BREAKING NEWS

పంచారామాల్లో ఒక్కటైన కుమార భీమారామము చరిత్ర, ఆలయ విశేషాలు

పంచారామాలు ఎలా వచ్చాయి? 
 
ఆంధ్రప్రదేశ్ లో  ఐదు  శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినప్పుడు రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడింది. ఆ ఐదు క్షేత్రాలు  పంచారామాలని కథనం.
 
పంచారామాలు ఎక్కడున్నాయి?
 
భీమేశ్వరుడు- దక్షారామము (ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా), భీమేశ్వరుడు-కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా), రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా),  సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా),  అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా).
 
కుమార భీమారామం:
 
మన ఆంధ్రప్రదేశ్ లో  ఉండే ముఖ్య ఆలయాల లో కుమార భీమారామం ఆలయం ఒకటి. నిజంగా ఇది చూడదగ్గ ప్రదేశం. ఈ కుమార భీమారామం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట చేల తో నిండి ఉంటుంది.  ఈ ఆలయం సామర్లకోటకు ఒక కిలో మీటరు దూరంలో ఉంది. పంచారామాల్లో ఒకటైన ఈ ఆలయం లో శివుడు 14 అడుగుల ఎత్తున రెండు అంతస్తుల మండపం గా భక్తులకు దర్శనమివ్వగా.... శివుడికి పూజలు చేయాలంటే పై అంతస్తుకు వెళ్లి పూజలు చేయవచ్చు.
 
మహా శివరాత్రి రోజున ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే. మరి ఇటువంటి గొప్ప ఆలయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా....?  ఇక ఆలస్యం ఎందుకు అండి కుమార భీమారామము గురించి ఇప్పుడే చూసేయండి.
 
కుమార భీమారామము ఎలా చేరుకోవాలి?
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పంచారామాలు బస్సులో ఒక్క రోజులో దర్శించే యాత్ర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుమారు 700 కిలో మీటర్ల సాగే ఈ యాత్ర ప్రతి రోజు రాత్రి 8 గంటలకు మొదలై మళ్ళీ మర్నాడు రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తుంది. ఈ యాత్ర టికెట్ సుమారు ఎనిమిది వందల వరకు ఉండవచ్చు అంతే. ఇలా కనుక మీరు ప్రయాణం చేస్తే ఎంతో సులువుగా పంచారామాలు అని దర్శించుకోవచ్చు. 
 
 
కుమార భీమారామము లో ఉత్సవాలు, పూజలు:
 
ఇక్కడ నిత్య పూజలు జరగడమే కాకుండా పలు పర్వ దినాల నాడు అంగరంగ వైభవంగా జరుపుతారు. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళ  లో స్వామి వారి పాదాలను సాయంత్రం సమయం లో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెబుతారు. శివరాత్రి కి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామి కి బాల త్రిపుర సుందరి కి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. ఈ వేడుక ఇక్కడ ఏకంగా అయిదు రోజుల పాటు జరుగుతుంది. ఈ వేడుకల్లో స్వామి వారిని నంది వాహనం పై అమ్మ వారిని సింహ వాహనం పై ఊరేగిస్తారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలు వస్తుంటారు. నిజంగా రెండు కళ్ళు చాలవు.
 
ఇది ఇలా ఉండగా కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. అప్పుడు కూడా భక్తులు ఎక్కువగా వచ్చి ఈ ఆలయాన్ని చూసి దర్శించుకుంటారు. ఇలా అభిషేకాలు ఉత్సవాలు విరివిగా జరుగుతుంటాయి. దీనితో భక్తులు పాల్గొని పునీతులు అవుతుంటారు.
 
ఉయ్యాల లాగ ఊగే రాతి మండపం:
 
ఇక్కడ ఆలయ ప్రాంగణం లోని ఉత్తరం వైపున ఉన్న రాతి మండపాన్ని భక్తులు కొద్దిగా ప్రయత్నించి ఊపితే అది ఉయ్యాల లాగ ఊగుతుంది. నిజంగా ఆనాటి శిల్పులు గొప్పతనం కి మనం మెచ్చుకోవాల్సిందే. ఆ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా ఉందని చెప్పుకోవాలి. 
 
కుమార భీమారామములో  వజ్ర గణపతి:
 
ఈ ఆలయానికి పడమర దిక్కులలో ఉన్న గోడ పై గణపతి విగ్రహం ఉంటుంది. అయితే ఆ విగ్రహానికి నాబిలో కాంతివంతమైన వజ్రం ఉండేదని అంటారు.  ఆ వజ్రం నుంచి ప్రతి ఫలించే కాంతులు రాత్రి భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే ఆ గణపతిని వజ్ర గణపతి అని పిలుస్తారు.
 
కుమార భీమారామం ఆలయ చరిత్ర :
 

ఈ ఆలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చరిత్ర లో వివరించడం జరిగింది. అయితే ఈయనే ద్రాక్షరామ క్షేత్రాన్ని కూడా నిర్మించాడు. అందుకనే ఈ ఆలయాలు రెండూ కూడా ఒకే రీతిగా ఉంటాయి. అలానే రెండు ఆలయాల కట్టడాల లో ఉపయోగించిన రాయి కూడా ఒక్కటే. ఇదిలా ఉండగా ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ 1892లో ప్రారంభమై సుమారు క్రీ.శ 1922 వరకు సాగింది. ఈ ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. అలాగే ఇక్కడ శివలింగం తెల్లని రంగు లో భక్తులకు దర్శనమిస్తుంది. 1340 నుండి 1466 మధ్య కాలంలో కాకతీయులు ఈ ఆలయాన్ని కొంత పునః నిర్మించడం కూడా జరిగింది. ఇక్కడ కాకతీయుల నాటి శిల్పకళను అంతకు పూర్వపు తూర్పు చాళుక్యుల నాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చు.
 
చూసారా ఎంతో పురాతన చరిత్రతో..... అందమైన ప్రకృతితో ..... ఇలా భక్తుల కోరికల తీర్చే పరమ శివుడుని దర్శించుకుంటే జన్మతరించిన్నటే....