BREAKING NEWS

బోసినవ్వుల 'గాంధీజీ'

కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ… ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ… ఇలా నడిరోడ్డు మీద, కరెన్సీ నోటు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ… తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ…
నిజమే, 75 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి పూర్తి విముక్తి కల్పించడంలో చెరగని ముద్ర వేసిన గాంధీజీ,
నూలు వడకటం, వాడల్ని శుభ్రం చేయడం మొదలు...
ఎన్నో ఉద్యమాలకు పూనుకొని,
ఉద్వేగభరిత ప్రసంగాలతో ప్రజల్ని ఐక్యం చేసి, ఆంగ్ల ప్రభుత్వ విధానాల్ని తుదముట్టించి భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛను పంచారు 'జాతిపిత'.
సత్యం, అహింసలే ఆయన ఆయుధాలు.
నేడు ఆ మహాత్ముడి 152వ జయంతి సందర్భంగా ఆయన జీవిత, ఉద్యమ విశేషాలను ఈరోజు గుర్తు చేసుకుందాం:
 
బాల్యం:-

గాంధీజి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించారు. తండ్రి కరంచంద్ గాంధీ అక్కడే బందరు సంస్థానంలో ఒక దివానుగా పనిచేసేవారు, తల్లి పుతలీ భాయి. గాంధీ ప్రాథమిక విద్యను రాజ్ కోటలో, ఉన్నత విద్యను కథియవాడ్ లో పూర్తి చేశారు. న్యాయవిద్య కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు.
గాంధీజీ 13 ఏళ్ల వయస్సులోనే కస్తూరిభాయిను వివాహం చేసుకున్నారు.
 
ఉప్పు సత్యాగ్రహం:-

ఈ ఉద్యమాన్ని 1930లో మార్చి 12న మొదలుపెట్టారు గాంధీజీ. అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి అరేబియాన్ సముద్రం వరకు అంటే దాదాపు 240 కిలోమీటర్లు నడుస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయనకు మద్దతుగా పాల్గొన్న 60,000 మంది ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అరేబియాన్ పట్టణమైన దండికి ఆయన ఏప్రిల్ 5న చేరుకున్నారు. 
 
క్విట్ ఇండియా:-

1942 జులై 14న 'క్విట్ ఇండియా' నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ సూచించారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలై ఆగస్టు 8తో 79 ఏళ్లు పూర్తయ్యాయి. ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ వేదికలో 'డు ఆర్ డై' అంటూ క్విట్ ఇండియా నినాదాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమం జరిగిన తర్వాత బ్రిటిష్ వారి నుంచి భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది.
 
●1899లో బోయర్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, గాంధీ దాదాపు 1100ల మంది భారతీయులను గుర్తించారు. అంతేకాదు బ్రిటిష్ వారి కోసం భారతీయ అంబులెన్స్ కార్ప్స్ ను ఏర్పాటు చేశారు. అయినా కూడా జాతి వివక్ష, హింస భారతీయులపై కొనసాగింది.
 
ఇతరాంశాలు:-
●మహాత్మాగాంధీ స్వాతంత్ర్యోదమంలో భాగంగా దాదాపు 79,000ల కిలోమీటర్ల దూరం నడిచారు. 

●గాంధీ ప్రేరణతో పౌర హక్కుల ఉద్యమం 4 ఖండాలలో, 12 దేశాలలో జరిగింది.

●గాంధీజీ మరణించిన 21 సంవత్సరాల తరువాత గ్రేట్ బ్రిటన్ ఈయన్ని గౌరవించటానికి ఒక స్టాంప్‌ను విడుదల చేసింది.

●నోబెల్ శాంతి బహుమతి కోసం గాంధీజీని ఐదుసార్లు ఎన్నుకున్నా  ఆయనకు మాత్రం అది వరించలేదు.

●'మహాత్మా' అనే బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారన్న వార్త ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.

