ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురు, శాంతి రంగంలో ఇద్దరు, సాహిత్య రంగంలో ఒకరు నోబెల్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అసలు నోబెల్ పురస్కారం ఎలా పుట్టింది? ఎందుకు ఇస్తారు? ఎవరికి ఇస్తారనే పలు విషయాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం:
ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్తైన సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రతి సంవత్సరం ఈ ఐదింటిలో (భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య రంగం, ఆర్థికశాస్త్రం, శాంతి రంగం) ప్రపంచవ్యాప్తంగా కృషి చేసిన వారికి ఈయన పేరు మీదగా పురస్కారంతోపాటు, బహుమతిగా పారితోషికం ఇవ్వనున్నట్లుగా 1895లో వీలునామా రాసుకున్నారు. అలా 1900లో నోబెల్ సంస్థలను స్థాపించారు. 1901లో నోబెల్ పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
విజ్ఞామనేది అంతులేనిదని దానికి కాలం, దేశం, జాతి వంటి ప్రమాణాలు ఉండవు. అలాంటిది అంతటి విజ్ఞానాన్ని పంచే గొప్ప వారికి సత్కారం అవసరమని సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ భావించారు.
●డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి కావడంతో ఆ రోజునే స్టాక్ హోమ్ లోని సమావేశ మందిరంలో స్వీడన్ రాజుతో నోబెల్ బంగారు పతకం, నగదు బహుమతి, అర్హత పత్రం ఇస్తారు. ముఖ్యంగా శాంతి బహుమానం తప్ప మిగితావి బహుకరిస్తారు.
●నోబెల్ తన పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఇలా నగదు బహుమతిగా అందిస్తారు.
●ఇప్పటివరకు భారతదేశంలో ఎనిమిది మంది ఈ నోబెల్ ను అందుకున్నారు.
●ప్రపంచవ్యాప్తంగా మొత్తం 137 నోబెల్ పురస్కారాలు ఇవ్వగా, అందులో 109 మంది వ్యక్తులకు, 28 సంస్థలకు అందించారు.
●అతిపిన్న వయస్కురాలైన మలాలా యూసఫ్ జాయ్ 17 ఏళ్లకే నోబెల్ పురస్కారం అందుకుంది.
●జోసెఫ్ రోట్ బ్లాట్ అనే వ్యక్తి 87 ఏళ్ల వయసులో నోబెల్ తీసుకున్నాడు.
●ఇప్పటివరకు కేవలం18మంది మహిళలు మాత్రమే నోబెల్ కు ఎంపికయ్యారు.
మొదటి శాంతి బహుమతిని 1905లో బెర్తా వాన్ సుట్నర్ గెలుచుకుంది.
★ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు అందుకున్నారు.
నోబెల్ పురస్కారం పొందడానికి కారణం:-
వాతావరణ సంబంధిత అంశాల గురుంచి ఇంకా బాగా అర్థం చేసుకునే విధంగా విజ్ఞానాన్ని అందించడానికి ముగ్గురు పునాదులు వేశారు. వారు సుకురో మనాబె, క్లాస్ హాజల్ మాన్, జార్జియో పారిసి. ఇప్పుడు ఈ ముగ్గురి గురుంచి తెలుసుకుందాం.
సుకురో:-
జపాన్ లోని షింగుకు చెందిన సుకురో అనే శాస్త్రవేత్త అమెరికాలోని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వాతావరణ శాస్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.
వాతావరణంలో గాలి కదలికల మధ్య జరిగే చర్యలను ఈయన తొలిసారిగా పరిశోధించారు. గాల్లో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి కనుక పెరిగితే భూమ్మీద ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో అనే అంశం మీద ఈయన రుజువులు చూపారు.
క్లాస్ హాజల్ మాన్:-
జర్మనీ లోని హాంబర్గ్ కు చెందిన హాజల్ అదే నగరంలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటీరియాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. శీతోష్ణస్థితి మారుతున్నప్పటికీ వాతావరణ నమూనాలు ఎందుకు నమ్మే విధంగా ఉన్నాయో అని క్లాస్ ఒక నమూనాను తయారు చేశారు. సుకురోలాగా ఈ పరిశోధనను రుజువు చేయడానికి ఈయన విధానాలు ఉపయోగపడ్డాయి.
