రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు. ఇది ఒకర కమైన సుగంధ భరితమైన ఆకులు కలిగి ఉంటుంది. దీని వల్ల చాలా ప్రయోజనాలు మనకి లభిస్తాయి. కరివేపాకు ఆకుల్లో ఖటికం (కేల్సియం), భాస్వరం (ఫాస్ఫరస్), నార (ఫైబర్), విటమిన్-ఎ, విటమిన్-సి ఉండడం వల్ల వీటికి పోషక విలువ ఉంది. వీటి సువాసన వల్ల ఆకులని కూరలు, చారు, పులుసు, పులిహోర, వంటి భోజన పదార్థాలలో విరివిగా వాడతారు. రోజు ఏమి తయారు చేసిన కరివేపాకు రుచి లేకపోతే ఎదో లోటు ఉంటుంది.
కరివేపాకుని కేవలం ఈ తరం వాళ్లే కాదు పురాతన కాలం నుండి భారతీయులు తమ వంటకాల్లో ఎక్కువగా వాడుతున్నారు. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వంటలకి వస్తుంది. అలానే అందానికి, ఆరోగ్యాని కి కూడా ఇది చాలా మంచిది. మరి ఇటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కరివేపాకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా......? ఇక ఆలస్యమెందుకు కరివేపాకు గురించి చూసేయండి.....
కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే...
కరివేపాకు వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అంతే కాదండి కరివేపాకు వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఐరన్ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఈ ఆకులు రోజు మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానిలో కలిపి వేసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. అలానే రక్తం లో చక్కెర స్థాయిలను సమతూకం లో ఉంచాలంటే....? నిత్యం తినే ఆహారం లో కరివేపాకును చేర్చండి. కరివేపాకు లో పీచు ఎక్కువగా ఉండడం తో రక్తం లోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది.
అలానే కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కనుక ఇది క్లోమ గ్రంథి ఉత్తేజితమై చేస్తుంది. దీని మూలం గానే ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలానే కరివేపాకు లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా వీటిల్లో ఉంటాయి. కనుక ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది ఉంచుతుంది. జ్వరం, శ్వాసకోస సమస్యలు నుండి కూడా రక్షణ ఇస్తుంది. అంతే కాదండి కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు తదితర వాటి పై ఇది అమోఘంగా పని చేస్తుంది.
కరివేపాకుని తీసుకుని కొంచెం మెత్తగా పేస్ట్ లాగ చేసుకుని దానిని వాటిపై రాసి కట్టు కడితే ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ ఎవరైనా మతి మరుపు తో ఉన్న వాళ్ళు ఉంటే జ్ఞాపక శక్తి పెరగడానికి కరివేపాకు ని ఉపయోగించండి. అలానే కంటి చూపు మెరుగు పరచడంలో కూడా అమోఘంగా పనిచేస్తుంది కరివేపాకు. జీర్ణక్రియ బాగా పని చేయాలంటే కొంచెం నీటిలో కరివేపాకు ఆకులు మరిగించి ఆ రసానికి నిమ్మ రసం, చక్కెర కలిపి దానిని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మూత్రపిండాల సమస్య వలన కలిగే సమస్యలు తగ్గాలంటే ప్రతి రోజు తినే భోజనం లో కరివేపాకుని వెయ్యండి.
జుట్టుకి బెస్ట్ హెయిర్ టానిక్ కరివేపాకు:
శిరోజాల సంరక్షణ కూడా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు కరివేపాకు ఉపయోగించడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరగడమే కాక..... అందమైన శిరోజాలు మీ సొంతం చేసుకోవచ్చు. అయితే మరి కరివేపాకు హెయిర్ టానిక్ ని ఎలా చేయాలి....? ఈ విషయం లోకి వస్తే.....
కరివేపాకు హెయిర్ టానిక్ కి అవసరమైన పదార్ధాలు :
కొంచెం కరివేపాకు
రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె
కరివేపాకు హెయిర్ టానిక్ ని తయారు చేసుకునే విధానం:
ముందు కొబ్బరి నూనె బాగా మరిగించాలి. దానిలో కరివేపాకు వేసి మరో సారి మరిగించాలి. ఈ మిశ్రమం ని కాసేపు పక్కన పెట్టి చల్లబడిన తర్వాత కరివేపాకుని వడకట్టేయాలి. ఆ తర్వాత ఆ ఆయిల్ తో జుట్టు మొత్తం ని మసాజ్ చేయాలి. కాసేపు అలాగే ఉంచేసి కొద్ది గంటల తర్వాత షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పధ్ధతి కూడా చాల సులువు. ఒకసారి ఇది తయారు చేసుకుని బాటిల్ లో పోసి స్టోర్ చేసుకోవచ్చు.
కొబ్బరి నూనె వల్ల విటమిన్ బి6 మీకు లభిస్తుంది. మీరు తలస్నానం చేయడానికి ముందు ఈ టానిక్ ని మీరు వారానికి రెండు మూడు సార్లు వాడండి ఒక నెల లో దాని ప్రభావం మీకు తెలుస్తుంది. అంతే కాదు మీ జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ b6 హార్మోన్ హార్మోన్ రెగ్యులేటర్ గా పని చేస్తుంది. మీ జుట్టు మొత్తం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది బాగా సహాయ పడుతుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు పునరుద్ధరణ శక్తి లభిస్తుంది. అలానే ఆరోగ్యకరమైన జుట్టు కూడా మీకు లభిస్తుంది.
కరివేపాకుని ఇక తీసిపారేయకండి. ఎన్నో లాభాలు ఉన్నాయి.... ఈ పద్ధతులని అనుసరించి ఆరోగ్యంగా ఉండండి.