BREAKING NEWS

కుదిరితే ఒక కప్పు కాఫీ...

కాఫీ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. రోజు మొదలు అవ్వాలంటే కచ్చితంగా ఒక కప్పు కాఫీ తోనే ప్రారంభం అవ్వాల్సిందే. ఇలాంటి వాళ్లు ఎంతో మంది ఉంటారు. కాఫీ లో రకాలు ఏమైనా సరే ఆ రుచిని బ్రహ్మాండం అని చెప్పిన తక్కువే. అలానే మన ఇంటికి ఎవరు వచ్చిన కాఫీని ఇచ్చి కుశల ప్రశ్నలని అడుగుతాం. అలానే పెళ్లిళ్లు వగైరా ఫంక్షన్స్ లో కాఫీ ఎంతో ముఖ్యం. ఇలా కాఫీ మనకి ఎంతో దగ్గరగా ఉంటుంది. కాఫీ సమయానికి పడక పోతే ఏమి తోచక కూడా ఎంతో మంది ఉంటూంటారు. అలానే పని చేసుకునే వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ కరెక్ట్ టైం లో కాఫీ పడక పోతే ఒత్తిడి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇలా ప్రతీ ఒక్కరు కాఫీ కి కనెక్ట్ అయిపోయారు. ఇటువంటి కాఫీ గురించి చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా చదివేయండి....
 
అసలు కాఫీ ఎలా వచ్చింది అంటే...?
 
ఇథియోపియా గొర్రెల కాపరులు 9వ శతాబ్దం లో ఇది కనిపెట్టడం జరిగింది.  మేత మేస్తున్న గొర్రెలు ఒక విధమైన మొక్కల  ఉన్న పండ్లు తిని ఉత్సాహం తో గంతులు వేస్తున్నాయి. ఆ  గొర్రెలను తిన్న పండ్లు గమనించి దానిలో ఏదో శక్తి ఉందని గ్రహించడం జరిగింది. అప్పటి నుంచి దానిని ఉపయోగించడం జరిగింది. అప్పుడు ఆ గింజలని కాల్ది అని అనేవారు. ఆ తర్వాత కాలంలో ఇది ఈజిప్ట్, యేమన్ దేశాల్లో  వ్యాప్తి చెందింది. ఇలా కొనసాగుతుంటే 15వ శతాబ్దంలో ఇది మధ్య తూర్పు దేశాలు అయిన ఉత్తర ఆఫ్రికా, పర్షియా, టర్కీలను చేరింది. 1585 వ సంవత్సరంలో లెయాన్ హార్డ్ ర్యూవుల్ఫ్ అనే జర్మన్ డాక్టర్ తన పది సంవత్సరాల తూర్పు దేశం చేసి తిరిగి చేరుకున్న తర్వాత కాఫీని నరాల బాధ నివారణ తీసుకోమని రోగులకు సలహా ఇచ్చారు ఇలా కాఫీ వెలుగులోకి వచ్చింది.
 
కాఫీ పొడి ఎలా వస్తుంది....? 
 
కాఫీ అనేది ఒక ఉత్సాహ పానీయము. కాఫీ చెట్ల పండ్ల నుంచి లభించే గింజలను ఎండ బెట్టి వేయించి పొడి చేసి కాఫీ తయారు చేస్తారు. కాఫీ గింజలుని దాదాపు 70 దేశాలలో పండిస్తారు. ఎక్కువగా కాఫీ పంటను లాటిన్ అమెరికా, దక్షిణ ఈశాన్య ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విస్తారంగా పండించడం జరుగుతుంది. ప్రపంచం లో అత్యధికంగా జరిగే ప్రస్తుత వాణిజ్యాల లో కాఫీ ఒకటి.
 
అధ్యయనాల ప్రకారం కాఫీ వల్ల కలిగే లాభాలు:
 
కాఫీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మరి మీరు కూడా కాఫీ వల్ల కలిగే లాభాలు తెలుసుకోవాలనుకుంటున్నారా .....? కాఫీ లాభాలు గురించి చూస్తే..... కాఫీ తీసుకోవడం ద్వారా అల్జీమర్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని దక్షిణ ఫ్లోరిడా యూనివర్సిటీ అధ్యయనంలో తెలిపింది కాఫీలోని కఫేన్‌లు శరీరంలోని రక్తపు స్థాయిని పెంచుతుందని ఆ అధ్యయనం లో వెల్లడైంది. అలానే కాఫీ గింజల్లో ఉండే కెఫిన్ ద్వారా జ్ఞాపక శక్తికి సంబంధించిన వ్యాధులు కూడా నయమవుతాయని అధ్యయనం ద్వారా తెలియజేయడం జరిగింది. యూఎస్ఎఫ్ న్యూరోసైంటిస్ట్ చవాన్‌హయ్ కో ఏమన్నారంటే.... కఫెనేటెడ్ కాఫీ సాధారణంగా రక్తపు గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని,  రోజు కాఫీ తీసుకోవడం వల్ల ఉత్సాహం, చురుకుదనం కలగడమే కాకుండా గుండెకు కూడా మేలు చేస్తుందని తెలియజేశారు.
 
క్రమం తప్పకుండా కాఫీ తాగితే గుండె క్రమబద్ధంగా పని చేస్తుందని సర్వే ద్వారా తెలిపారు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే పక్షవాతం వంటి వ్యాధులు దరిచేరవని స్వీడన్కు చెందిన పరిశోధకులు అధ్యయనంలో తెలిపారు. అదే కనుక ఇష్టానుసారంగా తాగితే బీపీ వంటి రోగాలు కొని తెచ్చుకున్నట్టే అని చెప్పారు. ఇటీవల చేసిన ఒక అధ్యయనం ద్వారా కాఫీ  వ్యసనం కాదని తెలిసింది. టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధింత వ్యాధులు సమస్యలతో బాధ పడే వారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది.
 
కాఫీ తాగడం వల్ల స్త్రీలకు కలిగే లాభాలు:
 
స్త్రీలు కనుక రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం చెడిపోయే ప్రమాదము, పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు. అలానే కాఫీ సేవించడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 22 నుంచి 25 శాతం ఆడవారిలో తగ్గిందని పరిశోధకులు తెలిపారు. అలానే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆక్సిడేటివ్ ఒత్తిడి కూడా కాఫీ ద్వారా తగ్గుతుందని తేలింది. దాదాపు 35 వేల మంది స్త్రీల మీద పది సంవత్సరాల కాలం పాటు జరిపిన పరిశోధనల ఫలితం ఇదే. ఇలా కాఫీ తాగడం వల్ల ఎంతో ఉపయోగాలు కలుగుతాయి.
 
పగలైనా, రాత్రయినా, ఎండైనా, వానైనా, ఆనందం అయినా లేక బాధైనా కాఫీ తోనే పంచుకునేది.....మనసుని ఉత్తేజం చేస్తుంది కాఫీ......నిజంగా అమృతం దాని రుచి.....