జార్జియో పారిసి:-
ఇటలీలోని రోమ్ కు చెందిన జార్జియో సాపియోంజా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఈయన 'స్పిన్ గ్లాస్' పై దృష్టిపెట్టారు. ఇది ఒక మిశ్రమ లోహం. ఇందులో పరమాణువుల క్రమం భిన్నంగా ఉంటూ పదార్థ అయస్కాంత ధర్మాలు మారిపోవడాన్ని ఇతను కనుగొన్నారు. ఈ సిద్ధాంతాన్ని వేరువేరు రంగాల్లోని పరిశోధనకూ ఉపయోగించుకోవచ్చు అని నోబెల్ కమిటీ ప్రకటించింది.
ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారంతో పాటు, 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని పొందారు. ఇందులో సుకురో, క్లాస్ కి సగభాగం ఇవ్వగా, మిగితా సగం జార్జియో తీసుకోనున్నారు.
సాహిత్య రంగంలో...
దేశాన్ని విడిచి పరాయి దేశానికి వెళ్లే శరణార్ధుల కన్నీళ్లను కళ్ళకు కట్టినట్టుగా కథలను అక్షర రూపంగా మలిచిన రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
వలసవాదంపై రాజీలేని పోరాటం చేస్తూనే, భిన్న సంస్కృతులు, భౌగోళిక ఖండాల మధ్య అంతరాలతో శరణార్ధుల బతుకు పోరాటం గురుంచి రాసిన రచనలు ప్రజల దృష్టికి వెళ్లాయని అందుకు నోబెల్ పురస్కారం ఇవ్వనున్నట్లు ఆ ఎంపిక కమిటీ 'స్వీడిష్ అకాడమీ' తెలిపింది.
అబ్దుల్ రజాక్:-
రజాక్ 1948వ సంవత్సరంలో ఆఫ్రికాలోని టాంజానియాకు దగ్గరలోని హిందూ మహాసముద్రంలోని జాంజిబార్ దీవిలో జన్మించారు. అబ్దుల్ మాతృభాష స్వహలి. ఈయన అరబ్ జాతీయుడు కావడంతో అక్కడ ఉండలేక శరణార్థిగా 1968లో బ్రిటన్ చేరుకున్నాడు. ఆయన వలసదారుడిగా అనుభవించిన బాధను, అలాగే శరణార్ధులకు మద్దతుగా పోరాటం చేస్తూ వారి కన్నీటి కథలకు అక్షర రూపం దాల్చుతూ 21ఏళ్ల వయసులోనే కలం పట్టి రచయితగా మారారు. కానీ రచనలు మాత్రం ఆంగ్లంలోనే రాసేవారు.
ఇప్పటివరకు పది నవలలను, ఎన్నో కథలను రాశారు. ఇందులో 'పారడైజ్', 'డిజర్షన్', 'మెమొరీ ఆఫ్ డిపార్చర్', 'పిలిగ్రిమ్స్ వే', 'బై ది సీ' ప్రముఖంగా ఉన్నాయి. 1994లో 'పారడైజ్' నవల బుకర్ ప్రైజుకు తుదిపోటీలో నిలిచింది. ఆఫ్రికా రచయిత నోబెల్ పురస్కారం అందుకోవడం ఇది ఆరవసారి. అబ్దుల్ కెంట్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు. ఇప్పుడు పదవి విరమణ చేశారు.
ఈయన 11.4 లక్షల డాలర్ల బహుమతి అందుకోగా, 1986లో వోల్ సోయింకా తర్వాత నోబెల్ కి ఎంపికైన తొలి నల్లజాతి ఆఫ్రికన్ గా అబ్దుల్ గుర్తింపు పొందారు.
పాత్రికేయులకు...
