BREAKING NEWS

మన ఆంధ్రాలో ఉండే అందమైన ఈ హిల్ స్టేషన్స్ ని మీరు చూసారా...?

సెలవు రోజుల్లో, కాళీ సమయాల్లో కాస్త రిలీఫ్ గా ఉండాలని ఏదో ఒక ప్రదేశాన్ని మనం సందర్శిస్తాం. అయితే ఎప్పుడు వెళ్లే మామూలు ప్రదేశాలు కంటే కూడా హిల్ స్టేషన్ కి వెళ్లి సరదాగా కుటుంబంతో గడపడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. హిల్ స్టేషన్ కి వెళ్లాలంటే రాష్ట్రం దాటి, దేశం దాటి మాత్రమే వెళ్లక్కర్లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  కూడా మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి..... సరదాగా ఈ చలి కాలంలో కుటుంబం తో పాటు వెళ్లి ఎంతో ఆనందంగా గడపండి....
 
నిజంగా ఎంతో నిశ్శబ్దంగా, ఎత్తయిన కొండలు, ఎటు చూసినా పచ్చదనం ఆ సౌందర్యానికి ఎంతటి వారైనా ముగ్దులు అవ్వాల్సిందే. అయితే ప్రకృతి సౌందర్యం ఉన్న కొద్ది దేశాల లో భారత దేశం ఒకటి అని ఎంతో గర్వాంగా చెప్పుకోవచ్చు. మన భారత దేశంలో ప్రతీ రాష్ట్రం లో కూడా గొప్ప వన్య ప్రాణులు, అరణ్యం అద్భుతమైన ఆకర్షణీయమైన హిల్ స్టేషన్స్  కూడా ఉన్నాయి. ఇటువంటి గొప్ప ఆకర్షణీయమైన హిల్ స్టేషన్స్ ని కలిగి ఉన్న రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. మన ఆంధ్రప్రదేశ్ లో అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. నదులు మరియు అడవులు కూడా ఉన్నాయి. కాబట్టి అంతగా తెలియని హిల్ స్టేషన్లు మరియు వాటి ప్రత్యేక  గురించి ఇప్పుడే క్లుప్తంగా తెలుసుకోండి. ఆ తరువాత కుటుంబం తోనో లేక స్నేహితుల తోనో కలిసి ట్రిప్ వేసేయండి. 
 
నల్లమల్ల కొండ:
 
ఎంతో తక్కువ మంది అరుదుగా వెళ్తారు  ఈ ప్రాంతానికి. కానీ ఒక సారి వెళ్తే వదిలి రావడం ఎంతో కష్టం. ఎందుకంటే అక్కడి వాతావరణమంతా అందంగా, సౌందర్యంగా ఉంటుంది. ఐదు జిల్లాలకు పైగా విస్తరించి ఉన్న నల్లమల కొండలు ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద కొండ. ఇది మన తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో కూడా ప్రబలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని  అతి పెద్ద హిల్ స్టేషన్స్  లో  నల్లమల కొండలు అన్వేషించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3608 అడుగుల ఎత్తులో ఉంది.
 
నల్లమల పర్వతాలు మొత్తం అడవులు, లోయలు, శిఖరాలు మరియు పుణ్యక్షేత్రాల నుండి వ్యవసాయ భూముల వరకు ఉంటుంది. నిజంగా ఒకసారి కనుక ఇంటి నుంచి బయలుదేరి నల్లమల్ల వెళ్తే చూసే కొద్దీ బోలెడన్ని ప్రదేశాలు మీకు కనిపిస్తాయి. అలాగే ఎక్కువ సేపు కూడా అక్కడ ఉండి ఎంతో ఆనందంగా గడపవచ్చు. ఇక్కడ ఏమాత్రము రద్దీ ఉండదు కాబట్టి నెమ్మదిగా అన్నీ చూడవచ్చు. మీరు అంతా కలిసి సరదాగా వెళ్తే ఎన్నో మంచి మూమెంట్స్ ని పొందొచ్చు.
  
చింతపల్లి:
 
విశాఖపట్నం జిల్లాలో ఉన్న చింతపల్లి ప్రకృతికి కేరాఫ్ అడ్రస్. దీన్ని తప్పకుండా సందర్శించాల్సిందే. ఈ ప్రాంతానికి సంవత్సరంలో వేలాది మంది ప్రజలు వచ్చి సరదాగా గడుపుతూ ఉంటారు. నిజంగా ఇది ఎంతో మందికి విశ్రాంతి సమయంలో మంచి అనుభవాలని  ఇస్తుంది. ఇక్కడ వేసవి కాలం లో కూడా ఎంతో చల్లగా ఉంటుంది. కాబట్టి రోజు రోజుకు మంచి ప్రాచుర్యం పొందుతోంది అనే చెప్పాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు  మంచి స్పాట్. ఇక్కడ చూడడానికి ఎన్నో ప్రదేశాలు కూడా ఉన్నాయి. చింతపల్లి కి దగ్గరలోనే కోటపల్లి జలపాతాలు, చింతపల్లి జలపాతాలు మరియు గార్డెన్స్ ఉన్నాయి. వీటిని  సందర్శించవచ్చు కాబట్టి ఒకసారి చింతపల్లి వెళ్తే ఎన్నో అద్భుత ప్రదేశాలను చూసేయొచ్చు.
 
పాడేరు:
 
పాడేరు కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఉంది. ఇది విశాఖపట్నం జిల్లాలోని ముఖ్యమైన హిల్ స్టేషన్లలో ఒకటి. నలు వైపుల అందమైన ప్రకృతి కలిగి ఉంటుంది. ఎన్నో వాస్తవిక ప్రదేశాలకు ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుందరమైన కొండలు, దట్టమైన మైదానాలు ఉండటం కారణంగా ఇది యాత్రికులను బాగా ఆకర్షించింది. ప్రతి ఒక్క యాత్రికుడు కూడా ఈ ప్రదేశాన్ని తప్పక దర్శించాలి. ఈ ప్రదేశాన్ని అద్భుతం అన్నా తక్కువేనేమో..! నిజంగా ఇది మంచి అరుదైన ప్రదేశం
 
పాపికొండలు:
 
పాపికొండలు అందరికీ తెలిసినదే. దీనిని ఇప్పుడు  సురక్షిత ప్రాంతంగా ఉంది. అలానే పాపికొండలని నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు విస్తరించి ఉంది. జాతీయ ఉద్యానవనం కావడంతో ఈ ప్రాంతం వన్య ప్రాణులు మరియు ఆకుపచ్చ వృక్షాలతో నిండి ఉంది. ఎక్కడైనా దట్టమైన అడవులు చెట్లు ప్రకృతి సహజం కానీ వీటన్నిటితో పాటు ఇక్కడ గోదావరి ఉండటమే దీనికి ప్రత్యేకత. అలానే పడవ మీద వస్తూ ఇక్కడ గోదావరి అందించే సంగీతాన్ని వింటూ ఈ ప్రదేశాలని అన్ని చూస్తే ఆహా అనాల్సిందే.
 
అలానే లంబసింగి, అనంతగిరి ఇలా మన ఆంధ్రాలో అనేక హిల్ స్టేషన్స్ ఉన్నాయి. సరదాగా వెళ్లి ఈ ప్రదేశాలలో ఆనందంగా గడపండి....