బిరియాని నుండి కూరల వరకు మనం సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా సామాన్లని ఉపయోగించడం సహజం. ఇదేం కొత్తేమి కాదు. ఎప్పటి నుండి వాడుతున్న పద్దతే. ఇలా మనం రోజు చేసే వంటలో మసాలా సామాన్లు విరివిగా వాడుతూనే ఉంటాము. ఆహారంలో మసాలా సామాన్లు వాడడం వల్ల వంటకం రుచి మరింత గానో పెరుగుతుంది. భారతీయ సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా రుచులు కి ప్రత్యేకత ఎంత గానో ఉంది.
మన భారత దేశంలో ఈ సుగంధ ద్రవ్యాలు శతాబ్దాల నుంచి కూడా వాడుతూనే ఉండడం జరుగుతోంది. ప్రతి ఇంట్లోనూ కూడా మసాలా సామాన్లు తో ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్క రీతిలో వంటకాలన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఈ మసాలా మిశ్రమాలు కుటుంబ ఆహార సంస్కృతిని కలిగి ఉన్న తరాలు ద్వారా అనుసరిస్తున్నదే. కొన్ని వంటకాల్లో మసాలా సామాన్లు లేకపోతే దాని రుచి శూన్యం. ఈ సుగంధ ద్రవ్యాలని వివిధ మొక్కల భాగాలు నుంచి తీస్తారు.
నేటి కాలంలో సుగంధ ద్రవ్యాలు:
నేటి కాలంలో సుగంధ ద్రవ్యాలని, మూలికలుని సులువుగానే మనం కొనుగోలు చెయ్యగలుగుతున్నాం. ఎందుకంటే అప్పటి కాలం తో పోల్చుకుంటే ఇప్పుడు షిప్పింగ్ బాగా అవుతోంది. ఎగుమతి, దిగుమతి బాగా పెరిగింది. దీని కారణంగా సుగంధ ద్రవ్యాలని పంపిస్తూ కూడా వ్యాపారం సాగిస్తున్నాం. కేవలం మన దేశం లోనే వినియోగించడం కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్య లభిస్తోంది.
సుగంధద్రవ్యాలు విభజన:
అసలు సుగంధ ద్రవ్యాలు ఏమిటి...?, ఎన్ని రకాలు..? ఇలా పలు ప్రశ్నలు మీకు కలగొచ్చు. మరి ఆలస్యం చెయ్యొద్దు చూసేయండి.
వృక్ష సంబంధమైనవి: దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి., లవంగాలు మొదలైనవి....
గింజ సంబంధమైనవి: ధనియాలు, జీలకర్ర మెంతులు సొంపు మొదలైనవి...
మిరియాలు, యాలకులు, పసుపు అల్లం వంటివి కూడా ఇతర సుగంధ ద్రవ్యాలు. మిరప, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిని కూడా సుగంధ ద్రవ్యాలుగా మనం పరిగణించ వచ్చు. వీటికి భారతీయ సంప్రదాయ వంటకాల్లో, పిండి వంటల తయారీలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
వానా కాలంలో సుగంధ ద్రవ్యాలు పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలి....?
సహజంగా వర్షా కాలం వచ్చిందంటే చాలు ఈ సుగంధ ద్రవ్యాలు పాడై పోతాయి. తేమ తో కూడిన వాతావరణం కి గురి అయినప్పుడు వాటి రుచిని కూడా కోల్పోతాయి. అందుకే వీటిని బాగా నిల్వ చేస్తే పాడైపోకుండా ఉంటాయి. ఇలా నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. కాబట్టి పలు జాగ్రత్తలు మీకోసం. వీటిని కనుక అనుసరిస్తే ఇవి పాడైపోకుండా, రుచి కోల్పోకుండా ఉంటాయి.
ఎయిర్ టైట్ జార్ లో నిల్వ ఉంచడం:
వాన కాలం రాక ముందే మీ వంట గదిని శుభ్రం చేసి.... ఇంట్లో ఉన్న మసాలా దినుసులు అన్ని గాలి చొరబడని డబ్బా లో ఉంచడం చాలా మంచిది. ఎందుకంటే...? గాలి ప్రవేశిస్తే ఫంగస్ లాంటివి అంటుకునే ప్రమాదం ఉంది. అలానే ఎక్కువ కాలం మసాలా సమన్లు తాజాగా ఉండలేవు. అంతే కాదు వాటి రుచిని కూడా కోల్పోతాయి. కాబట్టి గాలి వెళ్ళ లేని డబ్బాలో స్టోర్ చేయడం వల్ల దాని రుచి పోకుండా ఉంటుంది.
పొడి ప్రదేశంలో దాచడం:
ఎక్కువగా మనం వంటలు చేసేటప్పుడు మనం మసాలా సామాన్లని తడి చేత్తో కానీ తడి చెంచా తో కానీ వేస్తూ ఉంటాం. తడి వాటితో కానీ చేతులతో కానీ వాటిని తాకొద్దు. అలానే తడి అంటుకునేలా పెట్టొద్దు. ఎందుకంటే ఇది ఫంగస్ ఏర్పడడానికి కారకం అవుతుంది. మసాలా సామాన్లు పాడై పోకుండా ఉండాలంటే చీకటి ప్రదేశం లో ఉంచడం, నీరు లేని ప్రదేశం లో ఉంచడం సురక్షితం.
వేడి నుంచి దూరంగా ఉంచండి :
చాలా మందికి స్టవ్ పక్కన మసాలా సామాన్లు పెట్టి వంట చేసే అలవాటు ఉంటుంది. కానీ వాటిని పక్కన పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే అలా ఉంచితే అధిక స్థాయి వేడి మరియు తేమను ప్రదర్శిస్తుంది. దాని పై ఉండే నూనె వంటి పదార్థాలు గాలి లో ఆవిరై పోతాయి. కాబట్టి సూర్యరస్మి గురి కాకుండా జాగ్రత్త పడడం, స్టవ్ పైపు కాకుండా ఉండేలా చూసుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల సుగంధ ద్రవ్యాలు పాడై పోకుండా ఉంటాయి.
ఫ్రిజ్ లో స్టోర్ చేయవద్దు:
సుగంధ ద్రవ్యాలు చాలా మంది కవర్లో పెట్టి ఫ్రిజ్లో పెడతారు. కానీ ఇలా చేయడం వల్ల ముద్దలు ఏర్పడతాయి. అందుకని ఎప్పుడూ కూడా రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయకండి. చక్కగా పొడిగా ఉన్న డబ్బాలో లేదా మందపాటి గ్లాస్ బాటిల్స్ లో కానీ భద్రపరచవచ్చు. అలా కనుక చేస్తే ఇవి పాడైపోకుండా ఉంటాయి.
ఇలా ఈ టిప్స్ ని కనుక అనుసరిస్తే మీ సుగంధ ద్రవ్యాలు పాడైపోవు అలానే ఎక్కువ కాలం ఉంటాయి.