BREAKING NEWS

కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు ఇకలేరు...

శోభానాయుడు ప్రసిద్ధి చెందిన  నాట్య కళాకారిణి లో ఒకరు.  ఈమె అనేక నృత్య ప్రదర్శనలు చేశారు. ఈమె మన ఆంధ్రప్రదేశ్లో జన్మించడం నిజంగా మన అదృష్టం. ఈమె వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి లో 1956 వ సంవత్సరంలో జన్మించారు. గొప్ప కూచిపూడి నాట్య కళాకారిణిగా మంచి పేరు ప్రతిష్టలు పొందారు. చెప్పాలంటే ఈమె కోసం చాలా చెప్పాలి. ఈమె నాట్యం, అభినయం చూసిన వాళ్ళు ఎవరైనా ముగ్ధులు అవ్వాల్సిందే. ఆమె చేసే నృత్యం చూస్తే కళ్ళు తిప్పుకోలేరు. ఆమెకి నాట్యం మీద ఉన్న ఇష్టంతోనే ఇంత స్థాయికి చేరుకోగలిగారు. మరి అటువంటి గొప్ప కళాకారిణి గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా...?  ఇక ఆలస్యం ఎందుకు శోభా నాయుడు గురించి పూర్తిగా చూసేయండి.
 
శోభ నాయుడి నృత్య జీవితం :
 
శోభ నాయుడు గొప్ప కళాకారిణిగా మారడానికి ముఖ్యమైన కారణం వెంపటి చిన్న సత్యం గారు. శోభానాయుడు వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు. ఆయన నృత్య రూపాలలో ఈమె ఎన్నో  ప్రధాన పాత్రలు పోషించారు. ఈమెకు చిన్నతనం నుంచి నృత్యం మీద ఇష్టంతోనే అనేక నాటకాల్లో నృత్య పాత్రలు పోషించడం జరిగింది. సత్యభామ, పద్మావతి, చండాలిక వంటి ఎన్నో పాత్రల్లో ఈమె రాణించింది. ఇలా శోభానాయుడు మంచి ప్రదర్శనతో  ఎందరినో ఆకట్టుకున్నారు. శోభ నాయుడు స్వచ్ఛమైన నృత్య రీతి అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యమే వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి ఈమె. 
 
శోభనాయుడికి పద్మశ్రీ: 
 
శోభ నాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇది నిజంగా తెలుగువాళ్లు గర్వించదగ్గ విషయం. హైదరాబాద్లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ గా పని చేస్తూ అనేక మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. శోభానాయుడు ఆమె దగ్గర నేర్చుకున్న పలు శిష్యులకి కూడా రాష్ట్ర, జాతీయ పురస్కారాలు దక్కాయి. ఇలా ఆమె కేవలం నృత్యం చేసి గెలవడమే కాకుండా తన శిష్యులను కూడా మంచి వజ్రాలుగా మారుస్తున్నారు.  ఇలా తాను చిన్నప్పటి నుంచి  కూడా నాట్యం మీద ఇష్టంతోనే తన జీవితాన్ని సాగిస్తున్నారు.
 
శోభానాయుడు అందుకున్న అవార్డులు :
 
ఈమె ఎన్నో అవార్డులు పొందారు. మొట్టమొదట 1982వ సంవత్సరంలో మద్రాసు లోని కృష్ణ గాన సభ వారి నుంచి చూడామణి  అనే అవార్డును పొందారు. అలానే 1990 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా ఈమె దక్కించుకున్నారు. 1998వ సంవత్సరం ఎన్టీఆర్ పురస్కారాన్ని శోభానాయుడు పొందారు. అంతే కాదండి 2001వ సంవత్సరంలో పద్మ శ్రీ పురస్కారం శోభానాయుడు దక్కించుకున్నారు. పద్మశ్రీ పొందారు అంటే ఈమెకి ఉన్న కళ దానికి పడ్డ కృషి ఎంతో మనం ఊహించవచ్చు. అలానే 2011వ సంవత్సరంలో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు కూడా ఈమె పొందారు. 
  
