BREAKING NEWS

కోటిపల్లి కోటీశ్వరాలయం విశిష్టత, విశేషాలు..!

కోటిపల్లి ఆలయం గురించి పరిచయం అక్కర్లేదు. ఈ ఆలయం అందరికీ సుపరిచితమే. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా కె.  గంగవరం పూర్వపు పామర్రు మండలంకి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పామర్రు నుంచి పది కిలో మీటర్ల దూరంలో సమీప పట్టణమైన రామచంద్రపురం నుంచి 16 కిలో మీటర్ల దూరంలో ఉంది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత ఛాయ సోమేశ్వర స్వామి వారు, అమ్మ వారితో కూడిన కోటేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సహిత జనార్థన స్వామి వారు ఉంటారు.
 
బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రం గురించి బాగా వివరించడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఇంద్రుడు, చంద్రుడు కశ్యపమహర్షి ప్రతిష్టించారని చెబుతారు. అయితే ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుని, సోమేశ్వరుని చంద్రుడు ప్రతిష్టించి తన పాపాలు పోగొట్టుకున్నాడు అని అంటారు. మరి ఇటువంటి మహోత్తరమైన ఆలయం గురించి అనేక విషయాలను ఇప్పుడే తెలుసుకోండి.. ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.
 
మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కోటిపల్లి కోటేశ్వరాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఈ ఆలయం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నది తీరాన వెలసినది ఈ ఆలయం.
  
కోటిపల్లి ఆలయ విశేషాలు :
 
ఇక్కడ ఉన్న గౌతమీ నది లోని పుణ్య స్నానం ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని, పుణ్యం వస్తుందని అంటారు. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పునః పునః చెబుతుంది. ఇక్కడ అర్చకులు ప్రతి రోజు తెల్లవారు జామున కోటి తీర్థం నుంచి జలాలు తీసుకొని వచ్చి స్వామి వారికి అభిషేకం, అర్చన చేస్తారు. ఇక సాయంకాలం వేళ అయితే స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఎంతో మహోత్తరమైన, చరిత్రగల ఈ ఆలయానికి భక్తులు తరలివస్తారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమ ప్రభాతపురం అని పిలిచేవారు. ఎందుకంటే సోమగుండం అనే ఒక పెద్ద పుష్కరిణి ఇప్పటికీ కూడా ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని కూడా చెబుతారు. అలాగే ఈ దేవాలయంలోనే చంద్రమౌళీశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం సమేత మృత్యుంజయ లింగం నవగ్రహాల గుడి కూడా ఉన్నాయి. 
 
కోటిపల్లి ఆలయానికి ఎలా వెళ్లాలి?
 
తూర్పు గోదావరి జిల్లా కె. గంగవరం మండలం లో ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నది తీరాన ఉన్న ఈ ఆలయాన్ని ఎలా దర్శించాలంటే..? కాకినాడ నుంచి బస్సు సౌకర్యం ఉంది కాబట్టి కాకినాడ వరకు రైలు లేదా బస్సు లో వెళ్ళినా అక్కడి నుంచి డైరెక్ట్ బస్సు సౌకర్యం ఉంది కాబట్టి సులువుగా చేరుకోవచ్చు. కాకినాడ నుంచి ఈ ఆలయం 40 కిలోమీటర్ల దూరంలో ఇది. 40 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి కానీ ఎటువంటి అలసట, బాధ ఉండదు. 
 
ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎంతో అందంగా ఉంటుంది. ఇరువైపులా కొబ్బరి చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. అక్కడక్కడ రొయ్యల చెరువులు, బస్సు వేగానికి చల్లటి గాలులు వీస్తుంటే మన ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది. చిన్న చిన్న పల్లెటూర్లు, అందమైన ప్రకృతి, చల్లటి వాతావరణం వీటి మధ్య ప్రయాణం చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది.
 
కోటిపల్లి ఆలయ మహత్యం:
 
వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణం లోని గౌతమి మహత్యం లో ఈ కోటిపల్లి క్షేత్ర మహత్యం ఉంది. ఈ క్షేత్రము పూర్వ కాలంలో కోటి తీర్థం గాను సోమ ప్రభాపురముగాను పిలువబడి, నేడు కోటిపల్లి మహా క్షేత్రముగా ఖ్యాతి గాంచింది. అలానే ఈ ఆలయం పుష్కరాల సమయంలో రద్దీగా ఉంటుంది. గోదావరి పుష్కరాలు వచ్చాయంటే  ఈ ఆలయాన్ని అంగరంగ వైభవంగా  ముస్తాబు చేస్తారు. 
 
కోటిపల్లి క్షేత్ర విశిష్టత:
 
మనం ముందు చెప్పుకున్నట్లు గానే ఈ ఆలయ ప్రాంగణం లో ఉమా సమేత కోటేశ్వరాలయం, శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం, భోగలింగం ఆలయాలు కూడా ఉన్నాయి. ధ్వజస్తంభము, నందీశ్వరుడు ఆలయం ముందు ఉంటాయి.  రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయంలో పండుగలు ఘనంగా జరుగుతాయి. పర్వదినాల అప్పుడు, పండుగలప్పుడు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి సందర్శిస్తారు.
 
రాజరాజేశ్వరి సైతం సోమేశ్వరాలయంలో ఉత్సవాలు:
 
శ్రీ రాజరాజేశ్వరి సరిత సోమేశ్వర ఆలయంలో దసరా ఉత్సవాలు, కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. కోటి తీర్థం నుండి జలాలు తీసుకు వచ్చి స్వామికి అభిషేకం అర్చన చేస్తారు. అలానే సాయంత్రం వేళ ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ ఇలా ఎన్నో నిర్వహిస్తూ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.