BREAKING NEWS

తరగతులకు తెర పడింది

అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఏ పదవుల్లో ఎవరెవరున్నారు మొదలు అప్గాన్ మహిళల హక్కుల్ని ఒక్కొక్కటిగా కాలరాస్తూ తీసుకొచ్చిన నిర్ణయాలు, ఇతర పర్యవసానాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
◆పంజ్ షేర్ లో 4 గంటలకు పైగా జరిగిన యుద్ధపోరులో అమెరికా ఆయుధాలతో వెళ్లిన తాలిబన్లకు, రెసిస్టెన్స్ దళాల మధ్య జరిగిన దాడి(కాల్పులలో)లో 700ల మంది తాలిబన్లు మృతి చెందినట్లు 'నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్థాన్' వర్గాల ద్వారా తెలిసింది. 1000మంది వరకు దొరికిపోయారు. వీరిలో కొంతమందిని రెసిస్టెన్స్ దళాలు అదుపులోకి తీసుకోగా, మరికొంతమంది తమకు తాముగా వీళ్లకు లొంగిపోయారని తెలిసింది. 

◆చైనా అఫ్గాన్ కు సాయం చేయడం వెనుక అక్కడ ఎక్కువగా బంగారం, రాగి, ఇనుము, యురేనియం, లిథియం, కోబాల్ట్, మెర్క్యూరీ, గ్యాస్ నిల్వలు ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఇందుకు చైనా భారీ పెట్టుబడులను పెట్టింది. అంతేకాదు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు రవాణా సౌకర్యం కోసం కాబుల్- పెషావర్ మధ్య హైవే ను కట్టడమే ఇప్పుడు చైనా ప్రధాన లక్ష్యం.

◆అమెరికా చివరిరోజు వరకు కాబుల్ నుంచి దాదాపు 1,22,300 మంది అఫ్గానీలను సురక్షితంగా బయటికి తీసుకెళ్లామని యుఎస్ఎ సెంట్రల్ కమాండ్ చీఫ్ మెరీన్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ తెలిపారు.

◆యుఎస్ఎ సైనికులు అఫ్గాన్ ను నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే కాందహార్లో తాలిబన్లు వాళ్ల సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ కు ఒక మృతదేహాన్ని తాడుతో కట్టి వేలాడదీసి గాలిలో చక్కర్లు కొట్టించిన దృశ్యాలను చూస్తే తాలిబన్ల పాలన తర్వాతి రోజుల్లో ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

◆ఇప్పుడు అఫ్గాన్ లో ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదివే ఆడవాళ్లకు బూర్ఖ, నిఖాబ్ తప్పక ధరించాలని తాలిబన్లు ఆదేశించారు. విద్యార్థిని, విద్యార్థులకు విడిగా ఒక తరగతి గది ఉండాలని నిర్ణయించింది. ఒకవేళ కుదరకపోతే కనీసం వారి మధ్య పరదాలను(కర్టెన్) వేయాలని ఆదేశాలు జారీ చేశారు.  

◆తాలిబన్ల పాలనలో ఒకప్పుడు మహిళలు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. 

◆అమ్మాయిలకు పురుషులు విద్యాబోధన చేయరాదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వయసులో పెద్దవారైన పురుష టీచర్లు వారికి బోధించాలని తెలిపారు. తరగతులు పూర్తయ్యాక ఒకేసారి అందరూ బయటకు వెళ్తే మాట్లాడుకునే వీలుంటుందనీ, అబ్బాయిలు పూర్తిగా వెళ్లిన తర్వాతనే అమ్మాయిలను పంపించాలని ఆంక్షలు విధించారు.

◆ టీవీ/రేడియో ఛానళ్లలో మహిళలు పాటలు పాడటానికి, మాట్లాడటానికి వీల్లేకపోవడంలాంటి ఆంక్షలను ఆడవాళ్లపైన తాలిబన్లు బలవంతంగా రుద్దుతూ వాళ్ల హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు.

◆ఆడవాళ్లను శవపేటికలో బంధించి ఇతర దేశాలకు తరలిస్తున్నారని, లైంగిక బానిసలుగా మారుస్తున్నారని తెలిపారు. ఆహారం సరిగ్గా వండలేదని ఓ మహిళను అత్యంత పాశవికంగా నిప్పంటించి చంపేశారు.

◆అఫ్గాన్ సర్కారు ఏర్పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ పాలనకు రూపమివ్వడానికి ఆలస్యం అవుతుందని సంప్రదింపుల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ చెప్పారు.

◆తాలిబన్లకు నేను లొంగిపోయే ప్రసక్తే లేదని, ఒకవేళ వారితో పోరాటంలో గాయపడితే తలలో రెండుసార్లు కాల్పులు జరపాల్సిందిగా ఓ సైన్యాధికారికి చెప్పినట్లు అమ్రుల్లా సలేహ్ తెలిపారు.

