BREAKING NEWS

'పాండోరా' విధిస్తుంది…!

స్వాత్యంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్లు వస్తువులపై పన్ను విధిస్తూ ఎంతోమందిని బలిగొన్నారు. దాని కోసం మనం యుద్ధాలే చేసి నిలదొక్కుకున్నాం. కానీ ఇప్పుడు పన్ను ఎగ్గొట్టడం కోసం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పరాయి దేశంలో కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను కొంటున్నారు. ట్రస్టుల పేరుతో డబ్బును దాచేస్తున్నారు. కేవలం మన దేశంలోని వారే కాదు ప్రపంచదేశాలలో కలిపి కొన్ని వేలమంది చేస్తున్న అక్రమాలను పాండోరా బైటపెట్టింది…
 
అసలు ఎందుకు చేస్తున్నారు..?

తమ దేశంలో వ్యాపారం కొనసాగించాలంటే పన్ను కట్టాలి. ఆ పన్నును ఎగవేయడానికి ఆ డబ్బును ఇతర దేశాలలో పెట్టుబడిగా పెట్టడానికి కారణం వేరే దేశంలో పన్ను తక్కువగా ఉండటం, లేక మొత్తానికి పన్ను విధించకుండా ఉన్నందువల్ల పరాయి దేశంలో ఆసక్తి చూపుతూ దొడ్డిదారిన ఆస్తులను జమ చేసుకుంటున్నారు.

●వాషింగ్టన్ డిస్నీలోని ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) నుంచి ఈ డేటా విడుదల అయ్యింది. 117 దేశాలలోని 150కి పైగా వార్త సంస్థలోని 600 మందికి పైగా విలేకరులు ఇందులో భాగస్వామయ్యారు. ఇది అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా సంచలనం సృష్టించింది. ఇందులో భాగంగా కోటి ఇరవై లక్షల ఆర్థిక లావాదేవీల పత్రాలను పశీలించగా, ఆ మొత్తం విశ్లేషించిన సమాచారం దాదాపు 2.94 టెరాబైట్లు అని తేలింది.

ప్రపంచవ్యాప్తంగా 91 దేశాలకు చెందిన వారుండగా, భారతదేశం నుంచి 380 మంది వరకు పాండోరా జాబితాలో ఉన్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు, బిలియనీర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆర్థిక నేరగాళ్లు, మిత్రులు, మాజీ ఎంపీలు ఉన్నారు.
 
పాండోరా పేపర్లలో ఏం ఉన్నాయి...

పాండోరా పేపర్లను వివిధ సేకరణల నుంచి 64,06,119 పత్రాలు, 29,37,513 చిత్రాలు, 12,05,716 ఈమెయిల్స్, వీటితోపాటు 8,86,923 ఇతర ఆధారాలను సేకరించి ఐసిఐజి తొలుత బయటపెట్టింది.

ఇందులో భారత్, అమెరికా, రష్యా సహా 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు. 336 మంది ఉన్నతస్థాయి రాజకీయవేత్తలు, అధికారులకు విదేశాల్లో 956 కంపెనీల పేరిట పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. మారు పేరుతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఎవరికి తెలియకుండా వేరే ప్రదేశాలల్లో స్థలాలను కొన్నారు.
 
ఇప్పటి వరకు ఏఏ దేశాలల్లో పెట్టుబడులు పెట్టారంటే

స్విట్జర్లాండ్, దుబాయ్, మొనాకో, పనామా, కేమన్ ఐల్యాండ్స్ లాంటి దేశాలలో రహస్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు.
భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి బ్రిటన్ లో 18 అసెట్ హోల్డింగ్ ఆఫ్ షోర్ కంపెనీలు ఉన్నాయి.
 
ఇప్పటివరకు పాండోరా పేపర్లో ఎవరెవరు ఉన్నారు.

●ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ సోదరి ట్రస్ట్ పేరుతో పన్ను కట్టకుండా ఉన్నాడు.

●బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసి పన్ను ఎగ్గొట్టాడు.

●మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కు బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో ట్రస్ట్ ఉన్నట్లు పాండోరా పేపర్లో ఉంది.
 
ప్రపంచ ప్రముఖులల్లో:-

●రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ మొనాకోలో ఈయనకు సంబంధించిన అత్యంత సన్నిహితుల పేర్లతో ఆస్తులను కొనుగోలు చేశారు. అంతేకాదు పాండోరా పేపర్లో పుతిన్ మాజీ ప్రేయసి ఉన్నట్లు కూడా పేర్కొన్నాయి.

●పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ కి చెందిన మంత్రులు, ఆర్ధికమంత్రి సౌకత్ తారిన్, ఆయన కుటుంబం, ఇమ్రాన్ మాజీ సలహాదారుడు వకార్ మసూద్ ఖాన్(రెవిన్యూ, ఆర్థిక) సహా 700 మంది వరకు పాకిస్తానీయులు ఉన్నారు.

●జోర్డాన్ రాజు అబ్దుల్లా-2కు చెందిన అమెరికా, బ్రిటన్ లో దాదాపు 741 కోట్ల ఆస్తులు కూడగట్టుకున్నారు. వీరికి కాలిఫోర్నియాలో సముద్రం ఒడ్డున ఎంతో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. 

●బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయిర్, ఆయన సతీమణి కలిసి లండన్ లో ఖరీదైన కార్యాలయాన్ని కొనుగోలు చేశారు. అక్రమంగా 3.14కోట్ల స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టడం గురించి పాండోరా పేపర్లో వెలువరించింది. 

●పాప్ గాయని షకీరా, మోడల్ క్లాడియా షిఫెర్, అమెరికా ఫైనాన్షియల్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ, అమెరికా లీగల్ సర్వీసెస్ సంస్థ మెకెంజీ, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెజ్ బేబిస్, లెబనాన్ ప్రధాని నజీవ్ మికటి తదితరులు ఉన్నారు.
 
ఆఫ్షోర్లో ఎంత డబ్బు దాచిపెట్టొచ్చు...

విదేశాల్లో దాచిన సొమ్ము కనీసంగా 5.6 ట్రిలియన్ డాలర్ల నుంచి అత్యధికంగా 32 ట్రిలియన్ల వరకు ఉండొచ్చని అంచనా. 

పన్ను తక్కువ ఉండే దేశాలకు తరలించే సంపద వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంవత్సరానికి 600 బిలియన్ డాలర్లు నష్టం జరుగుతున్నట్లు ఐసిఐజి అంచనా వేసింది.

●పనామా పత్రాల సంఖ్యతో పోలిస్తే ఈ పాండోరా పేపర్లు రెట్టింపు సమాచారాన్ని తెలిపాయి.

●ఈ పాండోరా పేపర్ల వివాదంపై కేంద్రం స్పందిస్తూ సీబీడీటీ, ఈడీ, ఆర్బీఐ, ఎఫ్ఐయూలతో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించింది. అందుకు విచారణ కమిటీకి సీబీసీటీ చైర్మన్ నేతృత్వం వహించనున్నారు.