BREAKING NEWS

మరి కొద్ది గంటల్లో వచ్చే బ్లూ మూన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా...?

ఆకాశం, నక్షత్రాలు, చందమామ చూడడానికి ఎంత బాగుంటుందో కదా...! ఎంత దుఃఖం ఉన్నా, కోపం ఉన్న అలా ఆకాశం వైపు చూస్తే చాలు. ఏదో ప్రశాంతంగా మనలో కనిపిస్తుంది. కోపం అంతా కూడా ఇట్టే చల్లారి పోతుంది. అటువంటి అందంగా ఉండే ఆకాశం గురించి వర్ణించడానికి మాటలు సరిపోతాయా...?  ఆకాశం అందాన్ని వర్ణించడానికి ఏమని చెప్పాలి...?  ఎంతని చెప్పాలి...?  కవులకి ఆకాశాన్ని చూస్తే ఎన్నో కవిత్వాలు పొంగుకు వచ్చేస్తాయి. చంటి పిల్లలు ఏడిస్తే అమ్మ ఆకాశం వైపు చూపించి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. 
 
ఇలా ఎంతో ప్రత్యేకత ఉంది చందమామకి, ఆకాశానికి. నిజంగా ఇవి  మనసులు కి బాగా కనెక్ట్ అయిపోతాయి. అలాంటిది చంద్రుడు నీలి రంగులో ఉంటే మరెంత బాగుంటుంది కదా..?   మరి ఎప్పుడు నీలి రంగులో ఆకాశం, తెల్లని చందమామ కనిపించే మనకి ఈ రోజు అనగా అక్టోబర్ 31వ తేదీన ఆకాశం లో అద్భుతం జరుగుతుంది.  ఈ రోజు నిజంగా ఆకాశం లో అద్భుతం కనిపించడం మంచి విషయం. ఈ రోజు బ్లూమూన్ ఆకాశంలో కనువిందు చేయబోతోంది. ఈ శుభవార్తను నాసా ఇటీవలే చెప్పడం కూడా జరిగింది. అయితే మరి నీలి రంగు లో చందమామ ఎందుకు కనిపించబోతోంది? ఎప్పుడు కనిపించింది...?  ఈ రోజు ఎందుకు కనిపిస్తోంది....?  ఎక్కువ కాంతితో ఇది రాబోతోందా...? ఇలా అనేక ప్రశ్నలు మనకి కలగవచ్చు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే చూసేయండి ఆలస్యం చేయకండి.
 
బ్లూమూన్ డే: 
 
2020 అక్టోబర్ 31వ తేదీన ఆకాశంలో చందమామ ఎప్పుడూ కంటే కూడా  అత్యంత ఎక్కువ కాంతితో  రాబోతోంది. మరింత పెద్ద పరిణామంతో ఇది కనిపించడం కూడా జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యం కదా...! ఎప్పుడు కంటే ఎక్కువ కాంతితో ఈరోజు చంద్రుడు కనిపించబోతున్నాడు అది కూడా నీలి రంగులో మరింత పెద్దగా కనిపించనున్నాడట. ఇలా వచ్చిన  ఆ బ్లూ మూన్ ని  చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే సాధారణంగా ఒకే నెల లో రెండు పౌర్ణములు వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. మరి అటువంటి అరుదైన సంఘటన గురించి అనేక విషయాలు ఇప్పుడే ఇక్కడ చూసేయండి.
 
బ్లూ మూన్ అంటే చాలా మంది చంద్రుడు నీలి రంగులో కనిపించడం మాత్రమే అనుకుంటారు. కానీ దీని వెనక పెద్ద కథ ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) చెప్పిన దాని ప్రకారం సాధారణంగా ఆకాశంలో చంద్రుడు కేవలం పసుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తాడు. కానీ ఎప్పుడూ నీలిరంగులో కనిపించడం అనేది జరగదు. అదే బ్లూమూన్ విషయానికొస్తే సాధారణంగా కనిపించే పసుపు లేదా తెల్ల రంగులో చంద్రుడు కనిపించడు. చంద్రుడు రెగ్యులర్ కంటే భిన్నంగా కనిపిస్తాడు. అంటే ఆరోజు నీలిరంగులో ప్రత్యేకంగా దర్శనమిస్తాడు.
 
నిపుణులు చెప్పిన వాటి ప్రకారం బ్లూ మూన్ అనేది ఒక సాధారణ ఖగోళ దృగ్విషయం. ఇది అరుదుగా ప్రతి రెండేళ్ళకు, మూడేళ్లకు కనిపిస్తుంది. అలాంటిది ఈ సంవత్సరంలో కనిపించడం ప్రత్యేకం. అమెరికాలో అయితే ఇటువంటి చంద్రుడు వస్తే తోడేళ్ళు దాన్ని చూసి అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మంచు కురుస్తూ వాతావరణం ఎంతో చిమ్మచీకటి తో నిండి ఉంటుంది. దీని కారణంగానే బ్లూమూన్ అనే పేరు వచ్చింది. మళ్లీ ఇది 2039 వ సంవత్సరంలో మాత్రమే కనిపిస్తుందట.
 
 గతంలో బ్లూ మూన్ ఎప్పుడు వచ్చిందంటే..? 
 
అయితే బ్లూమూన్ రావడం ఇదే మొదటి సరేనా లేదా గతంలో ఎప్పుడైనా వచ్చిందా..?  అనే విషయానికి వస్తే.... ఈ నీలి రంగులో ఉండే చందమామ ఇంతకు ముందు సుమారు 137 సంవత్సరాల క్రితం వచ్చింది. అంటే 1983 సంవత్సరం లో నీలి చంద్రుడిని చూసే అవకాశం అప్పటి ప్రజలకు లభించిందనే చెప్పాలి. అయితే నీలిరంగులో కనిపించడం ప్రారంభించడానికి కారణం ఏమిటంటే...?  అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా దుమ్ము కణాలు గాలిలో కరగడం కారణంగా ఈ బ్లూ మూన్ అనేది ప్రారంభం అవడం జరిగింది.
 
అదే ఈ రోజు నీలి చంద్రుడు రావడానికి కారణం ఏమిటంటే...?  కేవలం ఆ విషయం వల్ల కాదుట. ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి రావడమే ఈ రోజు బ్లూ మూన్ కి కారణం. రెండోసారి వచ్చే పౌర్ణమి వల్లే నీలి చందమామ ( బ్లూమూన్ ) వస్తుంది అని అంటారు.
 
 బ్లూ మూన్ లో చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు ?
 
నీలిరంగు చందమామ సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి అక్టోబర్ 31వ తేదీ రాత్రి 8 :18 గంటల వరకూ కనిపించనున్నాడు. అయితే అక్టోబర్ 31వ తేదీన రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంటుందని నీలి రంగులో చందమామ చాలా స్పష్టంగా కనిపిస్తాడని టెలిస్కోప్ సహాయంతో చంద్రుని చూడవచ్చని నిపుణులు అంటున్నారు. 
 
అలానే బ్లూ మూన్ మాత్రం గ్రహం కాదని కూడా నిపుణులు చెప్పేసారు. ఇంత అందమైన ఆకాశం బ్లూ మూన్ వల్ల మరెంత అందంగా కనపడనుండి.