BREAKING NEWS

బెల్లం తో ఆరోగ్యం పదిలం

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. రోజూ బెల్లం తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లం తో వంటలు రోజు రోజుకీ తగ్గి పోతున్నాయి కానీ పురాతన కాలంలో వాళ్ళని  చూసుకుంటే బెల్లాన్ని తెరచు వంటల్లో ఉపయోగించే వారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగించడం ద్వారా  అనారోగాల బారిన పడకుండా ఉంటాము. కాబట్టి వీలైనంత వరకు పంచదారకు బదులు బెల్లాన్ని ఉపయోగించడం ఎంతో మంచిది. అయితే బెల్లం మనకు ఎలా మేలు చేస్తుంది అని అంటారా.....?  ఇప్పుడే తెలుసుకోండి పూర్తిగా చదవండి. ...
 
బెల్లం తినడం వల్ల ఈ సమస్యలను చిటికె లో పోగొట్టుకోవచ్చు:
 
బెల్లం తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. అలానే బెల్లం శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజం క్రమ బద్ధీకరణ చేస్తుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లం సేవించి ఉన్నట్లయితే పొట్టని చల్లబరచి గ్యాస్ ఉబ్బరం నివారిస్తుంది. గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే వారు ప్రతి రోజు ఇలా తీసుకోవడం ఎంతో మంచిది. 
 
అలానే భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అలాంటప్పుడు బెల్లం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. శీతాకాలంలో నంజు కనుక బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని తినండి. అలానే  బెల్లం నల్ల నువ్వులు తో పాటు లడ్డు చేసుకు తింటే చలి కాలంలో ఆస్తమా ఇబ్బంది మీ దరి చేరదు. చెవి నొప్పి కనుక తగ్గాలంటే బెల్లం నెయ్యి తో కలిపి తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది.
 
బెల్లం హల్వా కనక తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. గొంతు మరియు మాట హాయిగా రావడానికి బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే హాయిగా వస్తాయి. బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. శక్తి కోసం బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే సేవించినట్లు ఎనర్జీ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. అలానే దగ్గు జలుబు రొంప లాంటి వాటికీ కూడా ఉపశమనం కలిగిస్తుంది బెల్లం. బెల్లాన్ని ప్రతీ రోజు ఉపయోగించడం వల్ల మీ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోవు. 
 
ప్రతి రోజు ఎంత మొత్తం లో తీసుకోవాలి.....?
 
బెల్లం సాంప్రదాయ బద్ధమైన ఒక ఆహార పదార్థం. చెరుకు నుండి దీనిని తయారు చేస్తారు.  తయారైన పదార్థం. అనకాపల్లి బెల్లానికి ప్రసిద్ధి.  ఇది ఆసియా తో పటు అమెరికా లోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఉపయోగించ బడుతుంది. జీర్ణక్రియ ని మేలు చేయడానికి బెల్లం ఎంత గానో ఉపయోగపడుతుంది. ఏదైనా ఆహార పదార్థాల రూపం లో ప్రతి రోజు 10 నుంచి 15 గ్రాములు బెల్లం తీసుకోవచ్చు. ప్రతి పది గ్రాముల బెల్లం లో మనకి 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అందుతుంది.
 
పరగడుపున  బెల్లం తీసుకోవడం వాళ్ళ ప్రయోజనాలు: 
 
పరగడుపున గోరువెచ్చని నీటిలో బెల్లాన్ని వేసి ఖాళీ కడుపు తో తాగితే జీర్ణం బాగా అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే జీర్ణ సమస్యల తో సతమతం అయితే కనుక ఈ పద్ధతిని అనుసరిస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది. పెద్ద కష్టమైన పధ్ధతి కాదు కనుక సులువు గానే దీనిని అనుసరించవచ్చు. 
 
బెల్లం వల్ల స్త్రీలకు కలిగే ప్రయోజనాలు:
 
బెల్లం వల్ల మహిళల కి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం లోని అనేమియా నిరోధించడానికి బెల్లం సహాయం చేస్తుంది. అలానే ఋతు సమస్యలు నివారించడానికి సమర్థ వంతంగా పని చేస్తుంది. అంతే కాకుండా గర్భ ధారణ సమయం లో ఎర్ర రక్త కణాలు యొక్క స్థాయిని పెంచడానికి కూడా బెల్లం బాగా ఉపయోగ పడుతుంది. బెల్లాన్ని అధికంగా తీసుకోవడం వల్ల గర్భ ధారణ సమయం లో స్త్రీలు తమ శక్తిని పెంచు కోవచ్చు. కాబట్టి దీనిని తరచూ వంటకాల్లో ఉపయోగించడం ఎంతో మంచిది. 
 
 బెల్లం వల్ల మగవారికి కలిగే ప్రయోజనాలు :
 
మగవారు రోజు వారి ఆహారం లో బెల్లాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరి పొడి తో కలిపి బెల్లం తినడం వల్ల మగవారి లో నాణ్యమైన శుక్ర కణాలు పొందగలరు. అలానే దాని యొక్క స్థాయిని కూడా బాగా పెంచుకో గలరు. సామర్ధ్యం కూడా బాగా పెంచుకుంటారు. 
 
దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా బెల్లాన్ని ఉపయోగిస్తాం. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. అంతే కాక భారతీయ వంటల లో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. ఇంత ఆరోగ్యమైన బెల్లాన్ని తీసుకుంటే ఎన్నో సమస్యలని ఎంతో సులువుగా చెక్ పెట్టేయొచ్చు.