శోభానాయడు  జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు:
 
చెన్నై వెళ్లకముందు శోభ నాయడు కొంతమంది గురువులు దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. ఈమెని అరంగేట్రం చేయిస్తే ఇక అయిపోతుందని శోభా నాయుడు తండ్రి భావన. ఇక చెన్నై వెళ్లడానికి రెడీ అయిపోయారు శోభానాయడు కుటుంబమంతా. కానీ గురువు గారి దగ్గర నుంచి ఎటువంటి కబురు లేకపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. కానీ కొంత కాలం తర్వాత గురువుగారు ఇంటికి వచ్చేసరికి శోభ నాయుడు తండ్రి అడిగారట అరంగేట్రం గురించి .....  దానికి వాళ్ల గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.... మీ అమ్మాయి ఫీచర్స్ కానీ అభినయం కానీ ఆమె నడకలోనే నాట్యం లేదు అని చెప్పారు. అది విన్న శోభానాయుడు తండ్రి ఎంతో బాధ పడ్డారు. ఇదంతా గమనిస్తున్న శోభానాయుడు కూడా ఎంతగానో బాధ పడ్డారట. గురువు గారు ఇలా అనడంతో వీళ్ళు చెన్నై వెళ్లడానికి డిసైడ్ అయ్యారు.
 
గురువు గారు చెప్పింది నిజం కాదని నిరూపించుకోవాలని శోభానాయడు  అనుక్షణం పోరాడేది. ఆమె మొదట్లో కృష్ణ పారిజాతం లో కృష్ణుడు వేషం వేస్తే అమ్మాయిలా ఉందని విమర్శించారు. అలానే ముద్రలు పడడం లేదని ఎన్నో రకాలుగా విమర్శలు వచ్చాయట. కానీ ఎన్నో విమర్శలు దాటుకుని అనేక మంది ప్రశంసలు ఈమె పొందుతూ వచ్చారు.
 
శోభానాయుడుకి తల్లి ప్రోత్సాహం: 
 
నృత్యకారిణిగా మొట్టమొదట గుర్తించింది ఈమె తల్లి. చిన్నతనంలో ఉయ్యాలలో ఉన్నప్పుడే కాళ్లు చేతులు లయబద్దంగా కదిలించేది శోభానాయడు. ఇదంతా చూసిన తల్లి సరోజినీ దేవి శోభా నాయుడుకి నృత్యం నేర్పించాలి అనుకున్నారు. అందుకే శోభానాయడు  నాలుగో ఏటనే డాన్స్ క్లాస్ లో చేర్పించారు. ఆమె తన తొలి ప్రదర్శన ఐదవ ఏటనే ఇచ్చారు. తల్లి సరోజినిదేవి తన కూతుర్ని ఎప్పటికైనా నృత్యకారిణిని చేయాలని అనుకుని శిక్షణ కోసం చెన్నై తీసుకువెళ్లారు. కుటుంబంలో ఎవరు  ఒప్పుకోకపోయినా ఈమె మాత్రం ఎదురించి లోపించి ఆమెకి మంచి భవిష్యత్తు ఇచ్చారు.
 
శోభ నాయుడు కి తీవ్ర అస్వస్థత:
 
ప్రముఖ డాన్సర్ శోభ నాయుడు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అంతే కాదు నెల రోజుల క్రితం ఇంట్లో జారీ పడిపోవడంతో ఆమె తలకు స్వల్ప గాయాలు అయిన సంగతి కూడా తెలిసిందే. దీని కారణంగానే ఆమెని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆర్తో న్యూరాలజీ సమస్యతో ఈమె బాధ పడుతున్నారన్నది  కూడా మనం చూశాం. ఇలా ఈ క్రమంలో ఆమెకు కరోనా కూడా సోకింది. అందుకనే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై  ఆమెకు  ట్రీట్మెంట్ అందించారు. ఈ విషయాలన్నీ కూడా శోభానాయుడు భర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అర్జున్ రావు చెప్పారు. ఇలా కరోనా తో పోరాడుతూ చివరికి ఆమె తుది శ్వాస విడిచారు.