BREAKING NEWS

నోరూరించే ఈ ఆంధ్రా పచ్చళ్ళు ఇలా చేస్తే..... వావ్ అనాల్సిందే...!

ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆహారాన్నీ తింటుంటారు. కొన్ని చోట్ల తినే ఆహారాన్ని మరికొన్ని చోట్ల తినక పోవచ్చు. అయితే మరి మన ఆంధ్రాలో తరతరాల నుంచి చేసుకుంటున్న పచ్చళ్ళు. అవి కూడా  అప్పటికప్పుడే చేసుకుంటున్న పచ్చళ్ళు చాలానే ఉన్నాయి. నిజంగా ఇవి ఎంతో స్పీడ్ గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఊరగాయలు ఒక ఎత్తైతే  అప్పటికప్పుడు చేసుకుని ఈ పచ్చళ్ళు మరొక ఎత్తు. ఈ పచ్చళ్ళు ఏంటా...?  అని మీరు ఆలోచిస్తున్నారా..... మరి ఇంకెందుకు ఆలస్యం వీటి గురించి చూసేయండి.
 
కేవలం రుచికి మాత్రమే కాదు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని సరిగ్గా చేసుకుంటే నాలుగు నుంచి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. టిఫిన్ లోను, అన్నంలోను, రోటిలో కూడా ఎంతో  బాగుంటాయి. మరి చెయ్యాలో, ఏమి కావాలో ఇప్పుడే చూసేయండి.
 
బీరపొట్టు పచ్చడి:
 
బీరపొట్టు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో వుండే పీచు వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా పెరగదు. గుండె జబ్బులు కూడా రాకుండా పీచు పదార్థాలు సహాయపడతాయి. మధుమేహం, ఊబకాయం ఇలా అనేక సమస్యల్ని చెక్ పెడుతుంది. బీరకాయల్లో అధిక పీచు ఉంటుంది కాబట్టి దీనిని మనం రోజు తీసుకోవడం ఎంతో మంచిది. ఎన్నో రకాలు బీరకాయలు ఉన్నాయి. వీటిలో ఏది తీసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
 
అలానే జింక్, ఐరన్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలానే జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంత ఆరోగ్యం ఉన్న ఈ బీరపొట్టు తో పచ్చడి చేసుకుంటే ఎంత మేలు చేస్తుందో ఒకసారి ఊహించండి.
 
బీరపొట్టు పచ్చడికి కావలసిన పదార్థాలు :

 
బీరకాయ తొక్కలు, నువ్వులు, ఉప్పు, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు.
 
బీరపొట్టు పచ్చడి తయారు చేసుకునే విధానం:
 
ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత రెండు స్పూన్ నువ్వులు కూడా దానిలో వేసి వేగించాలి. తర్వాత శుభ్రం చేసుకుని, కడిగిన బీరకాయ తొక్కలని దానిలో వేసి వేయించుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో  వేసి మెత్తగా నలగనివ్వాలి.  దాని లోనే కొంచెం ఉప్పు, చింతపండు, బెల్లం వేసి పచ్చడి మాదిరి వచ్చేంతవరకు నలిగించాలి. దీనిని రైస్ తో కానీ రోటితో కానీ తీసుకోవచ్చు. దోశ లాంటి టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది.
 
పెసరపప్పు పచ్చడి:
 
 పెసరపప్పు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది వేడి తగ్గించి చల్లగా మార్చడానికి సహాయ పడుతుంది. ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి పెసరపప్పు దివ్యౌషధం. ఇలా పెసరపప్పు పచ్చడి చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
 
పెసరపప్పు పచ్చడి కి కావలసిన పదార్థాలు :
 
పెసరపప్పు, పండు మిర్చి జీలకర్ర, ఇంగువ, ఉప్పు, నిమ్మరసం.
 
తయారు చేసుకునే విధానం:
 
ముందుగా పెసరపప్పును కొంచెం సేపు నీళ్ళ లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో ఆ పెసరపప్పును వేసి దాని లోనే పండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి అది మెత్తగా నలిగి పోయిన తరువాత దాని పై నిమ్మ రసం వేసుకోవాలి అంతే. దీనిని అన్నం తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. లేదా రోటి, టిఫిన్స్ తో కూడా తినొచ్చు.
  
గోంగూర పచ్చడి:
 
గోంగూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోంగూరని ఏ కూర లో వేసిన మంచి రుచిని అందిస్తుంది. గోంగూర లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అలానే గోంగూర తీసుకుంటే చలవ చేస్తుంది అంటూ ఉంటారు. ఇది దీర్ఘకాలిక రోగాలను నయం చేసే మంచి ఆకు కూర. దీనిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. అలానే మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా సహాయపడుతుంది. అలానే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని తగ్గించే గుణం గోంగూర లో ఉంది అందుకే మధుమేహంతో బాధ పడేవారు గోంగూరని వాడడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
 
 ఇది ఇలా ఉండగా గోంగూర పచ్చడి ని ఇష్టపడని వారు ఉండరు. దీన్ని చేయడం పెద్ద కష్టం కూడా కాదు. గోంగూర ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని మనం సహజంగా పప్పు వగైరా వాటిల్లో వాడుతునే ఉంటాము. ఏది ఏమైనా పచ్చడి మాత్రం అమృతం లానే ఉంటుంది.
 
 గోంగూర పచ్చడి కి కావలసిన పదార్థాలు:
 
ఆవాలు , మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, నూనె, వెల్లుల్లి, గోంగూర.
 
 గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం:
 
ముందుగా ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి నూనెలో వేయించుకోవాలి.  ఆ తర్వాత వాటిని పక్కన ఉంచాలి. ఇప్పుడు మరో సరి నూనె వేసి ఆకులు కూడా దానిలో వేసి మగ్గించాలి. అది బాగా దగ్గరపడ్డాక చల్లారిన మిశ్రమాన్ని తీసి మెత్తగా రుబ్బుకోవాలి. వేయించిన పోపు ని ఇప్పుడు వేసి కలపాలి. వేయించిన వెల్లుల్లి పైన వేసుకుంటే రుచిగా ఉంటుంది.
 
చూసారు కదా ఎన్ని పోషకాలు ఉన్నాయో... ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... అందుకేనేమో ఈ పచ్చళ్ళని మన పూర్వికులు ఎక్కువగా చేసేవారు. మరి ఆరోగ్యం కోసం రుచి కోసం మనం కూడా అనుసరిద్దాం ఇలా చేసి.