BREAKING NEWS

కమల హ్యారిస్ కి భారత్ లో మూలాలు....!

కమల హ్యారిస్ పేరు ఇప్పుడు మారుమ్రోగి పోతోంది. ఈమె నిజంగా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిపొయింది. అందులోను ఈమె కి భారత దేశం లో మూలాలు ఉండడం తో ఈమె సెన్సేషనల్ గా మారింది. మరి హ్యారిస్  గురించి,  హ్యారిస్ కి భారత్ లో ఉన్న మూలాలు గురించి, ఆమె బాల్యం మరియు విద్యాభ్యాసం వంటి ఎన్నో వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇంక ఆలస్యంగా ఎందుకు ఇప్పుడే చూడండి.... 
 
ఇటీవలే అమెరికా లో ఎన్నికలు అయిన సంగతి తెలిసినదే. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అధ్యక్షుడిగా నిలిచాడు. కమల హ్యారిస్ఉ పాధ్యక్షుడుగా ఎన్నిక అవ్వడం  జరిగింది. అయితే అధ్యక్షుడు గురించి కంటే కూడా ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన కమల హ్యారిస్ మీద చర్చ ఇప్పుడు జోరుగా కొన సాగుతోంది. మన భారత దేశంలో ఈమె కోసం ఇంతగా చర్చించుకోవడానికి కేవలం ఒకే ఒక కారణం...! అది ఏమిటంటే..?  ఆమె కి  భారతీయ మూలాలు ఉండడమే. 
 
కమల హ్యారిస్ కి భారత దేశం లో మూలాలు:

 
కమల హ్యారిస్ కి భారత దేశంలో మూలాలు ఉన్నాయి. వీటి వివరాల లోకి వెళితే... కమల హ్యారిస్
తల్లి తమిళనాడు రాష్ట్రం లో జన్మించారు. అందుకే కమల  హ్యారిస్ విజయం  సాధించడం తో భారత్ లో సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఈమె అంత గొప్ప ఘనత సృష్టించింది మరి. ఇది ఇలా ఉండగా  కమల హ్యారిస్ తల్లి  శ్యామల గురించి పూర్తిగా ఇప్పుడే చూసేయండి..... కమల హ్యారిస్  తల్లి శ్యామల గోపాలం భారత్ నుండి యునైటెడ్ స్టేట్స్ కి వెళ్లడం జరిగింది. ఈమె మద్రాసు లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో డాక్టరేట్ అందుకున్నారు. 1958 వ సంవత్సరంలో కమల హ్యారిస్ తల్లి యుఎస్ కి చేరుకున్నారు. అప్పట్లో తన తల్లి భారత దేశం  లో ఉన్న కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాసేది.
 
ఉత్తరాలు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రెండు వారాల వరకూ పట్టేది. పీహెచ్డీ అయిపోయిన తర్వాత ఈమె UC Berkeley  లో స్థిరపడి   రొమ్ము క్యాన్సర్ మీద  రీసెర్చ్ చేసేవారు. అందులో ఆమె విజయం సాధించారు. ఇది నిజంగా గొప్ప విషయం కదా...?  అది అయ్యాక ప్రపంచం లో అనేక విశ్వవిద్యాలయాల్లో ఆమె టీచింగ్ అండ్ రీసెర్చ్ కూడా మొదలుపెట్టారు. Illinois and the University of Wisconsin లో కూడా ఈమె పని చేయడం జరిగింది.
 
 1960 వ దశకం లో, గోపాలన్ తన భర్త మరియు ఆమె పిల్లల తండ్రి అయిన వ్యక్తిని కలవడం జరిగింది. ఇద్దరూ  (జమైకా నుండి హారిస్) యుసి బర్కిలీ లో డాక్టరేట్లు పొందారు మరియు పౌర హక్కుల ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. అయితే వారు నిరసనలో సమావేశమయ్యారు. ఈ జంట 1963 లో వివాహం చేసుకుంది మరియు ఉద్యమం లో పాలుపంచుకుంది, అప్పుడప్పుడు వారి కుమార్తెలను కూడా తీసుకుని వచ్చేవారు. ఇది ఇలా ఉండగా తన తల్లి మాత్రం ఎంతో మంది విద్యార్థులకి విద్య నేర్పించేవారు.  
 
కమల హ్యారిస్ కి 12 సంవత్సరాల వయసప్పుడు కెనెడా తీసుకొచ్చేసింది. కమల హ్యారిస్ తల్లి కి  1963 లో వివాహం జరిగింది. ఆ తరువాత 1970లో వీరి ఇద్దరికి విడాకులు అవ్వడం తో విడిపోవడం కూడా జరిగింది. అప్పుడు కమలా హ్యారిస్  వయసు కేవలం 7 సంవత్సరాలు. ఈమె తల్లి మాత్రం రేషియల్ క్వాలిటీ మీద ఫైట్ చేస్తూ ఉండేది. కమల హ్యారిస్ 2019లో ఒక  ఆటోబయోగ్రఫీ రచించడం జరిగింది. దానిలో ఆమె నా తల్లి ఇంటి పనులు చేస్తూ పొలిటికల్ యాక్టివేషన్ అండ్ లీడర్షిప్ మీద ప్రధానంగా పని చేసేవారు అని ఆమె చెప్పింది.  
 
మా తల్లి కూతుర్ల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువ అని హ్యారిస్ చెప్పారు. కష్టాలని ఎలా ఎదుర్కోవాలో మా అమ్మ నాకు నేర్పించారు అని హ్యారిస్ చెప్పడం జరిగింది. కానీ 2009 లో హ్యారిస్ తల్లి కి పెద్దప్రేగు కాన్సర్ రావడం తో ఆమె మరణించింది. ఇతరులకు సేవ చేస్తేనే  జీవితానికి అర్థాన్ని ఇస్తుందని నా తల్లి నాకు నేర్పింది అని ఆమె అంది.  ఈ రాత్రి ఆమె ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాని ఆమె పై నుండి నన్ను చూస్తుందని నాకు తెలుసు అని ఆమె మాట్లాడారు. 
 
కాలిఫోర్నియా లోని ఓక్లాండ్ ‌లోని కైజర్ హాస్పిటల్‌లో నాకు జన్మనిచ్చిన 25 ఏళ్ల భారతీయ మహిళ, ఐదు అడుగుల పొడవు..... ఆమె కోసమే ఆలోచిస్తూన్నాను అని అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడిగా  నామినేషన్ ని నేను అంగీకరిస్తున్నాను అని ముగించారు.