BREAKING NEWS

'పాన్ ఇండియా స్టార్' టు 'పాన్ ఇంటర్నేషనల్ స్టార్'... ప్రభాస్

'ఈశ్వర్'లో గల్లీ అబ్బాయిలా కనిపించినా.. 
'వర్షం'తో అమ్మాయిల మనసును గెలిచినా.. 
'బుజ్జిగాడు'లో సిక్స్ పాక్ తో ఫిట్ గా కనిపించినా.. 
'డార్లింగ్' అంటూ పిలుస్తూ అందరికీ దగ్గరవుతూనే...
'మిర్చి'లో మాస్ ఫైటింగ్ చేసినా...
'బాహుబలి'లా దేశాలు చుట్టేశాడు.
ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా పాన్ ఇండియాగా మొదలై..
పాన్ ఇంటర్నేషనల్ గా మారాడు… 
అతనే మన రెబల్ స్టార్ 'ప్రభాస్'
నేడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన నిజ, సినీ జీవిత విశేషాల గురుంచి ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
చిన్నప్పుడు...

ప్రభాస్ పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో 1979 అక్టోబర్ 23న జన్మించాడు. తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు సినినిర్మాత, తల్లి శివకుమారి. అన్నయ్య ప్రబోధ్, అక్క ప్రగతి. ఈయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. 
భీమవరంలోని డీఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత శ్రీ చైతన్య కాలేజీలోనే ఇంటర్, ఇంజనీరింగ్ లో బి.టెక్ పూర్తి చేశారు.
 
సినిమాల్లోకి...

చిన్నప్పటి నుంచి ప్రభాస్ కు హోటల్ పెట్టాలనే కోరిక ఉండేది. కానీ తండ్రి, పెద్దనాన్న ప్రోత్సాహంతో హీరో అయ్యాడు. ఇంట్లో ఎప్పుడు సినిమా వాతావరణమే ఉన్నా, నేను హీరో అవ్వాలని కలలో కూడా అనుకోలేదు. ఏదో వ్యాపారం చేసుకుందాములే అని అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఒక్కసారి నాకే హీరో అవ్వాలనిపించి నాన్న వాళ్లకు చెబితే షాక్ అయ్యి సరే అన్నారు. అలా నటనలో సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు.

మూడునెలల తర్వాత నిర్మాత అశోక్ కుమార్ హీరోగా పరిచయం చేస్తూ ఈశ్వర్ సినిమాలో అవకాశం కల్పించడంతో ఎంతో పట్టుదలతో నటించాడు. ఆ సినిమా విడులయ్యాక నాన్నతో చూసినప్పుడు 'నన్ను కౌగిలించుకొని బాగుందిరా' అని మెచ్చుకున్నారు. పౌర్ణమి, యోగి, మున్నా తర్వాత కొత్తగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు తన చిన్ననాటి స్నేహితుడు బాస్కీ ఫ్యాషన్ డిజైనర్ ను కలిశాడు. 'బుజ్జిగాడు' సినిమా నుంచి ఏదో ఒక కొత్త స్టైల్ ని ట్రై చేద్దామని నిర్ణయించుకున్నాడు. అలా చేసే ప్రతి పాత్రలో కొత్తదనంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 
 
ఇష్టమైనవి...

◆ తెలుగులో ఎస్వీ రంగారావు, సావిత్రి, హాలీవుడ్ లో రాబర్ట్ డి నిరో, హీరోయిన్ లలో త్రిష అంటే చాలా ఇష్టమట.

◆ దేవుళ్లను నమ్ముతాడు. కానీ సెంటిమెంట్లు మాత్రం ఫాలో కాను అంటారు ఈ డార్లింగ్.

●పండుగల్లో సంక్రాంతి పండగంటే చాలా ఇష్టమట.

●స్వీట్లు అంటే బాగా ఇష్టపడతాడట.

●షూటింగ్ నుంచి విరామం దొరికితే ఎంతో ఇష్టమైన బిర్యానీని కనీసం ఒక పదిహేను రకాల్లో తెప్పించుకుని తింటా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాస్.

●లండన్, ప్యారిస్, దుబాయ్ ప్రదేశాలంటే చాలా ఇష్టమట.
●రంగుల్లో నలుపు, తెలుపు రంగులంటే ఇష్టమట.
 
ఇతరాంశాలు...

●ప్రభాస్ ముద్దు పేర్లు డార్లింగ్, ప్రభ.

●'నా బద్ధకమే నాకున్న అతి పెద్ద బలహీనత' అని చాలాసార్లు చెప్పారు.
●హిందీలో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్' అనే సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ఆ తర్వాత బాహుబలిని హిందీలో డబ్బింగ్ చేశారు. 

●బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని కలిగిన మొదటి సౌత్ హీరోగా రికార్డుకెక్కారు ప్రభాస్.

●బాహుబలి సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు ఏ సినిమాకు ఒప్పుకోకుండా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాలో బాడీబిల్డింగ్ కోసం మిస్టర్ వరల్డ్ 2010లో గెలిచిన లక్ష్మణ్ రెడ్డి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. దాంతోపాటు ఫిట్ గా కనిపించడానికి ఇంట్లో ప్రత్యేకంగా వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు. 
●బాహుబలి సినిమా కోసం ఏకంగా 30 కిలోల బరువు పెరిగాడు.

●ప్రభాస్ కి పుస్తకాలు చదవడమంటే అంటే ఎక్కువ ఆసక్తి. వాళ్ల ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంది. షూటింగ్ లేనప్పుడు అక్కడే కాలక్షేపం చేస్తారట.

●ఒకసారి రాజమౌళి 'ది ఫౌంటెయిన్ హెడ్' చదవమని చెప్పారు. ఆ పుస్తకం వల్ల నా వ్యక్తిత్వంలో నేను ఊహించని కొన్ని మార్పులు తీసుకొచ్చిందని ఓ సందర్భంలో చెప్పారు.

●2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.

●ప్రభాస్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
కొత్త సినిమా అప్డేట్స్...

●తెలుగులో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటిస్తూనే పాన్ ఇంటర్నేషనల్ గా తన సినిమాలను విదేశీ భాషల్లో తీస్తున్నాడు.

●కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న 'రాధేశ్యామ్'లో ప్రభాస్, పూజాహెగ్డే కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పుట్టినరోజు సందర్భంగా 11.16 నిముషాలకు ఈ సినిమా టీజర్ ను ఇంగ్లీష్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో ప్రభాస్ 'విక్రమాదిత్య'గా కనిపించనున్నారు.

●కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమాలో ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

●సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే మూవీలో నటిస్తున్నట్లు అందుకు ఏకంగా 150 కోట్ల భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని 8 భాషల్లో తెరకెకించబోతునట్లు సమాచారం.

●ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' లో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

●నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కొత్త సినిమా తీయనున్నట్లు ప్రకటించారు.
 
ఫేవరెట్ డైలాగులు...

●బుజ్జిగాడు సినిమాలో 'రేయ్ బాబ్జి, బస్సు వెళ్తుండగా అద్దాలు బద్దలుకొట్టేసుకొని…' అంటూ సాగే డైలాగ్ అంటే చాలా నచ్చుతుంది అని చెప్పారు.
●'గల్లీలో సిక్సు ఎవ్వడైన కొడతాడు. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది'.
●'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు'.
●నువ్వేమైనా రోమియో అనుకుంటున్నవా… ఛీ వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు.