BREAKING NEWS

'యాపిల్'కు రారాజు.. స్టీవ్ జాబ్స్!

మనం వాడే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ల వెనుక ఎంతోమంది కృషి దాగివుంది. మరీ ముఖ్యంగా ఐ ప్యాడ్, ఐఫోన్, ఐ ట్యాబ్ లైతే విప్లవం సృష్టించాయి. అటువంటి ఐటీ ఉత్పతులకో క్రేజ్ ఉంది, బ్రాండ్ ఉంది… అదే యాపిల్.. ఆ సంస్థ వ్యవస్థాపకుడైన అమెరికావాసి స్టీవ్ జాబ్స్ జీవించి లేకపోవడం నిజంగా దురదృష్టకరం… ఈ నెల 5న ఆయన వర్ధంతి(ఆక్టోబరు 05, 2011) సందర్భంగా ఆయన ప్రస్థానం, యాపిల్ సంస్థ గురుంచి విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
బాల్యం

1955 ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలోని ఒక సిరియా కుటుంబంలో జన్మించారు స్టీవ్ జాబ్స్. వాళ్ల ఆర్థిక పరిస్థితి బాలేక ఆ బిడ్డను పాల్, క్లార్క్ జాబ్స్ కు దత్తత ఇచ్చారు. హైస్కూల్ వరకు కాలిఫోర్నియాలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత రీడ్ అనే కాలేజీలో చేరాడు. కానీ అక్కడ చదువు నచ్చకపోవడంతో, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చదువును మధ్యలో ఆపేశాడు. తన స్నేహితుల గదిలో ఉంటూనే కాలిగ్రాఫీ నేర్చుకున్నాడు. కానీ అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా స్టీవ్ జాబ్స్ కి తెలియదు. నచ్చింది నేర్చుకున్నాడు అంతే. కనీసం వారంలో ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయడం కోసమని హరే కృష్ణ ఆలయంలో పెట్టే ప్రసాదం కోసం ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడంట.

ఆకలి కారణంగా వెళ్లిన తనకి దేవుడిపై భక్తి, అలాగే భారతదేశం గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందట. అందుకోసం ఆటారీ అనే వీడియో గేమ్ కంపెనీ లో పనిచేశాడు. అలా వచ్చిన జీతంతో కొంత మొత్తాన్ని జమచేసి 1974లో భారత్ కి వచ్చాడు. దాదాపు ఏడు నెలలు ఇక్కడే ఒక ఆశ్రమంలో ఉంటూ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. కొంతకాలం గడిచాక తిరిగి కాలిఫోర్నియా వెళ్ళిపోయాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు అయిన స్టీవ్ ఓచ్ ని కలుసుకున్నాడు. ఓచనియాకు ఎలక్ట్రానిక్ పరికరాలపైన మంచి పట్టు ఉంది. ఒక కంపెనీని స్థాపించాలని ఇద్దరు అనుకున్నారు. అందుకు కావాల్సిన పెట్టుబడి కోసం జాబ్స్ తన దగ్గర ఉన్న వ్యాన్ ని, ఓచ్ తన సైంటిఫిక్ క్యాలుకులేటర్ ని అమ్మేశారు.

చివరకు 1976 ఏప్రిల్ 1వ తేదీన ఇద్దరు కలిసి స్టీవ్ జాబ్స్ ఇంటి గ్యారేజ్ లో యాపిల్ పేరిట కంపెనీని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తో మొదలుపెట్టి సొంతంగా కంప్యూటర్ లను తయారు చేసే స్థాయికి చేరుకున్నారు. మొదటిసారి వాళ్లు విడుదల చేసిన యాపిల్ కంప్యూటర్ లు బాగా అమ్ముడుపోయాయి. అప్పట్లో తయారుచేసిన కంప్యూటర్ లకు మానిటర్ లు ఉండేవి కావు. కానీ పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నవారికి తప్పకుండా ఉపయోగపడతాయని భావించారు. అలా మొదటిసారి మానిటర్ తో యాపిల్ 2ని తయారు చేసి విడుదల చేశారు. అప్పట్లో అది ఒక సంచలనం అయ్యింది. తెర ముందు బొమ్మ కనిపించేసరికి  అద్భుతంగా నిలిచింది.  ఈ ప్రయోగం విజయవంతమైంది. కొద్దిరోజుల్లోనే ఈ కంపెనీ కొన్ని కోట్ల విలువ చేసే కంపెనీ గా మారింది. 
 
ఎదురుదెబ్బ

అప్పట్లో ఆర్థికమాంద్యం, అలాగే ఐబీమ్ కంపెనీ కంప్యూటర్లను విడుదల చేయడం వలన దాని ప్రభావం యాపిల్ కంపెనీ మీద పడింది. దాంతోపాటు ఆధిపత్య పోరు, గొడవలు మొదలయ్యాయి. దీంతో బోర్డ్ మెంబర్లు అంతా కలిసి స్టీవ్ జాబ్స్ ని యాపిల్ కంపెనీ నుంచి తొలగించాలనుకున్నారు. ఒక్క షేరు మాత్రమే ఉంచుకొని కంపెనీలో ఉన్న తన షేర్లన్ని అమ్మేశాడు. వాటితో నెక్స్ట్ అనే మరో కొత్త రకం  కంప్యూటర్ల కంపెనీని, ఫిక్సర్ అనే ఫిల్మ్ యానిమేషన్ సంస్థను స్థాపించాడు. ఇందులో ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ, కార్స్ వంటి సూపర్ హిట్ సినిమాలను తీశాడు.  

స్టీవ్ జాబ్స్ లేకపోవడంతో యాపిల్ కంపెనీ నష్టాలపాలయ్యింది. దాంతో అతన్ని మళ్లీ ఈ సంస్థలోకి తీసుకున్నారు. నెక్స్ట్ కంపెనీని యాపిల్ కంపెనీలోకి కలిపేశాడు. పాటలు వినడానికి వీలుగా అప్పట్లో క్యాసెట్లు మాత్రమే ఉండేవి. ఇది గమనించిన స్టీవ్ కొన్ని వందల పాటలు వినడానికి క్యాసెట్ అవసరం లేకుండానే ఐప్యాడ్ ను కనిపెట్టాడు. అప్పట్లో అదో విప్లవం.. ఆ తర్వాత కొన్నాళ్లకు టచ్ స్క్రీన్ తో ఐఫోన్, ఐట్యాబ్ అంటూ కొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి పరిచయం చేశాడు.

ఈయనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ లు రావు. కానీ తనకున్న నాయకత్వ లక్షణాలే ఇంత గొప్పవాడిని చేశాయి. 
ప్రాణాంతక వ్యాధి… పాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధి సోకింది. దీంతో ఈయన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది.  ఇది తెలిసి 2011లో యాపిల్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో టిమ్ కుక్ ని నిలబెట్టారు. అక్టోబర్ 5, 2011న స్టీవ్ జాబ్స్ వ్యాధి ముదిరి అనారోగ్యంతో కన్నుమూశాడు.
 
గుర్తింపు..
హీరో ఆఫ్ ది టెక్ ఇండస్ట్రీగా పేరు పొందాడు. ఈయన కృషిని గుర్తించిన కొన్ని పత్రికలు 2007లో 'ది మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్'గా  గుర్తించాయి. 2011లో టైమ్స్ మ్యాగజైన్ 'ది పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా గుర్తించింది. 
 
యాపిల్ బ్రాండ్ క్రేజ్... 

◆ ఆదాయం, మొత్తం ఆస్తులపరంగా చూసుకుంటే ఆపిల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ. 

◆ ప్రపంచంలో ఫోన్లు తయారుచేసే అతి పెద్ద సంస్థల్లో యాపిల్ రెండవ స్థానంలో ఉంది.

◆ ఆపిల్ కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా అక్షరాల 21 కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. ఆపిల్ ప్రధాన కార్యాలయంలో సగటు ఉద్యోగి జీతం సంవత్సరానికి 9 కోట్లు. 

◆ 2018లో ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ రోజుకు సగటున 5,72,000 ఐ ఫోన్ లను అమ్మింది.

◆ ఆపిల్ ఐప్యాడ్ కి సంబందించిన రెటీనా డిస్‌ప్లేను, శామ్‌సంగ్ కంపెనీ తయారు చేస్తుందట.  

◆ ఆపిల్ కో-ఫౌండర్ లో ఒకరు తన షేర్స్ అన్నిటిని 57వేల రూపాయలకు అమ్మేశాడు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ (US $ 35 బిలియన్) 2 లక్షల 50 వేల కోట్లు.

◆ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం నిధులకన్నా ఆపిల్ కంపెనీ దగ్గర ఉన్న డబ్బే ఎక్కువట.

◆ ప్రతి ఆపిల్ ఫోన్ యాడ్ లో కూడా ఫోన్ లోని ఉదయం టైం 09:41 అని ఉంటుందట. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ మొదటి ఐఫోన్ ని ఉదయం 09:41కి ఆవిష్కరించిన సమయం, యాడ్ లోని సమయం రెండూ ఒక్కటే!

◆ 2014 మొదటి క్వార్టర్ లో, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కలిపి సంపాదించిన దానికంటే ఆపిల్ కంపెనీనే ఎక్కువ సంపాదించింది.

◆ ఆపిల్ కంపెనీ లో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం  చాలా తేలికట.

◆ ఆపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదట. ఎందుకంటే ఇది బుల్లెట్‌ప్రూఫ్.

◆ మీరు కనుక ఆపిల్ కంప్యూటర్ల దగ్గర ధూమపానం చేసినట్లయితే దాని వారంటీ కొద్దికొద్దిగా తగ్గిపోతుందట.

◆ స్టీవ్ జాబ్స్ సీఈఓగా తన వార్షిక వేతనంగా ఆపిల్ ఖాతా నుంచి కేవలం ఒక డాలర్ ని మాత్రమే తీసుకునేవాడట. 

◆ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐఫోన్ 5 ఖరీదు (US $15 Millions) 106 కోట్లు. దీనిని 135 గ్రాముల(24 క్యారెట్లు) బంగారంతో తయారు చేశారు. చుట్టూ ఫినిషింగ్ కోసం 600 వైట్ డైమండ్స్ ని ఉపయోగించారు.