●ప్రజలకు తెలియని ఎన్నో వాస్తవిక వార్తలను బయటపెడుతూ తనవంతుగా కృషి చేసిన పాత్రికేయులిద్దరికీ నోబెల్ పురస్కారం దక్కింది. భావప్రకటనా, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పాత్రికేయులకు నోబెల్ ఇవ్వనున్నారు. అందులో మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్ ఉన్నారు.
మరియా రెస్సా:-
ఫిలిప్పీన్స్ కి చెందిన మహిళా జర్నలిస్టు మరియా రెస్సా 2012లో 'రాపర్ల' అనే వెబ్సైటు స్థాపించారు. వివాదాలు, మాదకద్రవ్యాల, హత్యరాజకీయలు వంటి ఆర్థిక కార్యకలపాలతో నిండిన ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టెపై విమర్శలు చేస్తూ ఆమె వెబ్ సైట్ లో కథనాలు ప్రచురించింది. సామాజిక మాధ్యమంలో వెలువడుతున్న అవాస్తవాలను తరిమికొట్టింది. అందుకుగానూ నోబెల్ పురస్కారం, నగదు బహుమతిని బహుకరిస్తున్నారు.
దిమిత్రి మురాతోవ్:-
1993లో 'నవోయా గజెటా' దినపత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, చట్టవ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు, వాస్తవాల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని అందించారు. ఈయన మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు.
●ఫిలిఫిన్స్కు చెందిన వ్యక్తికి నోబెల్ రావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది నోబెల్ అందుకున్న మొదటి మహిళా మరియా. నగదు బహుమతి 11.4 లక్షల డాలర్లలను ఇద్దరికి సమానంగా ఇస్తున్నారు.
వైద్య రంగంలో...
భౌతిక స్పర్శలకు తగినట్లుగా శరీరంలోని నాడీవ్యవస్థ ఎలా పనిచేస్తుందో అనే దానిపై వీరు పరిశోధనలు జరిపారు. దీని ఫలితంగా శరీరంలో కలిగే కొన్ని నొప్పులు తగ్గడానికి, గుండెకు సంబంధించిన చికిత్సలో మార్పు తేవడానికి ఉపయోగపడుతుందని నోబెల్ కమిటీ సెక్రెటరీ జనరల్ థామస్ పెర్ల్ మన్ చెప్పారు. అందులో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్. మనిషి ఇంద్రియాలపై జరిపిన పరిశోధనకుగానూ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం అందుకున్నారు.
డేవిడ్ జూలియస్:-
న్యూయార్క్ కు చెందిన డేవిడ్ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఒకానొక సందర్భంలో మిరియాలు లేక మిరపకాయలు తింటునప్పుడు మంట ఎందుకు కలుగుతుందో అనే విషయంపై డేవిడ్ తెలుసుకున్నారు. దానికి కారణం మిరపకాయలో 'కాప్సాయిసిన్' అనే క్రియాశీల రసాయనంపై ప్రయోగం చేశారు. మనిషి శరీరంలో ఈ రసాయనానికి స్పందించే 'టీఆర్ పీవీ1' అనే జన్యుకణం ఉన్నట్లు కనుగొన్నారు. దీని కారణంగా మంట, నొప్పి కలిగినప్పుడు ఈ జన్యుకణం ప్రతిస్పందిస్తుంది.
ఆర్డెమ్ పటాపౌటియన్:-
ఈయన కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ కేంద్రంలో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. చల్లని పదార్థాన్ని తాకినప్పుడు లేక చలి వేసినప్పుడు స్పందించే గ్రాహక కణం('టీఆర్ పీవీ 8') ను కనుగొన్నారు. అలాగే కృత్రిమ పీడనం వల్ల కలిగే ఒత్తిడిని కూడా కనిపెట్టారు.
వీరి పరిశోధనలు శరీరంలోని పంచేంద్రియాలు నుంచి మెదడుకు అందే సంకేతాల పైన, అలాగే కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కారణమయ్యారు.
●ఈ ఇరువురు న్యూరో సైన్స్ విభాగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కావ్లీ అవార్డుకూ గతేడాది ఎంపికయ్యారు.