభాగంలో పని చేస్తున్నారు.
ఎమ్మా లండన్ బరో ఆఫ్ బ్రోమ్లీలోని సెలెక్టివ్ గ్రామర్ స్కూల్ అయిన న్యూస్‌స్టెడ్ వుడ్ స్కూల్లో చదివింది.
 
ఆట ప్రారంభం...

ఎమ్మాకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆమె కుటుంబం ఇంగ్లండ్ కి వెళ్లి, స్థిరపడింది. ఐదేళ్లు ఉన్నపుడు తనకు టెన్నిస్ పైన ఆసక్తి ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించి దాంట్లో శిక్షణ ఇప్పించారు. వీటితోపాటు చిన్నప్పుడు గోల్ఫ్, కార్టింగ్, మోటోక్రాస్, ట్యాప్ డ్యాన్స్,  బ్యాలెట్‌తో సహా వివిధ క్రీడలు, పలు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేది. జూనియర్ స్థాయిలో మూడు టైటిల్స్ గెలిచిన రదుకాను ఈ మధ్యే డబ్ల్యూటీఏ మ్యాచులు ఆడటం ప్రారంభించింది.

ఈ జూన్ లో నాటింగ్ హామ్ లో జరిగిన గ్రాస్ట్ కోర్ట్ టెన్నిస్ టోర్నీతో ఎమ్మా ప్రొఫెషనల్ టెన్నిస్ మొదలయ్యింది. తర్వాతి నెలలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వింబుల్డెన్ మెయిన్ 'డ్రా' లో ఆడింది. మూడు రౌండ్లు గెలిచిన రదుకాను ప్రిక్వార్టర్స్ లో శ్వాస సంబంధ సమస్యతో మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగింది. ఆమె కొలుకున్నాక అమెరికాలోని చికాగోలో డబ్ల్యూటీఏ ఈవెంట్ లో రన్నరప్ గా ఆడి, గెలిచింది.

తర్వాత యూఎస్ ఓపెన్ లో ఆడుతూ మెయిన్ డ్రాకు చేరింది. ప్రతి మ్యాచ్ ను వరుస సెట్లలోనే ముగించింది. ఆ క్రమంలో ప్రపంచ 11వ ర్యాంకర్, టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ అయిన బెలిండా బెన్ విచ్ (స్విట్జర్లాండ్)ను క్వార్టర్స్ లో ఓడించింది. సెమీస్ లో టాప్ ఫామ్ లో ఉన్న మరియా సాకరి(గ్రీస్)18వ ర్యాంకర్ అయిన ఈమెతో ఆడి, గెలిచి టైటిల్ బరిలో నిలిచింది.

●1999 తర్వాత ఇద్దరు టీనేజర్ల మధ్య సాగిన తొలి గ్రాండ్ స్లామ్ తుదిపోరు అభిమానులను అలరించింది. 

●1977లో వర్జీనియా వేడ్ సొంతగడ్డపైన వింబుల్డెన్ గెలిచింది. 44 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ ఇప్పుడు గ్రాండ్ స్లామ్ ట్రోఫీ గెలిచిన తొలి బ్రిటిష్ అమ్మాయిగా రదుకాను రికార్డు సృష్టించింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ లో 150వ స్థానం నుంచి టైటిల్ గెలిచి నేరుగా 24వ స్థానానికి చేరింది.

●అన్ సీడెడ్ హోదాలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 13వ ప్లేయర్ గా ఎమ్మా రదుకాను నిలిచింది. 

●ఓపెన్ శకంలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్ గా నిలదొక్కుకున్న  11వ క్రీడాకారిణి ఎమ్మా.

●2004లో 17 ఏళ్ల వయసులో షరపోవా వింబుల్డెన్ టైటిల్ గెలవగా, 18 ఏళ్ల ఈమె గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలుగా ఎమ్మా ఘనత సాధించింది.

●2014(సెరెనా) తర్వాత ఒక్క సెట్ కూడా కోల్పోకుండా యూఎస్ ఓపెన్, అలాగే క్వాలిఫైయర్ గా అడుగుపెట్టి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలిచిన రదుకాను చరిత్రే సృష్టించింది.

●అతి తక్కువ గ్రాండ్ స్లామ్ అనుభవంతో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ లో ఈమె నాలుగవ రౌండ్ వరకు వెళ్లగలిగింది. తనకు ఇదే తొలి యుఎస్ ఓపెన్.

●రదుకాను ట్రోఫీతో పాటు దాదాపు 18.38 కోట్ల (2.5 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతి సొంతం చేసుకుంది. రన్నరప్ ఫెర్నాండెజ్ కు సుమారు 9.19కోట్లు అందుకుంది.

●నువ్వా నేనా అంటూ పోటాపోటీ ఇస్తున్నా గేమ్ లో 5-3తో మ్యాచ్ పాయింట్ పై ఆడుతున్న సమయంలో కోర్టులో జారిపడి ఎమ్మా ఎడమ మోకాలికి రక్తస్రావమయ్యింది. కానీ గాయమయిన గంటకు 108 మీటర్ల వేగంతో ఆటను ఆడింది.

●23వేల మందితో కిక్కిరిసిన ఆర్దర్ యాష్ స్టేడియం ఫైనల్ జరుగుతున్నంతసేపూ అక్కడి మైదానం మొత్తం అభిమానుల చప్పట్లతో  దద్దరిల్లింది.

●"ఓ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఈ స్థాయిలో ఫాన్స్ ఇంతలా స్పందించడం నేనెప్పుడూ చూడలేదు" అని మాజీ ప్లేయర్ మాట్స్ విలాండర్ అన్నాడు.

●'బ్రిటన్ స్పోర్టింగ్ క్వీన్' అంటూ ఆ దేశ మీడియా కీర్తించింది.

●'పిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకున్నావు' బ్రిటిష్ రాణి ఎలిజబెత్ తన సందేశంలో ప్రశంసిస్తూ ఎమ్మాకు లేఖ రాశారు.