BREAKING NEWS

ఆరోగ్యానికి ఔషధం చిరునవ్వు....

నిత్యం మనం నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నవ్వుకి వెల కట్టడం అనేది ఏమీ ఉండదు. నవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉండగలం. కేవలం మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకీ ఆరోగ్యం మరెంత గానో క్షీణిస్తోంది. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వితే ఎక్కువ కండరాలు ముడిపడి ఉంటాయి. అయితే నవ్వు వల్ల ఏం లాభం కలుగుతుంది అని అంటారా.....?  నిజమే నవ్వు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నవ్వు వల్ల కలిగే లాభాలు ఇప్పుడే చూసేయండి.
 
నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలు: 
 
నవ్వే ఆరోగ్యానికి ఆయుధం. నవ్వడం వల్ల హార్ట్ రేట్ ను తగ్గించి శరీరం ఉపశమనం పొందడానికి తోడ్పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం. తరచుగా నవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి నువ్వు బాగా ఉపయోగపడుతుంది. 
 
అంతే కాకుండా చాలా మంది సమయం వెనకాల పాకులాడుతూ ఉంటారు. దీంతో వాళ్లు ఒత్తిడిని భరించాల్సి వస్తుంది. మునుపటి రోజులతో పోలిస్తే ఆధునిక జీవన విధానంలో ఒత్తిడితో ఎంతో మంది సతమతం అవ్వడం చూస్తున్నాం. చాలా రకాల శారీరక మానసిక సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా బయట పడాలంటే  తరచు నవ్వడం వల్ల ఇండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇలా విడుదల అయ్యే క్రమంలో ఒత్తిడి తగ్గిపోతుంది. కాబట్టి నవ్వుతో ఒత్తిడిని సులభంగా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఒత్తిడికి గురైపోతున్నారని అర్ధం అయినప్పుడు ఎక్కువగా నవ్వండి. ఒక వ్యాయామంలా ఇది పని చేస్తుంది.
 
నమ్మకం బలపడడానికి నవ్వు బాగా సాయం చేస్తుంది. నవ్వు నిజంగా దివ్యౌషధం. సహజంగా వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నవ్వుతూ పలకరించడం, తరచుగా నవ్వడం వల్ల సంఘంలో సత్సంబంధాలు ఏర్పడుతాయి. అలానే నమ్మకం కూడా పెరుగుతుంది. ఒక వేళ నువ్వు నిజాయితీగా లేకపోతే ఇట్టే గుర్తు పట్టగలరు మీ చుట్టూ ఉన్నవాళ్లు. కాబట్టి మనస్పూర్తిగా నవ్వడం ఎంతో ముఖ్యం.
 
అంతే కాదండి బాధలని చిటికెలో తగ్గించేస్తుంది నవ్వు. హాయిగా కనుక నవ్వితే నిజంగా పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది. అలానే ఏమైనా బాధ కానీ నొప్పి కానీ ఏమైనా కలిగితే నవ్వే దానికి పరిష్కారం చూపిస్తుంది. అలానే హాయిగా నవ్వితే చింత కూడా తొలగిపోతుంది. నవ్వకుండా ఉన్నప్పుడే చింత ఏర్పడుతుంది కాబట్టి తరచూ నవ్వడం వల్ల చింతని తగ్గించొచ్చు.
 
నవ్వడం వల్ల ఏకాగ్రతని మరింత పెంచొచ్చు. చక్కగా హాయిగా నవ్వడం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. అంతే కాకుండా కేవలం ఒక పని మాత్రమే కాకుండా మల్టీ పనులు చేయడానికి కూడా శక్తి లభిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సామర్ఢ్యముగా తీర్చి దిద్దుకోవచ్చు కేవలం నవ్వుతూ. 
 
అలానే నలుగురిని ఆకర్షిస్తుంది నవ్వు. ఎక్కువగా నవ్వుతూ ఉండే ఆడవారికి పురుషులు ఎక్కువగా ఆకర్షింప బడతారు. అలానే నవ్వడం వల్ల యౌవనంగా ఉండటానికి తోడ్పడుతుంది అని  అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి.
 
గెలుపుకి చిరునామా నవ్వు. నవ్వుతూ ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా అది గెలవడానికి మార్గం చూపిస్తుంది. ఎక్కువగా నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నవ్వడం వల్ల శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనానికి గురవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నవ్వితే దీర్ఘాయువు కూడా లభిస్తుంది. ఎప్పుడూ నవ్వని వాళ్ల కంటే నవ్వుతూ ఉండే వాళ్లు ఏడు ఏళ్ళు  ఎక్కువగా జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
నవ్వుతూ ఉంటే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. దాని వల్ల స్నేహపూర్వక వాతావరణం కూడా నెలకొల్పుతుంది. అలానే ఎంపతీ కూడా లభిస్తుంది. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ వల్ల మూడ్ లిఫ్ట్ అవుతుంది.
 
ఎప్పుడు జీవితంలో కలిగే దుఃఖాలను బాధలను బాగా పట్టించుకుంటూ వాటిలో ఉన్న కూరుకుపోతూ..... చిరునవ్వుని మర్చిపోయి ఆ దుఃఖాన్ని భరిస్తూ..... దాని లోనే ఈదడం  మంచిది కాదు. జీవితం చాలా అందమైనది మరియు మీరు నవ్వుతూ ఉన్నప్పుడు అది మరింత అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా విచారంగా మరియు నిరాశ ఉంటే జీవితాన్ని పొందడం ఖచ్చితంగా పనికిరానిది. ఎప్పుడు కూడా మీ పై మీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడూ దేనికి బాధ పడకూడదు. కాబట్టి ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. నవ్వుతూ వెళ్తే వాటికి అదే పరిష్కారం కనిపిస్తుంది. అలానే మీకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నవ్వే పాజిటివిటీని పెంచుతుంది. అలానే మీకు గొప్ప ప్రోత్సాహాన్ని కూడా నవ్వే అందిస్తుంది.
 
చిన్న చిరునవ్వుతో ఎంతటి కోపాన్నైనా తొలగించొచ్చు...... చిన్న చిరునవ్వుతో ఎంతటి బాధనైనా మరచిపోవచ్చు..... చిన్న చిరునవ్వుతో కష్టాలని మరిచిపోవచ్చు..... చిన్న చిరునవ్వుతో ఎవరి మనసునైనా కాజేయొచ్చు....చిన్న చిరునవ్వుతో మూడ్ ని మార్చేయొచ్చు.... నవ్వే ప్రశ్నలకి వాటికి సమాధానం, నవ్వే ఆరోగ్యానికి ఔషధం....