BREAKING NEWS

హైదరాబాద్ లో తప్పక చూడవలసిన ప్రదేశాలు...!

 హైదరాబాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే  దానికి పరిచయం ఇవ్వక్కర్లేదు. హైదరాబాద్ చాలా విషయాలకు ప్రసిద్ధి. బిర్యానీ, పాన్ మరియు చారిత్రక ప్రదేశాలు కాకుండా..... ఒకే రోజులో ఎన్నో ప్రదేశాలు అక్కడ మీరు చూడవచ్చు. అయితే హైదరాబాద్ లో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏమిటా అని అనుకుంటున్నారా......?  మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాల గురించి ఇప్పుడే చూసేయండి. ఆ తర్వాత మీ కుటుంబ సమేతంగా ప్లాన్ చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోండి. ఒక రోజు పర్యటనను మరింత ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా మీరు అక్కడ గడపవచ్చు. ఈ ఐదు ముఖ్య ప్రదేశాలను మీరు చూశారంటే ఎంతో బావుంటుంది కాబట్టి మీరు వీటి గురించి తెలుసుకోండి...
 
చార్మినార్:
 
నిజంగా చార్మినార్ లాడ్ బజార్ దగ్గర షికారు చూస్తే ఎంతో బావుంటుంది ఎప్పుడైనా మీరు కనుక చార్మినార్ లాడ్ బజార్ లో షికారు చేయకపోతే ఇప్పుడైనా చేసేయండి. ఈ నైట్ మార్కెట్ పాత నగరానికి మరియు చార్మినార్ కు దగ్గరగా ఉంది. ఇక్కడ ఎంతో రుచికరమైన ఆహారం మరియు ఎంతో చవకైన బట్టలని మీరు కొనుగోలు చేయవచ్చు. మీరు కొనుక్కోవాల్సిన ఏ వస్తువులు అయినా ఇక్కడ చవకగా దొరుకుతాయి. అదే రంజాన్ వేళలో మీరు ఇక్కడికి వెళ్తే చాలా రద్దీగా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
 
ఇతర రోజుల్లో కూడా ఈ ప్రాంతమంతా రద్దీగా సందడిగానే ఉంటుంది. చాలా మంది ఇక్కడ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు. ఈ ప్రదేశం అంతా కూడా వ్యాపారుల సామగ్రితో నిండిపోతుంది. చూపు తిప్పుకోలేని అన్ని వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఈ మార్కెట్ చార్మినార్ అంత పాతది. ఇక్కడ నుంచి అందమైన జ్ఞాపకాలను కూడా మీరు తీసుకెళ్లవచ్చు.
 
ఈ మార్కెట్లో మంచి అందమైన ఇయర్ రింగ్స్ అలానే ఆర్టిఫిషియల్ జువెలరీ వంటివి ఎన్నో కొనుగోలు చేయవచ్చు. అలానే చెప్పులు, ఫ్యాన్సీ చెప్పులు లాంటివి ఎక్కువగా దొరుకుతాయి. అది కూడా చాలా తక్కువ ధరకే... కాబట్టి ఎప్పుడైనా హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటే చార్మినార్ లాడ్ బజార్ కి మాత్రం తప్పక వెళ్ళండి .
 
హుస్సేన్ సాగర్ :
 
మన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం చెప్పుకునే తీరాలి. హుస్సేన్సాగర్ గుండె ఆకారంలో ఉన్న సరస్సు. ఇది సుమారు 5.7 కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉంది. దీనిని గోల్కొండ సామ్రాజ్య పాలకుడు కుతుబ్ షా వాలి నిర్మించారు. 1992 వ సంవత్సరంలో ఇక్కడ గౌతమ బుద్ధ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇది కళ్లకు విందు చేసే ప్రదేశం అని అనాలి. రాత్రిపూట ఈ విగ్రహం అంతా కూడా విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. ఇక్కడ కనక కాసేపు గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకోకపోతే ఏదో లోటు ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ వెళితే కచ్చితంగా ఇక్కడ సెల్ఫీ తీసుకోవడం మర్చిపోకండి.
 
బిర్లా మందిర్:
 
 బిర్లా మందిర్ చూడడానికి ఎంత బావుంటుందో వర్ణించడం అనవసరం. అనేక మంది భక్తులను ఈ బిర్లా మందిర్ ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. తప్పకుండా బిర్లామందిర్ చూసి వెళ్లాలి ఈ పాల రాయి ఆలయం ఒక కొండ పై నిలబడి ఎంతో అందంగా ఉంటుంది. కేవలం ఆధ్యాత్మిక ప్రియులకి మాత్రమే ఇది పరిమితం కాదు. ఎవరైనా ఈ బిర్లా మందిర్ లో ప్రశాంతంగా గడపవచ్చు.
  
సాలార్ జంగ్ మ్యూజియం:
 
 మీకు ఒకే రోజు సమయం ఉన్నప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం మాత్రం విడిచి పెట్టకండి. ఈ మ్యూజియం చారిత్రక ప్రాముఖ్యత మాత్రమే కాదు ప్రత్యేకమైన నిర్మాణ లక్షణాలు కూడా ప్రశంసలు అందుకుంది. దీని యొక్క నిర్మాణ వైభవాన్ని మాత్రం మీరు చూడాల్సిందే. దేశంలోని మూడు ప్రధాన జాతీయ మ్యూజియంలలో ఇది ఒకటి. ఈ ప్రదేశంలో అందమైన శిల్పాలు పెయింటింగ్ లు., పింగాణీ మరియు కార్డ్ బోర్డు వంటి వాటితో తయారు చేసి ఉన్నాయి.
 
 అనేక మూలల నుంచి వీటిని సేకరించడం జరిగింది. ఈ తెల్లని పాలరాయి ఎత్తైన ప్రాంగణం సందర్శకుల్ని అలరిస్తుంది. నవాబ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ ఇంత అందమైన, విలువైన వస్తువులతో ఈ మ్యూజియాన్ని చాలా సంవత్సరాల పాటు తయారు చేశారు. మరి అటువంటి సుందరమైన ప్రదేశాన్ని చూడకుండా ఉంటే ఏమైనా బాగుంటుందా..? 
 
 గోల్కొండ :
 
గోల్కొండ కోట గురించి పరిచయం అవసరమేమో...?  గోల్కొండ కోట గురించి అందరికీ తెలిసినదే సందర్శించినప్పుడు గోల్కొండ కోటను తప్పక సందర్శించండి. ఈ కోట సముద్ర మట్టానికి 390 అడుగుల ఎత్తులో ఉంది. అలానే దాని చుట్టూ యుద్ధంలో దెబ్బతిన్న భూమి కూడా ఉంది. శత్రువుల నుంచి మరియు సైన్యం రక్షణ కోసం కాకతీయ రాజులు ఈ కోటను నిర్మించారు. ఆ తర్వాత దీన్ని రాణి రుద్రమదేవి పునర్నిర్మించారు.  తర్వాత ఇది కోహినూరు వజ్రాలు నివాసంగా ఉంది. ఈ కోట చాలా ఎత్తయిన ది మరియు ఎంతో అందమైనది ఈ ప్రదేశాన్ని కూడా మీరు హైదరాబాద్ వెళ్తే తప్పక చూడండి.
 
ఒకే రోజు సమయం ఉంటే ఈ ప్రదేశాలని మాత్రం చూసేయండి. ఎందుకంటే ఇవి బాగా పురాతనమైనవి, ప్రసిద్ధి చెందినవి, ప్రత్యేకమైనవి.