BREAKING NEWS

దేవిపురం సహస్రాక్షి శ్రీ రాజ రాజేశ్వరి ఆలయ విశేషాలు

పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, అందమైన పల్లె వీటన్నికంటే సుందరంగా ఉండే ఆలయం. ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఇలా ఉంటె...! సాధారణంగా ఉండే ఆలయాలు కంటే కూడా ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. తొమ్మిది  కొండలు కళ్ళకు మనోహరంగా కనబడతాయి. వాటి మదన పచ్చని ప్రకృతి పరవశం కలిగిస్తుంది. ఆకు పచ్చని తోటలతో నిండి  కనువిందు చేస్తాయి. ఇటువంటి గొప్ప ఆలయం ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా.....? మన దేశం లోనే.... నిజమేనండి  మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,  విశాఖపట్నం జిల్లాలో ఈ ఆలయం కలదు.

సహజంగా మనకు విశాఖపట్నం అంటే బీచ్లు, పార్కులు, షాపింగ్ మాల్స్  ఇవే కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కూడా  ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో దేవిపురం ఆలయం ఒకటి. దేవిపురం సహస్రాక్షి శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం విశాఖపట్నం కు అతి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి చెందింది. సబ్బవరంకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

ఇక్కడే సహస్రాక్షి పేరుతో శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం వెలసింది. ఈ ఆలయంలో గొప్ప విశేషం ఏమిటంటే....?  ఈ ఆలయం అంతా శ్రీచక్రం గానే ఉండటం. మరో విశేషం ఏమిటంటే ఇటువంటి పెద్ద శ్రీ చక్ర ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేకపోవడమే. చూశారా ఈ ఆలయం గురించి ఇంకా చెప్పకుండానే మీకు అక్కడికి వెళ్లాలని అనిపిస్తోంది. మరి పూర్తి వివరాలు ఇప్పుడే చూసేయండి.
  
శ్రీ చక్ర ఆకారంలోనే ఆలయ నిర్మాణం :
 
ఇంతకు ముందు చెప్పాను కదా..!  శ్రీ చక్ర ఆకారంలోని ఆలయమంతా నిర్మించారని. ఈ విషయం లో కి వెళ్తే.... ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి, శివుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం అంతా కూడా శ్రీ చక్ర యంత్రం ఆకృతి లో నిర్మింపబడింది. అలా దీనిని నిర్మించి దేవి దేవతలను ప్రతిష్టించారు. సహస్రాక్షి అంటే వెయ్యి కన్నులని కలదని అర్థం. శ్రీ దేవి సూచించిన పంచలోహ శ్రీచక్ర మేరువు యంత్రం దొరికిన పర్వత ప్రాంతం ఇదే.

  శ్రీ చక్ర మేరు యంత్రం ద్వారా తెలిసింది ఏమిటంటే....?  సుమారు 250 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొప్ప యజ్ఞం జరిగిన స్థలం ఉందని తెలిసింది. ఇది ఇలా ఉండగా శ్రీ చక్రం ఆలయ నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తుంది కానరాడు శివారులో ఉన్న సోదరులు జీడి మామిడి తోట ప్రాంతంలో ఉండగా అమ్మవారు సాక్షాత్కరించి ఇక్కడ మూడు అడుగుల నేల తవ్వితే పంచలోహ శ్రీచక్రం దొరుకుతుందని యోని స్వరూప శక్తులతో కామాఖ్య పీఠాన్ని స్థాపించి తగిన సంప్రదాయాలతో పూజలు జరిపించమని చెప్పగా.... ఆ దేవి ఆదేశానుసారం సర్వాంగ సుందరంగా మూడు అంతస్తులతో ఈ ఆలయాన్ని నెలకొల్పడం జరిగింది.
 
కామాఖ్య పీఠం :
 
ఈ ఆలయంలో శక్తి పూజలు చేయడానికి కామాఖ్యా పీఠాన్ని నిర్మించారు. అలానే శివ పూజల కోసం కొండమీద శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ మూడు అంతస్తులుని 108 అడుగుల పొడవు 108 అడుగుల వెడల్పు 54 అడుగుల ఎత్తులో కట్టారు. సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.
 
ఆకట్టుకునే అమ్మవారి నిలువెత్తు విగ్రహం:
 
ఈ శ్రీ చక్ర ఆలయంలో మూడో అంతస్తులో అంటే బిందు స్థానంలో శయనించిన సదాశివుని మీద కూర్చునే అమ్మవారి నిలువెత్తు విగ్రహం కళ్ళు తిప్పుకోలేనంత  మనోహరంగా నిర్మించారు ఆమె చుట్టూ కింద అంతస్తులో నక్షత్రాలు వంటి ఆవరణలు వాటిలో అమ్మవారి పరివార దేవతలు విగ్రహాలు ఎంతగానో ఆకర్షిస్తాయి.
  
దేవీపురంలో దసరా వేడుకలు:
 
దసరా బ్రహ్మోత్సవ కార్యక్రమములు ఇక్కడ  అత్యంత శోభాయమానంగా జరుగుతాయి.ప్రతీ ఏటా  వైవిధ్యభరితంగా అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ , రాజరాజేశ్వరి దేవి రూపాలలో అలంకరణ చేసి తదనుగుణంగా ఆయా ప్రధాన దేవతా హోమాలు జరుపుతారు. ఇలా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
 
దేవీపురం ఆలయాన్ని ఎలా చేరుకోవాలి? 
 
వైజాగ్ నగరానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. శ్రీ చక్ర మహా యంత్రం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయాన్ని విమానాల్లో వెళ్లేవారు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవిపురం ని  క్యాబ్ లేదా టాక్సీలో ప్రయాణించవచ్చు అదే రైలు మార్గాన్ని వచ్చేవాళ్ళు దేవిపురం సమీపాన వైజాగ్ రైల్వే స్టేషన్ ఉంది దేశంలోని అన్ని ప్రదేశాల నుండి ఇక్కడికి రైలు వస్తాయి.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి దేవి పురానికి 28 కిలోమీటర్లు. అనకాపల్లి అయితే దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనకాపల్లి నుండి దేవి పురానికి కేవలం 18 కిలోమీటర్ల దూరం. అదే రోడ్డు మార్గాన వచ్చేవాళ్ళు వైజాగ్ లోని ద్వారకా బస్టాండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి  బస్సు ఎక్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవిపురం చేరుకోవచ్చు.