BREAKING NEWS

మీరు తల్లి కావాలనుకుంటున్నారా...? అయితే ఈ ఆహారాన్ని తప్పక తినండి...!

నేటి కాలం లో అనారోగ్యాలు సులువుగా తలెత్తుతున్నాయి. యిట్టె ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు కదా...!  కానీ అదే లేకుండా పోతోంది. దీనికి గల కారణం మనం తినే తిండి. ఇప్పుడు తినే తిండిలో పోషకాలు తగ్గిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ పద్ధతిలో పంటల్ని పండించడం మొదలు అనేక కారణాల వల్ల ఆహారం లో పోషకాలు ఉండడం లేదు. 
 
అయితే స్త్రీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలి. లేకపోతే కుటుంబ బాధ్యతలని కొనసాగించడం కష్టమై పోతుంది. ఇదిలా ఉంటే వివాహిత మహిళలకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పని అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఇన్ని పనులు చేసుకోవాలంటే.... ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండి తీరాలి. లేకపోతే చాలా కష్టం. అదే ఆమె గర్భం ధరించాలని నిర్ణయించుకుంటే ఆమె శరీరం మరియు ఆరోగ్యం తగినదిగా ఉండాలి. సరైన ఆహారం తో ఆమె గర్భం కోసం సిద్ధం చేసుకోవాలి. 
 
గర్భధారణకు ముందు మాత్రమే కాదు గర్భ ధారణ సమయం లో కూడా తినే ఆహారమే అన్నింటికి  ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి తగినన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. తినే ప్రధాన ఆహారాలు మాత్రమే గర్భ ధారణ కి కారణం అవుతాయి అని మనకు తెలుసు. కాబట్టి శ్రద్ధ వహించడం ముఖ్యం. తల్లి అవ్వాలని అనుకునే వారు తప్పకుండా ఈ పోషకాలు తీసుకోవాలి.  ఈ పోషకాలు కొన్నింటి గురించి ఇప్పుడే తెలుసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా చదవండి.
 
నట్స్ మరియు ధాన్యాలు :
 
అక్రూట్, చియా విత్తనాలు మరియు అవిస గింజలు మొదలైన వాటిలో అత్యధిక స్థాయిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అవిసె గింజలు, సోయాబీన్ మరియు కనోలా నూనె చాలా సహాయ పడతాయి స్మూతీస్ కానీ సలాడ్లు కానీ మీరు చేసుకుంటే వీటిని ఉపయోగించి చెయ్యండి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ రొట్టె ఓట్స్ మరియు క్వినోవా ప్రధానమైన ఆహారాలు. అలాగే అధిక విలువ కలిగిన పదార్థాలు. కాబట్టి వీటిని వాడడం మంచిది.
 
వీటి వల్ల అధిక స్థాయిలో ఫైబర్ మీకు లభిస్తుంది. రోజుకి కనీసం పది గ్రాముల ఫైబర్ తీసుకోవడం చాలా మంచిది. ఇది గర్భధారణ సమయంలో డయాబెటిస్ ప్రమాదం 26 శాతం తగ్గిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.
 
పండ్లు మరియు కూరగాయలు:
 
 మనకి డాక్టర్లు చెబుతూనే ఉంటారు తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది అని అయితే మీరు మరీ ముఖ్యంగా బఠాణీలు, మొక్కజొన్న మరియు బ్రోక్లిను తీసుకోవడం మంచిది. అలానే  బ్లూ బెర్రీస్, జామకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ ప్రయోజనకరంగా ఉంటాయి. పచ్చి కూరగాయలు కూడా తినడం మంచిది. అలాగే కిడ్నీ బీన్స్, బీన్స్, బఠాణీలు మరియు వేరుశనగ లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు.
 
పాలు :
 
పాల ఉత్పత్తులు అధికంగా ప్రోటీన్లు ఉంటాయి మరియు పొటాషియం కూడా ఉంటుంది పగటిపూట పాల ఉత్పత్తులు తీసుకోండి మంచిది. పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి చాల మంచిది. కనుక వీలైనంత వరకు మీరు వీటిని తీసుకోండి. ఆరోగ్యానికి ఔషధంలా పని చేస్తాయి. 
 
చక్కెర:
 
చక్కెర తీసుకోవడం తగ్గించండి. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడే స్వీట్స్  గర్భధారణ సమయం లో తినకూడదు. చక్కెర ఎక్కువ తీసుకుంటే గర్భధారణ సమస్యలకు కారణం అవుతుంది కాబట్టి వీలైనంత వరకు చక్కెర స్థాయిని తగ్గించండి. అప్పుడు ఈ సమస్య కలుగదు. 
 
కెఫిన్ :
 
కెఫిన్ తగ్గించండి అలవాటు చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కెఫిన్ స్థాయిని తగ్గించడం మంచిది రోజుకు 200 మిల్లీ గ్రాములు కెఫిన్ కంటే ఎక్కువగా తీసుకోవద్దు. ఆ స్థాయి దాటితే ప్రమాదమే. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భస్రావం సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ కెఫిన్ ని కట్ చెయ్యడం అలవాటు చేసుకోండి. 
 
ఫోలిక్ ఆమ్లం :
 
విటమిన్ బి నైన్ ఎక్కువగా తీసుకోవాలి. గర్భధారణకు ముందు మహిళలు 400 మిల్లీ గ్రాములు ఫోలిక్ శక్తి ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. పోలిక్ ఆమ్లం అధికంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన కణజాల లో పెంచడానికి సహాయ పడుతుంది మరియు తులసి బ్రోకలీ మొదలైన వాటి లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి వీటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆలివ్ ఆయిల్ తో పాటు కొద్దిగా సలాడ్ మరియు ఆమ్లెట్లు చేర్చవచ్చు. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 
చూసారు కదా..! ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మరి అలానే అనుసరించి ఏ సమస్య లేకుండా హాయిగా ఉండండి. ఇలా కనుక పాటిస్తే తల్లి కావాలనుకునేవారు ఎంతో ఆరోగ్యంగా ఏ సమస్య లేకుండా ఉండవచ్చు.