◆కాబుల్ జైల్లో తాలిబన్ ఖైదీలు తిరుగుబాటుకు ప్రయత్నిస్తే మట్టుపెట్టాలని చెప్పిన విషయం గురుంచి పైఅధికారులకు తెలియజేసినా ఎవరు స్పంచిందలేదు. 
"ఇంటికి వెళ్లి, నా భార్య, బిడ్డల ఫోటోలు ఎవరికి కనిపించకుండా దాచేశాను. పంజ్ షేర్ కు వెళ్లే దారిలో తాలిబన్లపై కలిసికట్టుగా పోరాడదామని ఓ సైన్యాధికారితో అన్నాను" అని సలేహ్ వివరించారు.

◆"ప్రావిన్సులో దాదాపు 2.5 లక్షల మంది ఆహారం లేక విలవిల్లాడితున్నారని, అలాగే సురక్షితంగా ఉండాలంటే తాలిబన్లతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించేలా వాళ్ళతో చర్చలు జరపాలని" ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో సలేహ్ పేర్కొన్నారు.

◆అంతకుముందే అఫ్గానిస్థాన్ లోని మత పెద్దలు, తాలిబన్లు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కానీ దీనికి తాలిబన్లు వెంటనే స్పందించలేదు. తాజాగా పాకిస్థాన్ తన డ్రోన్లను పంజ్ షేర్ కు పంపించి, అక్కడి దళాలపై దాడి చేయడానికి వినియోగించినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు పంజ్ షేర్ లోయను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ దళాలు ప్రకటించాయి.

◆అఫ్గాన్ పరిణామాలపై ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తంగా ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
ఇరాన్ దేశంలాగే ఇస్లామిక్ పాలనను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా తాలిబన్ల రాజకీయ చీఫ్ అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ఖరారయ్యింది. సుప్రీం లీడర్ గా హైబతుల్లా అఖుంద్ జాదా ఉంటారు. ఆయన సర్వసైనికాధ్యక్షుడిగా ఉంటూనే మతపరమైన కార్యకలాపాలు, న్యాయవ్యవస్థ, దేశీయ మీడియా వ్యవహారాల్ని పర్యవేక్షించబోతున్నారు.

◆తాలిబన్ రాజకీయ విభాగం తరపున కతార్ వేదికగా భారత్ తో సహా మిగతా దేశాలతో చర్చలు జరుపుతున్న షేక్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్ జాయ్ ను విదేశాంగమంత్రిగా నియమించినట్లు, తాలిబన్లలో బాంబులు తయారీ నిపుణుడిగా పేరున్న సదర్ ఇబ్రహీంను హోంశాఖ మంత్రిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా అమర్ తనయుడు ముల్లా మహమ్మద్ యాకుబ్ కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు.
25మంది మంత్రులతో భేటి కానుండగా అందులో 12మంది ఇస్లామిక్ స్కాలర్లు ఉన్నారు.

ఇతరాంశాలు...

◆కశ్మీర్ లో ఉగ్రవాదులను నియమిస్తున్నాడని1990లో మసూద్ అజార్ ను అరెస్ట్ చేశారు. కానీ1999లో టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేసి వాళ్ల షరతు మేరకు అతన్ని విడిపించారు. ఇప్పుడు అఫ్గాన్ లో తాలిబన్ల చేతికి అధికారం వచ్చాక వాళ్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

●పాకిస్థాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాలో ఉన్న ప్రాంతాన్ని ఒకప్పుడు ఖొరాసన్ గా పిలిచేవారు. 2015 జనవరిలో ఈ ఐఎస్-కె ఏర్పడింది. పూర్తి పేరు 'ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్సు'. ఇది ప్రపంచంలోనే నాలుగు ప్రమాదకర ఉగ్రవాదుల ముఠాలో ఒకటిగా మారింది.

●ప్రావిన్సులోని ఈటీఐఎం (తూర్పు టర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం)తో తాలిబన్లు కలిసి అమెరికా సైన్యంతో పోరాడారు.

● అంతకుముందు అఫ్గాన్లో ఐఎస్-కె తాలిబన్లపై దాడి చేపట్టిన విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గుర్తు చేస్తారు. కానీ అఫ్గాన్ లో అమెరికా యుద్ధం కోసం రోజుకు ఏకంగా 30 కోట్ల డాలర్లలను ఖర్చు చేసినా లాభం లేకుండా పోయింది. 

●బ్రిటన్ అధికారులు వాళ్ల దేశ ప్రజలను వెనక్కి తీసుకురావడానికి అక్కడి కొందరి అఫ్గానీలతో కతర్ రాజధాని దోహాలో ఇరువురు చర్చలు జరుపుతున్నారు.
రాబోయే పరిణామాలు ఇంకేలా ఉంటాయో వేచి చూడాల్సిందే!
 

Photo Gallery