BREAKING NEWS

పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..!

భారత దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత, అద్భుతం కలిగిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇటువంటి అద్భుతమైన ఆలయాలని  జీవితం లో ఒక్క సారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అటువంటి ఆలయాల్లో ఎంత గానో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయం కూడా ఒకటి. పూరీ ఒరిస్సా రాష్ట్రం లో భారత దేశం లో తూర్పు వైపు బంగాళాఖాత తీరం లో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరం లో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది.
 
భారతదేశంలో ప్రజలు హిందూమత తీర్థయాత్రలు పూరీని సందర్శించినప్పుడు మాత్రమే  యాత్ర పూర్తయిందని భావిస్తారు. ఇక్కడ రాధా, దుర్గా, లక్ష్మీ, పార్వతి, సత్తి మరియు కృష్ణ తో పాటు శక్తి నిలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని జగన్నాథం యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం అటువంటి గొప్ప ఆలయం గురించి అనేక విషయాలు ఇప్పుడే తెలుసుకోండి.....
 
పూరి జగన్నాథ్ ఆలయం:
 
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రధయాత్ర నిర్వహిస్తారు. ఎంతో ప్రఖ్యాతమైనది మరియు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయాన్ని 1078 వ సంవత్సరంలో నిర్మించారు. కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్ని ఉన్న ప్రతి దానికి ఏదో ఒక విశిష్టత కలిగి ఉండటం విశేషం. ఈ ఆలయానికి ఉన్న అద్భుతాలు మరియు ప్రత్యేకత ఏ ఆలయానికి ఉండదు అనడంలో సందేహమే లేదు.
 
పూరి జగన్నాథ్ ఆలయం గోపురం :
 
ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు. కానీ ఈ ఆలయంలో గోపురం నీడ మాత్రం కనిపించదు. అది పగలైనా రాత్రయినా అస్సలు ఇక్కడ గోపురం నీడ కనిపించదు. ఇది దేవుడి  కోరిక అని కొందరు అంటుంటారు... అలానే ఆలయ గొప్పతనం అని మరికొందరు అంటారు. 
 
పూరి జగన్నాథ్ ఆలయ రథయాత్ర: 
 
ఇక్కడ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రథ యాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురు తో రథాల ముందు ఊడ్చి తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభం అవుతుంది. పూరీ వీధుల్లో శ్రీకృష్ణ, బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు 35 అడుగుల వెడల్పు ఉంటుంది. దానికి సుమారు 16 చక్రాలు ఉంటాయి. అయితే మొత్తం ఈ రథ యాత్ర లో రెండు రథాలని  లాగుతారు.
 
మొదటి రథం దేవుళ్ళను రథం వరకు తీసుకెళుతుంది ఆ తర్వాత మూడు చెక్క పడవలలో దేవతలు నది దాటాలి.... అక్కడ నుంచి మరో రథం దేవుళ్లను గుండిచ ఆలయానికి తీసుకెళుతుంది. ఈ ఆలయానికి చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోవడం విశేషం. ఆ తర్వాత సాయంత్రం 6 తర్వాత ఆలయ తలుపులు మూసి వేయడం జరుగుతుంది. ఈ రథ యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది.
 
పూరీలో అలలు :
 
సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటి పూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపు ఉంటుంది సాయంత్రం పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపు వస్తుంది. కానీ పూరీ లో మాత్రం అంతా రివర్స్. ఇలా వ్యతిరేకంగా గాలి వీయడం దీని విశేషత.
 
పూరి జగన్నాథ ఆలయంలో ప్రసాదాలు:
 
ఈ దేవుడికి 56 రకాల ప్రసాదాలను సమర్పిస్తారు. ఇది ఆలయ సంప్రదాయం. ఈ ప్రసాదాలు అన్నిటిని కూడా ఆలయ వంటశాల లోని మట్టికుండలో తయారు చేస్తారు. ఈ ప్రసాదాల్లో మరో విశేషం ఏంటంటే...?  ముందు ప్రసాదాలుకి ఎటువంటి రుచి వాసన ఉండదు. దేవునికి సమర్పించిన తర్వాత దానంతట అదే గుమగుమలాడి దానితో  పాటు రుచి కూడా వస్తుంది.
 
మరి కొన్ని ఆలయాలు :
 
పూరి జగన్నాథ్ ఆలయం తో పాటు చక్ర తీర్థా ఆలయం, ముసిమ ఆలయం, సునర గౌరంగ్ ఆలయం, శ్రీ లోక్నాథ్ ఆలయం, శ్రీ గుండిచ ఆలయం, అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలు ఉన్నాయి.
 
ఎప్పుడు సందర్శించాలి, ఎలా వెళ్ళాలి? 
 
ఈ ఆలయాన్ని సందర్శించడానికి జూన్ నెల నుండి మార్చి నెల వరకు సరైన సమయం. పూరి జగన్నాథ్ ఎలా వెళ్లాలి అనే విషయానికి  వస్తే.... ఒరిస్సా లోని పూరి క్షేత్రానికి దేశం లోని అన్ని ప్రాంతాల్లో రవాణా సదుపాయం ఉంది. భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం ఊరికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. అదే రైలు మార్గం లో వచ్చే వాళ్ళు దేశం లోని ప్రధాన నగరాల నుంచి పూరి కి  రైలు సర్వీసులు నడుస్తున్నాయి.  అలాగే రోడ్డు మార్గం లో వచ్చే వాళ్ళు భువనేశ్వర్ కోల్కత్తా విశాఖపట్నం నుంచి డైరెక్ట్  బస్సు సౌకర్యం కూడా ఉంది కాబట్టి సులువుగా చేరుకోవచ్చు.