సహజంగా బీచ్స్, పార్క్స్, జూ లేదా ఆలయాలు ఇలాంటి ప్రదేశాలకి మనం వెళుతూ ఉంటాం. కానీ ఎప్పుడూ వెళ్లే ఈ ప్రదేశాల కంటే కూడా కొంచెం పురాతన ప్రదేశాలకి చరిత్ర కలిగి ఉన్న ప్రదేశానికి వెళ్తే వినోదంతో పాటు విజ్ఞానం కూడా మనకి అందుతుంది. అలానే తెలుసుకోవడానికి ఎన్నో ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఎంతో బాగుంటుంది. ఇలాంటి ప్రదేశాలు కనుక మీకు దగ్గరలో ఉంటే ఎప్పుడూ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. అయితే మరి ఆ ప్రదేశం ఏమిటి..?, అక్కడ ఉన్న విశిష్టత ఏమిటి...? నిజంగా దాని చరిత్ర ఏమిటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీకు తలెత్తవచ్చు మరి మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. ఇక ఆలస్యమెందుకు ఈ అందమైన ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోండి.
బొజ్జన్న కొండ అందాలు:
సువిశాలంగా ఏ దిక్కు వైపు చూసిన పచ్చదనంతో నిండి ఉంటుంది. అందమైన చెట్లు, రంగురంగుల పక్షులు, రకరకాల పువ్వులు అబ్బా ఏం అందం. ఇలా అక్కడ ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సరదాగా ఆడుతూ పడుతూ గడపాలంటే కుటుంబ సమేతంగా అక్కడకి వెళ్లాల్సిందే. అలానే ఈ ప్రకృతి అంతా ఒకటైతే ఆ కొండ మరొక ఎత్తు. దాని అందం గురించి చరిత్ర గురించి ఏం అని చెప్పగలం...?, ఎంతని చెప్పగలం..?
బొజ్జన్న కొండ ఎక్కడ ఉంది ..?
బొజ్జన్నకొండ ఎంతో పురాతన ప్రదేశం. ఇది విశాఖపట్నం జిల్లా శంకరం గ్రామం దగ్గర గల కొండల పై గల స్థలాలు ఉన్నాయి. ఈ విశాఖపట్నం నుంచి 45 కిలో మీటర్ల దూరంలో అనకాపల్లి నుండి కొంత దూరంలో కలవు. అయితే ఈ స్థలాల విషయానికి వచ్చే సరికి...... క్రీస్తు శకం నాలుగు నుండి తొమ్మిది దశాబ్ది మధ్య నుండి ఇక్కడ అవి కలవు. మూడు రకాల బౌద్ధమత వర్గాలు హీనయాన, మహాయాన, వజ్రయాన బాగా వృద్ధిలో వుండేవి. వాటినే ఇక్కడ కొండల పై చూపించడం జరిగింది. ఈ మూడు వాటిని కూడా సంఘారము అని పిలువబడతాయి. చరిత్ర మాట పక్కన పెడితే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొండలు పైన ఉన్నప్పటికీ కింద కూడా ఎంతో బాగుంటుంది. ఎంతో మంది అక్కడ కూర్చుని సరదాగా సమయాన్ని గడుపుతారు.
బొజ్జన కొండ ఎలా చేరుకోవాలి....?
బొజ్జన్నకొండ విశాఖపట్నం జిల్లా శంకరం వద్ద ఉంది. విశాఖపట్నం నుంచి ఇది కేవలం 45 కిలో మీటర్లు మాత్రమే. బొజ్జన్నకొండ కి విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళు ప్రైవేటు వాహనాలు అందుబాటు లోనే ఉంటాయి లేదా ప్రభుత్వ బస్సులు కూడా అందుబాటు లోనే ఉంటాయి. కాబట్టి ఎంతో సులువుగా ఇక్కడికి చేరుకోవచ్చు. బొజ్జన కొండ కి దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ అనకాపల్లి రైల్వే స్టేషన్. అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా దగ్గరే. కానీ అనకాపల్లి అయితేనే బాగా దగ్గర. బొజ్జన కొండకి సమీపంలో ఉండే విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయం.
కార్తీకమాసంలో బొజ్జన కొండ:
కార్తీక మాసంలో ఇక్కడకి ఎంతో మంది వస్తారు. ఇది మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడికి అనేక మంది వస్తూ ఉంటారు. సరదాగా ఇక్కడికి వచ్చి ఆనందిస్తారు. కార్తీక మాసం అంతటా కూడ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతారు. చక్కటి ప్రకృతి మధ్య కొండల తో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ ప్రదేశం. బొజ్జన కొండ పై ఇటుకలతో కట్టబడిన గదులు, విహారాలు ఉన్నాయి. మెట్ల ద్వారా పైకి అక్కడ కట్టడాలని చూడవచ్చు. కుటుంబ సమేతంగా ఈ ప్రదేశానికి వెళ్తే ఎంత గానో అందించవచ్చు. ఇక్కడికి వెళ్తే సమయమే తెలియదు అంతలా ముగ్ధులయిపోతారు.
బొజ్జన కొండ ప్రత్యేకతలు:
బొజ్జన కొండ వద్ద ఏకశిలా స్తూపాలు, కొండలో తొలచబడిన గుహలు ఉన్నాయి. ఇదే దీని ప్రత్యేకత. నాలుగు గుహలు ఆశ్రయ స్థలాలు. ఈ నాలుగింటిలో ఒకటి మినహా మిగిలిన మూడింటి లో ధ్యాన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ గుహ ద్వారముల రెండు ప్రక్కల కూడా పెద్ద ద్వార పాలకుల విగ్రహాలు కలవు. గుహ లోపల అంతా కూడా చతుర్భుజాకారములో ఉంటుంది. మొత్తం పదహారు స్థంబాలతో, ఇరువై గదులతో తొలచబడింది. ధ్యాన ముద్రలో గల భూమిస్పర్శ బుద్ధుని విగ్రహము బహు అద్భుతంగా ఉంటుంది. అలానే గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై రాతిలో తొలచబడిన ఘన స్తూపము కూడా ఉంది.
బొజ్జన్నకొండ బుద్ధుని శిల్పం.
ప్రధాన స్తూపము రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉంది. ఈ శిల్పము అందర్నీ ఆకట్టుకుంటుంది. ఎక్కడ లేని విధంగా ఉన్న ఈ కట్టడాలు ఇక్కడ ఉండడం వల్లే దీనిని చూడడానికి వస్తారు.
త్రవ్వకాలలో నాణేలు :
1907 లో జరిగిన త్రవ్వకాలలో ఇచట పలు నాణేలు దొరికాయి. 4వ శతాబ్దపు సముద్ర గుప్తుని నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణు వర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలము నాటి నాణేలు దొరికాయి. లింగాలకొండ అంచున రాతిలో తొలచబడిన పలు స్తూపాలు కూడ ఇక్కడ ఉన్నాయి. బౌద్ధమత వ్యాప్తితో పాటు పలు ఆరామములు, విద్యాస్థలాలు వెలిశాయి. వానిలో తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ మొదలగునవి దగ్గరలోనే ఉన్నాయి.