●1930లో 'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా బిరుదును అందుకున్న మొట్టమొదటి భారతీయుడిగా గాంధీజీ చరిత్రకెక్కారు. ఈ అవార్డును అందుకోవడానికి గల కారణం స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీజీ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉప్పుసత్యాగ్రహా ఉద్యమంలో బ్రిటిష్
ప్రభుత్వం ఉప్పు పైన విధించే పన్నులను వ్యతిరేకిస్తూ దాదాపు 240 మైళ్ళ దూరం నడిచారు. అందుకు ఈయనను ఆ సంవత్సరం మ్యాగజైన్ కవర్ పేజీ పైన ముద్రించారు.

●గాంధీజీ మరణానంతరం, అంత్యక్రియల ఊరేగింపుకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున ప్రజలు నీరాజనాలు పలికారు.

●దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చిన గాంధీజి గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో సంపన్నులుగా తిరిగేవారు. ఒకానొక సమయంలో పేదవాళ్లకు కట్టుకోవడానికి సరైన దుస్తులు లేవనే ఆలోచనలో పడ్డారు. మధురై రామనాథపురం చేరిన గాంధీ సామాన్యుడిలా ధోవతి, పైన చిన్న శాలువా కట్టుకున్నారు. అలా ఈయన మొదటిసారి ధోవతి కట్టిన స్థలాన్ని 'గాంధీ పొట్టల్' అని పిలుస్తారు. అలా గాంధీ ధోవతి కట్టి ఈ ఏడాదితో వంద ఏళ్లు గడిచాయి.

●ఈయన సుదీర్ఘ కాలంపాటు అంటరానితనమనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడంలో కీలక పాత్ర పోషించారు.

●పన్నాలాల్‌దాస్‌ గుప్తా ‘రెవల్యూషనరీ గాంధీ’ పుస్తకాన్ని రాశారు. అందులో గాంధీజి గురుంచి ‘సత్యాన్ని సత్యంతోనే నిలబెట్టాలనేది మహాత్ముడి వాదన' అని అన్నాడు. 

●కెనడా విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంథోని పరేల్‌ ‘గాంధీస్‌ ఫిలాసఫీ అండ్‌ ది క్వెస్ట్‌ ఫర్‌ హార్మనీ’లో గాంధీజీ ఆధ్యాత్మికత గురుంచి రాశారు. 

●గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొందరు పాత్రికేయులు గాంధీకి  'మహాత్మా' అనే బిరుదును ఇచ్చారు. అంతేకాక నాయకుడిగా ఉన్న ఈయనను 'బాపు' అని పిలుస్తారు.

●గాంధీకి 'రఘుపతి రాఘవ రాజా రాం' అనే గీతం అంటే చాలా ఇష్టం.

●గాంధీజీని భారతీయులంతా మహాత్ముడు అని పిలుస్తారు. కానీ ఈయన తన హృదయంలో మరొక మహాత్ముడిగా, గురువుగా 'గోపాలకృష్ణ గోఖలేను' ఆరాధించేవారు.

●గాంధీ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారి పైన సంధించిన ఆయుధాలు సత్యాగ్రహం, నిరాహార దీక్ష, సహాయ నిరాకరణలు. ఇవి అణుబాంబులను మించన అస్త్రాలుగా వారు పేర్కొన్నడం విశేషం!

●గాంధీజీ జయంతిని పురస్కరించుకుని రాజ్ ఘాట్ లో గాంధీ స్మారక చిహ్నం వద్ద పువ్వులతో నివాళులు అర్పిస్తారు.
ఈ ఏడాది ప్రత్యేకంగా 75వ స్వాతంత్ర్య అమృత మహోత్సవాన్ని మొదలుపెట్టారు. దీనిని మార్చి 12న, అనగా దండి మార్చ్ 91వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు.
ఈ మహోత్సవాన్ని 2023 ఆగస్టు 15 (77వ స్వాతంత్ర్య దినోత్సవం)వరకు కొనసాగించనున్నారు.

●2007 జూన్ 15న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మహాత్మా గాంధీ జయంతి రోజునే 'అంతర్జాతీయ అహింసా దినంగా' ప్రకటించింది.
గాంధీ శతజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈయన ఆశయాలు, సిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

●1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఎప్పటిలానే ప్రార్ధనా మందిరానికి వెళ్తుండగా, నాథూరామ్ గాడ్సే కాల్చడం వల్ల గాంధీజీ మరణించారు.