BREAKING NEWS

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఈ ఆహారాలకి దూరంగా ఉండండి...

అందరికీ అందంగా ఉండాలని ఉంటుంది, అందంగా ఉన్న వారు వారి చర్మ సంరక్షణ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్న మొటిమ వచ్చినా సరే అందం ఎక్కడ తగ్గిపోతుంది అని చింతిస్తూ ఉంటారు. ముఖం మీద మచ్చలు లేదా బొబ్బలు లేకుండా ఉంటే మృదువుగా అందంగా కనిపిస్తారు కానీ ఇది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే  ముఖం మీద వచ్చిన మొటిమలు, మచ్చలు ముఖం మీద  ఉండడం సహజం. తగ్గిపోయిన పింపుల్స్ తాలూకు మచ్చలు ముఖం మీద కనిపిస్తూనే ఉంటాయి.
 
అలాగే ఎక్కువ కాలం పాటు అవి  ఉండి పోవడం సహజం. మనం అందంగా ఉండాలన్నా..... ఆకర్షణీయంగా కనిపించాలన్నా.....జీవన విధానం, మన ఆహార శైలి, మానసిక ఆలోచనలు, మన కార్యకలాపాలు ఇవన్నీ కూడా శరీరంలో ప్రతి అవయవం పై పని చేస్తాయి. కాబట్టి కేవలం ఒక దానిని పాటిస్తూ మిగిలిన వాటిని వదిలేస్తే సరిపోదు. అన్నింటి పై దృష్టి పెట్టాలి.
 
మనసులోని ఆలోచనలు వారి ముఖం మీద చూపిస్తాయని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెడు ఆలోచనలు కలగడం వల్ల కొన్ని అనవసరమైన హార్మోన్లు కలిగిస్తాయి. దీని మూలం గానే చర్మ సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి శారీరికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆలోచనలు వైపు కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.
 
అంతేకాదు ముఖం మీద మొటిమలు మచ్చలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నవారు తమ తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. డీప్ ఫ్రై చేసిన వంటకాలు, స్ట్రీట్ ఫుడ్స్ తో పాటు కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాన్ని కూడా తక్కువ తీసుకోవడం మంచిది. కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు వీటి వల్ల అందం సమస్యలు కూడా వస్తాయి. కేవలం రుచి చూసుకుని ఆరోగ్యాన్ని ఇబ్బందు ల్లోకి నెట్టేయడం సరికాదు.
 
అందం పై హక్కు మనది కాబట్టి ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలా కనుక తీసుకోక పోతే ఆరోగ్యం తో పాటు అందం కూడా పాడవుతుంది. ఆకర్షణీయంగా కనిపించాలి అని అనుకునే వాళ్లు  ఈ విషయాలను తప్పక చూడండి....
 
జంక్ ఫుడ్:
 
నేటి కాలంలో జంక్ ఫుడ్ ప్రియులు ఎక్కువైపోయారు. ఎప్పుడు చూసినా ఎక్కువగా జంక్ ఫుడ్ ని మాత్రమే తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే సాస్ లు మరియు టమోటా కెచప్ లు  కూడా ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుతాయి. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల పొడి చర్మం సమస్య వస్తుంది. అలానే  ప్రాసెస్ ఎక్కువగా చేసిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి. దీనితో ఆరోగ్య సమస్యల తో పాటు చర్మ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఎక్కువగా మీరు ఓమేగా 3 కొవ్వు ఆమ్లం మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే చర్మం పై దద్దుర్లు, బొబ్బలు రావడం జరుగుతుంది. అలాగే చర్మం ఎర్రగా మారిపోతుంది ఇలా జంక్  ఫుడ్ కారణంగా చర్మ సమస్యలు వస్తాయి.
 
కార్బోహైడ్రేట్ పదార్థాలు :
 
కార్బోహైడ్రేట్ పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం కూడా  మంచిది కాదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు ఉన్నవారు పై ప్రతికూల ప్రభావితం చేస్తుందని తెలుసుకోండి. ఎక్కువగా బియ్యం మరియు గోధుమలతో తయారు చేసిన ఏమైనా ఆహారాలు తీసుకుంటే చర్మ సమస్యలతో బాధపడే వాళ్లకీ మంచిది కాదు. దీనిని గుర్తుపెట్టుకుని చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ  ఆహారం జోలికి పోవద్దు. ఎందుకంటే ఈ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది.
 
అలాగే అందమైన చర్మం పై మొటిమలతో పాటు బ్లాక్ హెడ్స్ కూడా వస్తాయి. ఎక్కువగా రొట్టె, బన్స్, కేకులు మరియు పేస్టులు తింటే అందం కూడా తగ్గిపోతుంది. కాబట్టి అందం గురించి ఆందోళన చెందే వారు ఇటువంటి ఆహారాలను తీసుకోవద్దు. ఫైబర్ తక్కువగా ఉన్న ఈ ఆహారాలు మీ రక్త ప్రవాహాన్ని చాలా త్వరగా పెంచుతాయి. దీని మూలంగా అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
 
 పాల పదార్థాలు:
 
మనకి తెలిసిందే పాల పదార్థాలలో కొవ్వు అధికంగా ఉంటుందని. కనుక పాలు రోజు తాగే వాళ్ళు ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి. ఆవు పాల లో ఉండే పదార్థాల వల్ల   ఐ జి ఎఫ్ వన్ అనే   హార్మోన్లుని  పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా ముఖం మీద మొటిమలు వస్తాయి అలానే రోజు పాలు తాగే వాళ్ళకి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటాయి. పాలు తీసుకోవడం వల్ల చర్మం పై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి పాల ఉత్పత్తికి బదులుగా బాదం పాలు, కొబ్బరి పాలు మొదలైనవి తాగడం మంచిది.
 
చూసారు కదా మనకి తెలియకుండా ఆహారం మన అందం పై ఎలా ప్రభావం చూపుతుందో..! మరి ఈ ఆహారానికి చెక్ పెట్టేసి అందంగా, ఆరోగ్యంగా ఉండండి.